Home Remedies for Dark Knees: మోకాళ్ల నలుపును ఇంట్లోనే పొగొట్టుకోండిలా.. మూడు పద్ధతులు ఇవే
Home Remedies for Dark Knees: మోకాళ్ల వద్ద చర్మం చాలా మందికి నల్లగా అవుతుంది. దీంతో బయటికి కనిపిస్తాయేమోనని ఆందోళన పడతారు. షార్ట్ డ్రెస్‍లు వేసుకోవాలనుకున్నా వెనకాడతారు. అయితే, మోకాళ్లపై నల్లటి చారలను తగ్గించేందుకు ఇంటి చిట్కాలు ఉపయోగపడతాయి.
శరీరంలోని కొన్ని అవయవాలను చాలాకాలం కొందరు సరిగా పట్టించుకోం. వాటిని శుభ్రం చేసేందుకు ఎక్కువగా శ్రద్ధ పెట్టరు. మోకాళ్లు అందులో ప్రధానంగా ఉంటాయి. దీంతో కొంతకాలానికి మోకాళ్లు మబ్బుగా మారిపోతాయి. నల్లటి ఛారలతో ఉంటాయి. మిగిలిన శరీరంతో పోలిస్తే మోకాళ్లు మబ్బుగా కనిపిస్తుంటాయి. ఇది చాలా ఆందోళన కలిగిస్తుంది. దీంతో ఇష్టమైన షార్ట్ డ్రెస్ వేసుకునేందుకు చాలా మంది ఇబ్బంది పడతారు. మోకాళ్లు బయటికి కనిపిస్తాయేమోనని దిగులు పడతారు.
మోకాళ్ల నలుపును ఇంట్లోనే కొన్ని చిట్కాలు పాటించి తగ్గించుకోవచ్చు. ఇవి రెగ్యులర్‌గా చేయడం వల్ల డార్క్‌నెస్ పోతుంది. మోకాళ్ల చర్మం మెరుపు పెరిగే అవకాశం ఉంటుంది. అలా మోకాళ్ల నలుపు తగ్గేందుకు ఈ మూడు ఇంటి చిట్కాలను ఫాలో అవండి.
అరటి తొక్కతో..
అరటి తొక్క, తేనెతో మోకాళ్లకు మర్దన చేయాలి. ముందుగా అరటి తొక్కపై తేనె వేయాలి. దాన్ని మోకాళ్లకు సుమారు 7 నిమిషాల పాటు రుద్దాలి. ఆ తర్వాత నీటితో కడిగేయాలి. ఇది ఇంట్లోనే ఎ్పపుడైనా చేసుకోవచ్చు. మోకాళ్లపై నలుపు తగ్గేందుకు ప్రభావంతంగా పని చేస్తుంది. అరటి తొక్క, తెేనెతో రుద్దడం వల్ల చర్మం మాయుశ్చరైజ్ అవుతుంది. మోకాళ్లపై నల్లటి ఛారలు తగ్గేందుకు తోడ్పడుతుంది.
నారింజ స్క్రబ్
మోకాళ్ల నలుపును పొగొట్టేందుకు ఆ నారింజ స్క్రబ్ తోడ్పడుతుంది. ముందుగా ఓ టీస్పూన్ కాఫీ పొడి, ఓ టీస్పూన్ కొబ్బరినూనెను, నారింజ పండు తొక్కను ఓ గిన్నెలో కలపాలి. ఆ తర్వాత నారింజ తొక్కతో ఆ మిశ్రమం అంటేలా మోకాలికి 10 నిమిషాల పాటు రుద్దాలి. ఆ తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. తుడిచేందుకు దూదిని వాడాలి. వారానికి రెండుసార్లు ఈ స్క్రబ్ వాడితే మోకాళ్లపై నలుపు తగ్గేందుకు సహకరిస్తుంది.
బంగాళదుంప స్క్రబ్
బంగాళదుంప స్క్రబ్ కూడా మోకాళ్ల డల్‍నెస్‍ను పోగొట్టగలదు. ముందుగా బంగాళదుంప తొక్కను ఎండబెట్టుకోవాలి. ఆ తర్వాత దాన్ని పొడిగా చేసుకోవాలి. ఓ టీస్పూన్ పెరుగు, ఓ టీస్పూన్ బంగాళదుంప తొక్క పొడిని ఓ గిన్నెలో బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని సుమారు 10 నిమిషాల మోకాళ్లకు బాగా రుద్దాలి. ఆ తర్వాత దాన్ని 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత నీటితో కడిగేసుకోవాలి. స్నానం చేసే ముందు ఈ పద్ధతి పాటిస్తే బాగుంటుంది. మోకాళ్ల నలుపు తగ్గించడంలో ఇది ప్రభావవంతంగా పని చేస్తుంది.
టాపిక్