Want To Be Happy In Life: నిజంగా ఆనందంగా ఉండాలనుకుంటే ఈ తీరును మార్చుకోండి!
Want To Be Happy In Life: జీవితంలో ఆనందంగా ఉండాలంటే మనకంటూ కొన్నిసొంత నియమాలు పెట్టుకోవాలి. కష్ట కాలంలో, సుఖాల్లో వాటిని పాటించాలి. అయితేనే అన్నింటినీ తట్టుకుని ముందుడుగు వేయగలం.
ఉన్నది ఒక్కటే జీవితం.. కష్టాలు, సుఖాలు.. ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉంటాయి. ఏ మనిషీ సమస్యలు లేకుండా ఉండడు. అయితే మనం జీవితాన్ని ఎలా జీవించాలని అనుకుంటున్నాం? అన్న దాన్ని బట్టి మనం ఎలా బతుకుతాం? అనేది ఆధారపడి ఉంటుంది. మనం ఆనందంగా ఉండాలని అనుకుంటే ఆనందంగానే ఉంటాం. బాధలు పడుతూ ఉండాలనుకుంటే బాధలు పడుతూనే ఉంటాం. మన ఆలోచనా తీరును బట్టే అవి నిర్ణయం అవుతాయి. అయితే ఎవరైతే సంతోషకరమైన జీవనాన్ని కావాలనుకుంటున్నారో వారు కచ్చితంగా కొన్ని ఆలోచనల్ని మార్చుకోవాలి. అవేంటంటే...
ట్రెండింగ్ వార్తలు
పాజిటివ్‌గా ఆలోచించండి:
నిజంగా పెద్ద సమస్య వచ్చినా సరే. దాన్ని కూడా పాజిటివ్‌గా తీసుకోవడానికి ప్రయత్నించండి. ఇంతకు మించిన చెడేదో జరగకుండా ఇంత మాత్రమే జరిగింది అని.. విషయాన్ని చిన్నగా తీసుకోండి. ప్రతి రోజునూ పాజిటివ్ ఆలోచనలతో మొదలు పెట్టండి. ప్రతి విషయాన్ని సానుకూల దృక్పథంతోనే చూడండి. చెడును మీ ఆలోచనల్లోకి రానీయకండి. అయినా వస్తుంటే వాటిని కొంత ప్రాక్టీస్ చేయడం ద్వారా దూరం చేసుకోవచ్చు. ప్రయత్నించి చూడండి.
లైట్‌గా తీసుకోండి:
కొన్ని సార్లు ఎదుటి వారు మన కష్టాన్ని చూసి నవ్వుకుంటారు. మన బాధని చూసి ఆనందిస్తారు. మనల్ని అవహేళనగా మాట్లాడతారు. అందువల్ల వారిపై మనకు ద్వేష భావం కలుగుతూ ఉంటుంది. అయితే ఇలాంటి భారమైన భావాల్ని మనసులో ఎక్కువగా పెట్టుకోకండి. అందువల్ల మనకే నష్టం. వాళ్లని చాలా లైట్‌గా తీసుకోండి. పట్టించుకోవడం మానేయండి. మనం విలువనిచ్చినంత సేపు వారి చేష్టలకు విలువ అని గుర్తుంచుకోండి.
మంచి మార్నింగ్ రొటీన్:
లేచిన వెంటనే రోజు వారీ పనుల్లో హడావిడిగా మారిపోకండి. మీ కోసం, మీ కుటుంబం ఆరోగ్యం కోసం ఇవాళ ఏం చేయాలి అనే మంచి మార్నింగ్ రొటీన్ ఒక దాన్ని సెట్ చేసుకోండి. టీలు, కాఫీల్లాంటి వాటితో కాకుండా జీరా నీళ్లు, వాము నీళ్లు, పుదీనా నీళ్లు.. ఇలా రకరకాల హెర్బల్ టీలను తాగేందుకు ప్రయత్నించండి. ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకునేందుకు మార్నింగ్ రొటీన్‌లోనే ప్రణాళిక చేసుకోండి.
భావాలను పంచుకోండి:
మీకు ఆనందంగా అనిపించినా, బాధగా అనిపించినా, విసుగుగా అనిపించినా ఆ భావాలను మీ ప్రియమైన వారితో పంచుకోండి. వారి నుంచి మీకు తప్పక సాంత్వన లభిస్తుంది. అలాగే ఓటమిని పెద్దగా పట్టించుకోకండి. మనం ఏ పని చేసినా అందులో గెలుపోటములు సహజం. ఒక వేళ మనం దాన్ని చేయడంలో విఫలం అయినా పెద్దగా కుంగిపోకండి. తర్వాత ఏంటి? అన్న ఆలోచనల్లోకి వెళ్లిపోండి. దీని ద్వారా గుణపాఠాన్ని నేర్చుకోండి. అక్కడి నుంచి మూవ్ అయిపోండి.