Yoga: ఏ పనిపై సరిగా ఏకాగ్రత పెట్టలేకున్నారా? ఈ యోగాసనం చేయండి.. సులభమే.. ఈ విషయాలు పాటించాలి!
Yoga: ఏ విషయంపైనా ఏకాగ్రత పెట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఈ సమస్యను తగ్గేందుకు ఓ యోగానాసనం ఉపయయోగపడుతుంది . దీన్ని రెగ్యులర్‌గా చేస్తే ఫోకస్ పెరుగుతుంది. శరీరానికి కూడా ప్రయోజనాలు ఉంటాయి.
కొందరికి ఏకాగ్రత సమస్యగా మారుతుంటుంది. ఏ పనిపైనా ఎక్కువసేపు ఫోకస్ పెట్టలేకుంటారు. ఏకాగ్రత తగ్గి ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. మళ్లీ ఆ విషయంలో మెరుగవ్వాలని అనుకుంటుంటారు. ఇందుకోసం ఓ యోగాసనం సహకరిస్తుంది. ఏకాగ్రతను ఈ ఆసనం పెంచగలదు. అదే వృక్షాసనం. ఒంటికాలిపై నిలబడి చేసే ఆ ఆసనం చూసేందుకు సులక్షంగా ఉన్నా.. కొన్ని జాగ్రత్తలు పాటించాలి. శరీర ఫిట్‍నెస్‍కు కూడా ఆసనం ఉపయోగపడుతుంది. వృక్షాసనం వేసే విధానం, ఉపయోగాలు ఏవో ఇక్కడ చూడండి.
వృక్షాసనం ఇలా.. సూచనలు ఇవే
- ఓ కాలిపై శరీర భారం మొత్తం వేస్తూ నిలబడమే వృక్షాసనం. ఈ భంగిమ వేసేప్పుడు కొన్ని సూచనలు పాటిస్తే మెరుగ్గా ఉంటుంది.
- వృక్షాసనం వేసేందుకు, ముందుగా ఓ చోట నిలబడాలి. నడుము తప్పనిసరిగా నిటారుగా ఉండాలి. తల దించకుండా నేరుగా చూస్తుంటాలి.
- ఆ తర్వాత ఓసారి గాఢంగా శ్వాస తీసుకొని వదలండి. మీ శరీర బరువు రెండు కాళ్లపై సమానంగా ఉన్నట్టుగా ఫీల్ అవ్వాలి. స్థిరంగా నిలబడాలి.
- ఆ తర్వాత కుడికాలిపై శరీర భారం వేస్తూ.. ఎడమ మోకాలి వంచి పైకి తీసుకురావాలి. ఎడమ కాలి పాదాన్ని కుడికాలి తొడ సైడ్‍పై పెట్టాలి.
- ఆ సమయంలో కూడా నడుము నిటారుగా ఉండాలి. అలా ఒక్క కాలిపై నిలబడిన తర్వాత ఏదైనా ముందున్న ఒకదానిపై తదేకంగా చూడాలి. దీని వల్ల బ్యాలెన్స్ పెరుగుతుంది.
- ఆ తర్వాత ఎడుమ కాల పాదంతో కుడి తొడపై కాస్త ఒత్తిడి చేయాలి. ఆ తర్వాత రెండు చేతులను ఛాతి వద్దకు తెచ్చి నమస్కరిస్తున్నట్టుగా పెట్టాలి.
- ఈ భంగిమలో సుమారు 10 సార్లు శ్వాస తీసుకోవాలి.
- ఆ తర్వాత శ్వాస వదలాలి. ఆ తర్వాత వేరే కాలితో రిపీట్ చేయాలి. ఎడమ కాలిపై శరీర భారం వేసి.. కుడి పాదాన్ని ఎడమ తొడ సైడ్‍పై పెట్టాలి.
వృక్షాసనంతో లాభాలు
ఏకాగ్రత పెరుగుతుంది: వృక్షాసనం వేసేందుకు ఫోకస్ ఎక్కువగా పెట్టాలి. ఒంటి కాలిపై నిలబడేందుకు దృష్టిని ఓచోట కేంద్రీకరించాల్సి ఉంటుంది. దీంతో రెగ్యులర్‌గా ఈ వృక్షాసనం చేస్తే ఏకాగ్రత పెరుగుతుంది. అన్ని విషయాలపై ఫోకస్ చేయడం మెరుగవుతుంది. పనిపై పూర్తి దృష్టి సారించడం పెరుగుతుంది. ఈ ఆసనం వల్ల ఒత్తిడి తగ్గినట్టుగా కూడా అనిపిస్తుంది.
శరీర బ్యాలెన్స్: వృక్షాసనం వేయడం వల్ల శరీర బ్యాలెన్స్ మెరుగుపడుతుంది. కాళ్లు, శరీర మధ్య భాగాల్లోని కండరాలకు ఈ ఆసనం వల్ల మేలు జరుగుతుంది. దీంతో బాడీ బ్యాలెన్స్ పెరుగుతుంది.
భంగిమ మెరుగు: వృక్షాసనం వేసే సమయంలో వెన్ను నడుము నిటారుగా ఉండాలి. దీనివల్ల శరీర భంగిమ మెరుగు పడుతుంది. స్టిఫ్‍గా ఉండేలా చేస్తుంది. రోజూ సుమారు 15 నిమిషాల పాటు ఈ ఆసనం సాధన చేస్తూ కాళ్ల బలానికి చాలా ఉపయోగపడుతుంది.
టాపిక్