Acne: మొటిమలు ఉన్నవారు ఇలా చేయండి చాలు, అవి త్వరగా తగ్గిపోతాయి-those who have pimples just do this and they will disappear quickly ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Acne: మొటిమలు ఉన్నవారు ఇలా చేయండి చాలు, అవి త్వరగా తగ్గిపోతాయి

Acne: మొటిమలు ఉన్నవారు ఇలా చేయండి చాలు, అవి త్వరగా తగ్గిపోతాయి

Haritha Chappa HT Telugu

Acne: మొటిమలు చాలా బాధపెడతాయి. చర్మ ఆరోగ్యానికీ, అందానికీ… రెండింటిని ఇది ప్రభావితం చేస్తుంది. అందుకే అమ్మాయిలు మొటిమల వల్ల ఎంతో ఇబ్బంది పడతారు. మొటిమలు రాకుండా ఉండాలంటే చిన్న చిట్కాను పాటించండి.

మొటిమలు తగ్గాలంటే ఇలా చేయండి (freepik)

మీరు మొటిమలతో బాధపడుతున్నారా? మొటిమలు బాధాకరంగా ఉండటమే కాకుండా, అవి మీ మానసిక ఆరోగ్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కూడా దెబ్బతీస్తుంది. మొటిమలు రాకుండా పూర్తిగా అడ్డుకోవడం కష్టమే. కానీ అసాధ్యం మాత్రం కాదు. మొటిమలు రాకుండా ఉండాలన్నా, వచ్చిన మొటిమలు త్వరగా తగ్గాలన్నా ప్రతిరోజూ నీటిని అధికంగా తాగండి చాలు. ఇలా చేయడం వల్ల మొటిమల సమస్య త్వరగా తగ్గుతుంది.

నీరు తాగడం వల్ల శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. అలాగే పండ్లు, కూరగాయలు అధికంగా ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. నీళ్లు అధికంగా తాగడంతో పాటూ, సరైన ఆహారం తినడం వల్ల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంటుంది. రోజుకు ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగడం వల్ల చర్మానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.

  • సెబమ్ ఉత్పత్తిని నియంత్రిస్తుంది: నీరు అధికంగా తాగడం వల్ల చర్మం హైడ్రేటెడ్‌గా మారుతుంది. ఇది సెబమ్ (సహజ నూనె) ఉత్పత్తిని ప్రేరేపించడం తగ్గిస్తుంది. మూసుకుపోయిన రంధ్రాలు, బ్రేక్అవుట్లను నివారించడంలో సహాయపడుతుంది.
  • మంటను తగ్గిస్తుంది: చర్మం తేమవంతంగా ఉండడం వల్ల ఎక్కువ స్థితిస్థాపకత, తక్కువ ఇన్‌ఫ్లమ్మేషన్‌కు గురవుతుంది. ఇది ఇప్పటికే ఉన్న మొటిమలను తగ్గించడమే కాదే, కొత్తవి రాకుండా నిరోధించడానికి సహాయపడుతుంది.
  • మరమ్మతు చేస్తుంది: తేమవంతమైన చర్మం తనను తాను మరమ్మత్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. మొటిమలను త్వరగా తగ్గడానికి సహాయపడుతుంది. మచ్చలను తగ్గిస్తుంది.
  • చికాకు, మంట: చర్మం తగినంత తేమవంతంగా ఉండడం వల్ల చర్మంపై చికాకు, మంట వంటివి రాకుండా ఉంటాయి.

చర్మం ఇలా తేమవంతం…

చర్మాన్ని లోపలి నుండి హైడ్రేట్ చేయడం చాలా ముఖ్యం. మీ చర్మాన్ని తగినంత హైడ్రేట్ గా ఉంచడానికి రోజుకు కనీసం ఎనిమిది గ్లాసుల నీరు తాగాలని లక్ష్యంగా పెట్టుకోండి. దోసకాయ, పుచ్చకాయ, బచ్చలికూర, పాలకూర, టమోటా, నారింజ వంటి అధిక నీటి కంటెంట్ ఉన్న పండ్లు, కూరగాయలు వంటివి తినడం చాలా అవసరం.

ఒత్తిడిని తగ్గించుకోవడం చాలా ముఖ్యం. ఇది రక్త ప్రసరణను పెంచుతుంది. వ్యాయామం చేయడం చాలా అవసరం. వ్యాయామం చేసేటప్పుడు చెమటను బయటకు పంపిస్తుంది. మొటిమల బ్రేక్అవుట్లను తగ్గిస్తుంది.

చర్మంలో తేమను పెంచడానికి సహాయపడే హైలురోనిక్ ఆమ్లం, గ్లిజరిన్, విటమిన్ సి, సెరామైడ్లు వంటి పదార్ధాలున్న కాస్మోలిక్ ఉత్పత్తులను వాడడం ముఖ్యం.

చర్మం తేమవంతంగా ఉంటే చర్మం పొడిబారడం, చికాకు కలిగించడం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. వారానికి ఒకటి లేదా రెండుసార్లు ముఖానికి హైడ్రేట్ ఫేస్ మాస్క్ వేసుకోవడం మంచిది . కలబంద, తేనె, వోట్మీల్, దోసకాయ సారం వంటి పదార్థాలు కలిగిన మాస్కులను ముఖానికి వేసుకోవడం మంచిది.

రసాయనాలుండే క్లెన్సర్లు చర్మానికి రాయకూడదు. అది తేమ అవరోధానికి అంతరాయం కలిగిస్తాయి, ఇది డీహైడ్రేషన్‌కు దారితీస్తుంది. సున్నితమైన, పిహెచ్-సమతుల్య క్లెన్సర్లను వాడడం మంచిది.