Tips For Paneer Storage: పనీర్‌ను వారాల తరబడి తాజాగా ఉంచుకోవడం ఎలా? ఈ టిప్స్ ఫాలో అయ్యారంటే ఫ్రిజ్ కూడా అవసరం లేదు!-tips for paneer storage how to keep paneer fresh for long period without fridge ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Tips For Paneer Storage: పనీర్‌ను వారాల తరబడి తాజాగా ఉంచుకోవడం ఎలా? ఈ టిప్స్ ఫాలో అయ్యారంటే ఫ్రిజ్ కూడా అవసరం లేదు!

Tips For Paneer Storage: పనీర్‌ను వారాల తరబడి తాజాగా ఉంచుకోవడం ఎలా? ఈ టిప్స్ ఫాలో అయ్యారంటే ఫ్రిజ్ కూడా అవసరం లేదు!

Ramya Sri Marka HT Telugu
Published Feb 17, 2025 02:04 PM IST

how to keep paneer fresh without fridge: పనీర్‌ను ఎక్కువ కాలం తాజాగా, మృదువుగా ఉంచడం ఎలాగో మీకు తెలుసా? తెలియకపోతే ఈ చిట్కాలు మీ కోసమే. ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయ్యారంటే నెలలు గడిచినా పనీర్ తాజాగా, సాఫ్ట్‌గా ఉంటుంది. ఆలస్యం చేయకుండా అవేంటో చూసేద్దాం రండి..

పనీర్‌ను ఎక్కువ కాలం తాజాగా ఉంచాలంటే ఏం చేయాలి?
పనీర్‌ను ఎక్కువ కాలం తాజాగా ఉంచాలంటే ఏం చేయాలి? (Shutterstock)

పిల్లల నుంచి పెద్దలు వరకూ దాదాపు అందరూ పనీర్‌ను ఇష్టపడతారు. ముఖ్యంగా రోజూ తినే రొటీన్ ఆహార పదార్థాలు బోర్ కొట్టినప్పుడు, ప్రత్యేకంగా ఏదైనా తినాలనిపించినప్పుడు పనీర్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. దీని రుచిలో అలాంటి ప్రత్యేకత ఉంటుంది. రుచిలో మాత్రమే కాదు ప్రొటీన్లకు కూడా చక్కటి మూలం పనీర్. శాఖాహారులకు ఇది చక్కటి ప్రోటీన్ ఫుడ్.

అందుకే చాలా మంది ఆహార ప్రియులతో పాటు ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించే వారు కూడా పనీర్‌ను ఎప్పుడూ తమ డైట్లో ఏదో ఒక రూపంలో ఉండేలా ప్లాన్ చేసుకుంటారు. ఇక్కడ సమస్య ఏంటంటే.. పనీర్ ను ఎక్కువ కాలం నిల్వ చేయడం కష్టం. ముఖ్యంగా ఫ్రిజ్ లేకుండా పనీర్ త్వరగా ఎండిపోతుంది, పాడైపోయి దుర్వాసన వస్తుంది. కొన్నిసార్లు ఫ్రిజ్ లో ఉంచినప్పటికీ కైడా తాజాగా, మృదువుగా అనిపించదు. పైగా రుచిలో, రంగులో కూడా తేడాలు ఏర్పడతాయి. మీ ఇంట్లో కూడా ఇలాగే జరుగుతుంటే ఈ టిప్స్ మీకు చాలా బాగా సహాయపడతాయి. ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయ్యారంటే నెలలు గడిచినా పనీర్ తాజాగా, సాఫ్ట్‌గా ఉంటుంది. పనీర్‌ను ఎక్కువ కాలం తాజాగా ఉంచాలంటే ఏం చేయాలో తెలుసుకుందా రండి.

పనీర్‌ను నిల్వ చేయడానికి సరైన పద్ధతులు ఏంటి?

1. నీటిలో నిల్వ చేయండి

పనీర్‌ను ఎక్కువ కాలం తాజాగా ఉంచుకోవాలంటే దానిని నీటిలో నిల్వ చేయవచ్చు.

  • ఇందుకోసం మీరు ఒక కంటైనర్ తీసుకుని దాంట్లో చల్లటి నీరు పోయాలి.
  • ఈ నీటిలో కొద్దిగా ఉప్పు లేదా నిమ్మరసం వేసి కలపండి.
  • దీనిలో మీ పన్నీరును వేసి ఫ్రిజ్‌లో నిల్వ చేయండి.
  • ప్రతి రెండు రోజులకు ఒకసారి నీటిని మార్చుతూ ఉండండి.
  • ఇలా చేశారంటే వారాల తరబడి మీ పనీర్ తాజాగా, మృదువుగా ఉంటుంది. రుచిలో కూడా ఢోకా ఉండదు.

ఈ పద్ధతిలో ఫ్రిజ్ లేకుండా కూడా పన్నీరును ఎక్కువ కాలం తాజాగా ఉంచుకోవచ్చు.

2. బట్టలో చుట్టి నిల్వ చేయండి

పన్నీరు తరచుగా చాలా త్వరగా ఎండిపోతుంది, దాని టెక్స్చర్ రబ్బరులా మారుతుంది. అలాంటి సందర్భంలో, మీరు దానిని ఎక్కువ కాలం తాజాగా ఉంచుకోవడానికి సన్నని నూలు బట్టలో కూడా నిల్వ చేయచ్చు.

  • ఇందుకోసం మీరు ముందుగా ఒక శుభ్రమైన బట్టను తీసుకుని నీటిలో ముంచి నీరు పిండేయాలి.
  • తర్వాత బట్ట తడిగా ఉన్నప్పుడే దాంట్లో పనీర్ పెట్టి పూర్తిగా చుట్టేయాలి.
  • ఇప్పుడు దీన్ని ఏదైనా పాత్రలో లేదా కంటైనర్‌లో పెట్టి మూత పెట్టి నిల్వ చేయండి.
  • ప్రతి నాలుగు నుండి ఐదు గంటలకు ఒకసారి బట్టను తేలికగా తడి చేస్తూ ఉండండి.

ఇలా చేయడం వల్ల పనీర్ ఎక్కువ కాలం తాజాగా ఉంటుంది. ఈ పద్ధతిలోనే ఫ్రిజ్ లో కూడా పనీర్ ను నిల్వ చేసుకోవచ్చు.

3. ఎయిర్‌టైట్ డబ్బాలో నిల్వ చేయండి

పన్నీరు ఎక్కువ కాలం తాజాగా ఉండాలంటే దానిని తేమతో నిండేలా, బ్యాక్టీరియా పెరుగుదల నుండి దూరంగా ఉంచాలి.

  • దీనికి మీరు పన్నీరును ఎయిర్‌టైట్ కంటైనర్‌లో నిల్వ చేయవచ్చు.
  • కంటైనర్ పూర్తిగా శుభ్రంగా ఉండాలని గుర్తుంచుకోండి.
  • అదనంగా, మీరు కంటైనర్‌లో పేపర్ టవల్ కూడా పరచవచ్చు, దీనివల్ల పన్నీరు అదనపు తేమ పోతుంది, పన్నీరు ఎక్కువ కాలం తాజాగా ఉంటుంది.

నెల రోజులు అయిన తాజాగా ఉండాలంటే..

మీరు పన్నీరును నెల రోజులు కూడా తాజాగా ఉండేలా నిల్వ చేయవచ్చు.

  • దీనికి మీరు పన్నీరును ముందుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, ప్లాస్టిక్ రేపర్లో పెట్టి కవర్ చేయాలి.
  • ఇప్పుడు వాటిని ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్ లేదా ఫ్రీజర్ బ్యాగ్‌లో నిల్వ చేయండి.

తరువాత పనీర్‌ను ఉపయోగించాలనుకున్నప్పుడు ముందుగా తేలికగా వేడి చేసిన నీటిలో కొంత సేపు ఉంచండి. ఆ తర్వాత సాధారణంగా ఉపయోగించవచ్చు.

Ramya Sri Marka

eMail
మార్క రమ్యశ్రీ హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ లైఫ్‌స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు.జర్నలిజంలో ఎనిమిదేశ్లకు పైగా అనుభవం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. 2024 నవంబరులో హెచ్.టి తెలుగులో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం