Thotakura Pulusu: ఆరోగ్యానికి మేలు చేసే తోటకూర పులుసు, ఉత్తమ పత్యం ఆహారం
Thotakura Pulusu: తోటకూరతో చేసిన వంటకాలను పత్యం ఆహారంగా అధికంగా తింటారు. దీన్ని వారానికి రెండు మూడు సార్లు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.

Thotakura Pulusu: తోటకూర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. తోటకూరను ఆపరేషన్లు అయినప్పుడు పత్యం కూరగా వడ్డిస్తారు. సాధారణ వ్యక్తులు కూడా తోటకూరను తినడం వల్ల ఎన్నో పోషకాలు లభిస్తాయి. కాబట్టి తోటకూరను వారానికి రెండు నుంచి మూడు సార్లు దీనితో రెసిపీలు చేసుకుని తినడం చాలా ముఖ్యం. ఇక్కడ మేము తొటోకూర పులుసు రెసిపీ ఇచ్చాము. దీన్ని చేయడం చాలా సులువు.
తోటకూర పులుసు రెసిపీకి కావాల్సిన పదార్థాలు
తోటకూర - మూడు కట్టలు
ఉల్లిపాయలు - రెండు
మెంతి పొడి - ఒక స్పూను
చింతపండు - నిమ్మకాయ సైజులో
నూనె - రెండు స్పూన్లు
సెనగ పప్పు - రెండు స్పూన్లు
ఆవాలు - అరస్పూను
పచ్చి మిర్చి - అయిదు
ఎండు మిర్చి - నాలుగు
కారం - అరస్పూను
ఉప్పు - రుచికి సరిపడా
కరివేపాకులు - గుప్పెడు
పసుపు - చిటికెడు
వెల్లుల్లి రెబ్బలు - ఎనిమిది
నీరు - సరిపడినంత
తోటకూర పులుసు రెసిపీ
1. తోటకూరను శుభ్రంగా కడిగి చిన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి.
2. ఉల్లిపాయలను కూడా సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. వీటిని నిలువుగా కోసుకోవాలి.
3. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. అందులో ఆవాలు, సెనగపప్పు, ఎండు మిర్చి వేసి వేయించాలి.
4. పచ్చి మిర్చి, కరివేపాకులు వేసి కూడా వేయించుకోవాలి. ఆ తరువాత ఉల్లిపాయలు వేసి వేయించాలి.
5. ఉల్లిపాయలు వేగాక తోటకూరను కూడా వేయించుకోవాలి.
6. వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి బాగా మెత్తగా ఉడికించుకోవాలి.
7. తోటకూర మెత్తగా ఉడికాక చింత పండు పులుసు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.
8. అందులో మెంతి పొడి, కారం వేసి బాగా కలపాలి.
9. అవసరం అయితే అర గ్లాసు నీళ్లు వేసుకోవచ్చు. అలా చిన్న మంట మీద అరగంట సేపు ఉడికించాలి. అంతే తోటకూర పులుసు రెడీ అయినట్టే.
తోటకూర తినడం వల్ల శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. తోటకూర తినడం వల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్లు పెరగకుండా ఉంటాయి. ఈ ఆకుల్లో రక్తహీనతను తగ్గించే లక్షణం ఉంటుంది. ఇందులో ఐరన్ అధికంగా ఉంటుంది. కాబట్టి కండరాలు బలంగా ఉంాయి. అలాగే విటమిన్ ఎ, పొటాషియం, జింక్ వంటివి నిండుగా ఉంటాయి. ఇవి మన కంటి ఆరోగ్యానికి ఎంతో అవసరం. వారినికి ఒకట్రెండు సార్లు ఇలా తోటకూర రెసిపీలు వండుకుని తినడం వల్ల పోషకాహార లోపం రాకుండా ఉంటుంది.
టాపిక్