మీ పిల్లాడికి బొటనవేలు చప్పరించే అలవాటు ఉందా? వెంటనే మాన్పించకపోతే ఈ 7 నష్టాలు తప్పవు!-thumb sucking in children 7 negative impacts of not stopping it early ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  మీ పిల్లాడికి బొటనవేలు చప్పరించే అలవాటు ఉందా? వెంటనే మాన్పించకపోతే ఈ 7 నష్టాలు తప్పవు!

మీ పిల్లాడికి బొటనవేలు చప్పరించే అలవాటు ఉందా? వెంటనే మాన్పించకపోతే ఈ 7 నష్టాలు తప్పవు!

Ramya Sri Marka HT Telugu

బొటనవేలు చప్పరించడం చాలా మంది పిల్లలకు అలవాటు. అయితే సాధారణంగా దీన్ని 2 సంవత్సరాల వయస్సు రాగనే మానేస్తారు. కానీ పిల్లవాడు లేదా పాప పెద్దయ్యాక కూడా బొటనవేలు చప్పరించే అలవాటును వదలలేకపోతే అది వారికి పెద్ద సమస్యగా మారవచ్చు. బొటనవేలు చప్పరించడం వల్ల ఆరోగ్యానికి కలిగే 7 పెద్ద నష్టాలు ఏమిటో తెలుసుకుందాం.

బొటనవేలు చప్పరిస్తున్న పిల్లాడు (shutterstock)

పిల్లలు బొటనవేలు చప్పరించే అలవాటు చాలా మంది తల్లులను ఆందోళనకు గురి చేస్తుంది. మీరూ అలాంటి వారిలో ఒకరా? అయితే ఇది మీ కోసమే. మీ సమస్యను అర్థం చేసుకుని బొటనవేలు చప్పరించడం వల్ల పిల్లలకు కలిగే నష్టాలేమిటో, అలాగే ఈ అలవాటును ఎలా మాన్పించవచ్చో వంటి విషయాలను ఇక్కడ వివరంగా తెలుసుకోవచ్చు.

సాధారణంగా పిల్లలు 2 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు నోట్లో వేలు వేసుకుని చప్పరిస్తుంటారు. ఆ తర్వాత ఈ అలవాటును అనేస్తారు. కొందరు పిల్లలలు మాత్రం రెండేళ్లు పైబడ్డాక కూడా ఈ అలవాటును కొనసాగిస్తారు. మాన్పించడానికి తల్లులు ఎంత ప్రయత్నించినా ఫలితం కపించదు. ఈ అలవాటు ఇలాగే కొనసాగితే వారికి పలు ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. బొటనవేలు చప్పరించడం వల్ల కలిగే 7 ముఖ్యమైన నష్టాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

బొటనవేలు చప్పరించే పిల్లలకు ఈ 7 నష్టాలు కలగవచ్చు

1. దంతాలు, దవడ నిర్మాణంపై చెడు ప్రభావం

ఎక్కువ కాలం బొటనవేలు చప్పరించడం వల్ల దంతాల ఆకృతి దెబ్బతిని పాడైపోవచ్చు. ఉదాహరణకు, దంతం ముందుకు రావడం లేదా దంతాలు తప్పుగా అరమరిక చెడిపోవడం వంటివి. ఈ రెండు సమస్యలలోనూ దవడ నిర్మాణం ప్రభావితమవుతుంది. దీని వలన పిల్లవాడు భవిష్యత్తులో ఆర్థోడాంటిక్ చికిత్స (బ్రేసెస్) చేయించుకోవలసి ఉంటుంది.

2. పెదవుల సమస్యలు

బొటనవేలు చప్పరించడం వల్ల పిల్లల పెదవులు, నోటి చుట్టూ చర్మం చికాకుకు గురవుతుంది. పొడిబారడం లేదా పగలడం వంటి సమస్యలు వస్తుంటాయి. పిల్లవాడు నోటిలో వేలు పెట్టడం వల్ల నోటి కండరాలు కూడా బలహీనపడవచ్చు, దీని వలన పిల్లవాడు మాట్లాడటానికి లేదా నమలడానికి ఇబ్బంది పడవచ్చు.

3. సంక్రమణ ప్రమాదం

కొన్నిసార్లు చిన్న పిల్లల చేతులు మురికిగా ఉంటాయి, అటువంటి పరిస్థితిలో బొటనవేలు చప్పరించినప్పుడు చేతులపై ఉన్న బ్యాక్టీరియా లేదా సూక్ష్మక్రిములు నోటిలోకి ప్రవేశించవచ్చు. దీని వల్ల పిల్లవాడు కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు లేదా ఇతర జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడవచ్చు. అంతేకాదు నోటిలో పదే పదే పుండ్లు రావడం లేదా గొంతు నొప్పి రావడం కూడా ఈ చెడు అలవాటు ఫలితమే కావచ్చు.

4. మాట్లాడటంలో ఇబ్బంది

బొటనవేలు చప్పరించడం వల్ల నాలుక, నోటి కండరాల అభివృద్ధి ప్రభావితం కావచ్చు. దీని వల్ల పిల్లవాడు లేదా పాప సరిగ్గా ఉచ్చరించడం(మాటలు పలకడం)లో ఇబ్బంది పడవచ్చు. ఎక్కువ కాలం ఇలా జరిగితే పిల్లలు భవిష్యత్తులో స్పీచ్ థెరపీ చేయించుకోవలసి ఉంటుంది.

5. చర్మ సంబంధిత సమస్యలు

బొటనవేలును పదే పదే చప్పరించడం వల్ల చర్మంపై నిరంతరం తేమ మరియు రాపిడి కారణంగా పిల్లవాడు చర్మంపై చికాకు, ఎరుపు లేదా పొడిబారడం వంటి సమస్యలను ఎదుర్కోవచ్చు. తీవ్రమైన సందర్భాల్లో, చర్మంపై చిన్న చిన్న గాయాలు కూడా కనిపించవచ్చు, దీని వలన ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

6. బొటనవేలు సన్నగా మారవచ్చు

మీ పిల్లవాడు లేదా పాప బొటనవేలు చప్పరిస్తే అతని బొటనవేలు బలహీనంగా మారవచ్చు. దీనితో పాటు పిల్లల శారీరక అభివృద్ధి కూడా సరిగ్గా జరగకపోవచ్చు.

7. ఆత్మవిశ్వాసం లేకపోవడం

పిల్లల బొటనవేలు చప్పరించే అలవాటు వారి ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుంది. దీని వల్ల వారు ఆరోగ్య సంబంధిత సమస్యలను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ అలవాటు ఎక్కువ కాలం కొనసాగితే అది దంతాలు, దవడల అభివృద్ధిని ప్రభావితం చేస్తుంది, దీని వల్ల పిల్లలు మాట్లాడటానికి, తినడానికి కూడా ఇబ్బంది పడవచ్చు.

బొటనవేలు చప్పరించే అలవాటును ఎలా మాన్పించాలి:

  • పిల్లల భావోద్వేగ అవసరాలను ఎప్పుడూ ప్రేమతో, అత్యంత శ్రద్ధతో తీర్చాలి.
  • పిల్లవాడు లేదా పాప బొటనవేలు చప్పరిస్తున్నప్పుడు వారిని డైవర్ట్ చేసేందుకు ప్రయత్నించాలి. అంటే ఏదైనా పుస్తకం లేదా బొమ్మతో ఆడుకోమని సలహా ఇవ్వండి. మీరే దగ్గరుండి కూర్చుని ఆడించండి.
  • పిల్లల బొటనవేలుకు కాకరకాయ వంటి చేదు కూరగాయల రసం రాయండి లేదా పిల్లలకు చేతి తొడుగులు వేసి ఉంచండి.
  • పిల్లవాడు బొటనవేలు చప్పరించడం మానకపోతే శిశు వైద్యుడిని సంప్రదించండి.

రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.