Pasta Tips and Tricks: పాస్తా ఉడికించేటప్పుడు ఈ చిట్కాలు పాటించారంటే అతుక్కోకుండా ఫర్ఫెక్ట్‌గా వస్తుంది
Pasta Tips and Tricks: పిల్లలు ఎంతో ఇష్టంగా తినేదీ, తల్లులు చాలా ఈజీగా చేయగలిగే బ్రేక్‌ఫాస్ట్ లేదా డిన్నర్‌లలో పాస్తా ఒకటి. కొన్నిసార్లు దీన్ని ఉడికించినప్పుడు మరీ మెత్తగా అయిపోతుంది, ఒకదానికి ఒకటి అంటుకుపోయి రుచి చెడిపోతుంది. ఇలా కాకుండా ఉండాలంటే పాస్తా ఉడికించేటప్పుడు కొన్ని చిట్కాలు పాటించాలి.
పాస్తా అంటే పిల్లలకు, పెద్దలకూ కూడా చాలా ఇష్టం. దీన్ని తయారు చేయడం కూడా చాలా త్వరగా, సులువుగా అవుతుంది. అందుకే ఈ రోజుల్లో చాలా మంది తల్లులు తమ పిల్లలకు పాస్తాను బ్రేక్‌ఫాస్ట్‌గా లేదా డిన్నర్ గా చేసి ఇస్తున్నారు. మితంగా తింటే పాస్తా ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనాలు అందిస్తుందని రోగ్య నిపుణులు కూడా చెబుతుంటారు. అయితే పాస్తా సరైన పద్ధతిలో ఉడికిస్తేనే రుచిగా ఉంటుంది. లేదంటే మరీ మెత్తగా మారిపోవడం, ఒకదానికి ఒకటి అంటుకుపోవడం వంటివి జరుగుతాయి. ఇది పాస్తా రుచిని చెడగొట్టేస్తుంది. మీకు అలాగే జరుగుతుంటే ఈసారి పాస్తాను తయారు చేసేటప్పుడు ఈ టిప్స్ పాటించంండి. ఇలా చేయడం వల్ల పాస్తా పర్ఫెక్ట్‌గా , టేస్టీగా తయారవుతుంది.
![yearly horoscope entry point](https://telugu.hindustantimes.com/static-content/1y/astro-pages-content/astro-entry-point-mobile.png)
పాస్తాను ఉడకబెట్టేటప్పుడు పాటించాల్సిన చిట్కాలు:
గిన్నె పరిమాణం:
పాస్తా ఉడికించేటప్పుడు చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే చిన్న గిన్నెలో ఉడికించడం. కళాయి లేదా గిన్నె చిన్నగా ఉండి నీరు తక్కువగా ఉంటే పాస్తా సరిగ్గా ఉడకదు. ఒక దానికి ఒకటి అంటుకుంటుంది. ముద్దలు ముద్దలుగా మారుతుంది. పాస్తా లేదా నూడుల్స్ ఉడకబెట్టడానికి ఒక పెద్ద గిన్నెను తీసుకోండి. వంట చేసేటప్పుడు పాస్తా లేదా నూడుల్స్ తిరగడానికి తగినంత స్థలం ఉండాలి.
తగినంత నీరు:
పాస్తా పర్ఫెక్ట్ గా రావడానికి తగినంత నీరు చాలా అవసరం. నీరు ఎక్కువైతే పాస్తా మరీ మెత్తగా అవుతుంది. అలాగే తక్కువైతే అవి పుల్లలు, పుల్లలుగా గట్టిగా ఉంటాయి. తిన్నా కూడా పిల్లలకు సరిగ్గా అరగవు.
నీటిలో ఉప్పు:
పాస్తాను ఉడకబెట్టేటప్పుడు, నీటిలో ఉప్పు వేయడం మర్చిపోవద్దు. ఇది పాస్తా రుచిని పెంచుతుంది, అలాగే ఉప్పు త్వరగా, అంటుకోకుండా ఉడుకుతుంది.
అతిగా ఉడికించకూడదు:
పాస్తా, నూడుల్స్ జిగటగా, మెత్తగా ఉండటానికి అతిగా ఉడికించడం ప్రధాన కారణం. వంట మార్గదర్శకాల ప్రకారం పాస్తా ప్యాకెట్ వేడినీటిలో వేసి 4నుంచి 8 నిమిషాలు మాత్రమే ఉడికించాలి.
నీటిలో నూనె వేయకూడదు:
పాస్తను ఉడికించడానికి చాలా మంది ఉప్పుతో పాటు కాస్త నూనె కూడా పోస్తుంటారు. వాస్తవానికి పాస్తా ఉడకడానికి నీరు సరిపోతుంది. నూనె పోయడం వల్ల జిడ్డుగా తయారవుతుంది. ఇది రుచిని చెడగొడుతుంది.
వేడి నీటిలో మాత్రమే ఉడికించాలి:
ప్యాన్‌లో నీరు పోసిన వెంటనే పాస్తాను ఎప్పుడూ వేయకూడదు. నీరు చక్కగా మరిగిన తర్వాత మాత్రమే వేయాలి. చల్లటి నీటిలో వేయడం వల్ల పాస్తా సరిగ్గా ఉడకదు. రుచిని కోల్పోతుంది.
వేసిన వెంటనే కలపాలి:
పాస్తాను వేడి నీటిలో వేసిన వెంటనే కలపాలి. లేదంటే అవి ఒకదానికి ఒకటి అంటుకుపొతాయి. అలాగని ఉడుకుతున్న సమయంలో పదే పదే కలపకూడదు.
ఉడికించిన తరువాత నీరు తొలగించడం:
పాస్తాను ఉడికించి తీసిన తరువాత దాంట్లో నీరు మిగిలి ఉంటే వాటిని తొలగించండి. గాలికి పెట్టడం వల్ల నీటిని పీల్చుకుని గట్టిగా తయారవుతుంది.
పాస్తాను బయటకు తీసిన వెంటనే:
పాస్తాను ఉడికించిన తరువాత వెంటనే దాన్ని సాస్ లేదా వెనిగర్ తో కలిపి ప్యాన్‌లో వేయండి. ఇలా చేయడం వల్ల పాస్తా తాజా, మరింత రుచికరంగా ఉంటుంది.
టాపిక్