Mens Health: మహిళలకే కాదు మగవారికీ థైరాయిడ్ సమస్య, ఈ లక్షణం కనిపిస్తే జాగ్రత్త
Mens Health: మహిళల్లోనే అధికంగా థైరాయిడ్ సమస్య కనిపిస్తుంది. మగవారికీ ఇది రాదనుకుంటారు. నిజానికి మహిళలకే కాదు పురుషుల్లో కూడా థైరాయిడ్ సమస్య వస్తుంది. దీనివల్ల మగవారిలో ఏ లక్షణాలు కనిపిస్తాయో తెలుసుకోండి.
థైరాయిడ్ అనేది కేవలం మహిళలకే మాత్రమే వచ్చే సమస్య అనకుంటారు. కానీ థైరాయిడ్ సమస్య అనేది కేవలం ఆడవారికే కాదు మగవారికీ కూడా వస్తుంది. మగవారు చిన్న చిన్న లక్షణాలు కనిపిస్తున్నా కూడా వాటిని విస్మరిస్తూ ఉంటారు. తమకు థైరాయిడ్ సమస్యలు రావని అనుకుంటారు. నలభై ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పురుషుల్లో థైరాయిడ్ గ్రంథి సమస్యలు వస్తున్నాయి. అందుకే మగవారు కూడా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
మగరవాలో హైపో థైరాయిడ్ అధికంగా వస్తూ ఉంటుంది. దీని వల్ల థైరాయిడ్ గ్రంధి అవసరానికి మించి చురుగ్గా పనిచేస్తుంది. సాధారణంగా థైరాయిడ్ లాంటి వ్యాధిని స్త్రీకి లింక్ చేయడం చూస్తారు. అయినప్పటికీ, హైపోథైరాయిడ్ పురుషుల కంటే మహిళల్లో ఏడు రెట్లు ఎక్కువగా కనిపిస్తుంది. కానీ కొన్ని లక్షణాలు మహిళలు, పురుషులలో సాధారణంగా కనిపిస్తాయి. కాబట్టి మగవారు కూడా మేము కింద చెప్పిన లక్షణాలు మీలో కనిపిస్తే థైరాయిడ్ సమస్య వచ్చిందేమో చెక్ చేసుకోవాలి.
థైరాయిడ్ సమస్య లక్షణాలు
1. థైరాయిడ్ సమస్య వస్తే మహిళలు, పురుషుల్లో కూడా అలసట, కండరాల నొప్పి అధికంగా కనిపిస్తుంది.
2. ఆడవారితో పోలిస్తే థైరాయిడ్ గ్రంథి అతి చురుగ్గా పనిచేయడం వల్ల పురుషుల్లో లైంగిక సమస్యలు మొదలవుతాయి. ఇది పురుష పునరుత్పత్తి వ్యవస్థ, లైంగిక పనితీరును ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. వారికి లైంగిక ఆసక్తి తగ్గిపోయే అవకాశం ఉంది.
3. పురుషుల్లో అకస్మాత్తుగా అధికంగా జుట్టు రాలుతున్నా కూడా జాగ్రత్త పడాలి. థైరాయిడ్ గ్రంధి సరిగా పనిచేయకపోతేనే ఇలా జుట్టు రాలిపోతుంది. దీన్ని చాలా మంది పురుషులు పెద్దగా పట్టించుకోరు.
4. చిన్న వయసులోనే పురుషుడిలో లైంగిక వాంఛ తగ్గుతుంటే వెంటనే థైరాయిడ్ పరీక్ష చేయించుకోవాలి. దీనివల్ల భార్యాభర్తల మధ్య బంధం బీటలు వారే అవకాశం ఉంది.
5. చాలా మంది పురుషులలో, థైరాయిడ్ గ్రంథి చురుకుగా ఉండటం వల్ల కండరాలు సాంద్రత తగ్గడం ప్రారంభమవుతుంది. అదే సమయంలో బలహీనంగా అనిపిస్తుంది.
6. కొన్ని సందర్భాల్లో కొంతమంది పురుషుల్లో వక్షోజాలు పెద్దవిగా పెరగడం ప్రారంభమవుతాయి.
7. హైపర్ థైరాయిడిజం ఉన్న పురుషుల్లో అంగస్తంభన సమస్య ఏర్పడుతుంది. లైంగిక ప్రక్రియలో క్లైమాక్స్ కు చేరుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. కొన్నిసార్లు శీఘ్రస్ఖలనం కూడా సంభవిస్తుంది.
8. హైపర్ థైరాయిడ్ ఉన్నప్పుడు, వృషణాలు కుంచించుకుపోయి చిన్నవిగా మారతాయి.
9. పురుషుల్లో థైరాయిడ్ సమస్య వస్తే వీర్యకణాల నాణ్యత తగ్గిపోతుంది. దీని వల్ల సంతానలేమి సమస్య పెరిగిపోతుంది.
10. థైరాయిడ్ సమస్య ఉన్న మగవారిలో వెన్నెముక, తుంటిలో బలహీనత వంటి సమస్యలు కనిపిస్తాయి. దీని వల్ల వారు ఎంతో అసౌకర్యంగా ఫీలవుతారు.
పైన చెప్పిన లక్షణాలు మగవారిలో కనిపిస్తే తేలికగా తీసుకోకండి. వెంటనే థైరాయిడ్ పరీక్ష చేయించుకోండి.
(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)
సంబంధిత కథనం
టాపిక్