All In One Masala: ఈ ఒక్క మసాలాతో వంటల్లో మీరే బెస్ట్ అనిపించుకోవచ్చు, అన్ని కూరల్లో వేసే ఆల్-ఇన్-వన్ మసాలా రెసిపీ ఇది!-this one spice will make you the best in cooking this is an all in one masala recipe that can be used in all curries ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  All In One Masala: ఈ ఒక్క మసాలాతో వంటల్లో మీరే బెస్ట్ అనిపించుకోవచ్చు, అన్ని కూరల్లో వేసే ఆల్-ఇన్-వన్ మసాలా రెసిపీ ఇది!

All In One Masala: ఈ ఒక్క మసాలాతో వంటల్లో మీరే బెస్ట్ అనిపించుకోవచ్చు, అన్ని కూరల్లో వేసే ఆల్-ఇన్-వన్ మసాలా రెసిపీ ఇది!

Ramya Sri Marka HT Telugu

All In One Masala: రోజూ ఒకే రకమైన, సింపుల్ ఫుడ్ తినడం బోరింగ్‌గా అనిపిస్తుంది కదాా! అలాంటప్పుడు ఈ ప్రత్యేకమైన మసాలాను తయారు చేసి పెట్టుకోండి. పప్పు నుంచి పలావ్ వరకూ అన్ని రకాల వంట్లో దీన్ని వేయచ్చు. ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వంట చేసుకోవచ్చు. లేటు చేయకుండా ఆల్-ఇన్-వన్ మసాలా రెసిపీ ఏంటో చూసేద్దాం?

ఆల్-ఇన్-వన్ మసాలా రెసిపీని తెలుసుకోండి (Shutterstock)

భారతీయ వంటలకు ప్రత్యేకమైన రుచినీ, వాసనను, రంగును అందించేవి వాటిలో వేసే మసాలాలే. రోజూ తినే సింపుల్ వంటల్లో కూడా నాలుగు నుంచి ఐదు రకాల మసాలాలు వేస్తూ ఉంటారు. అవి వంటకు ప్రత్యేకమైన రుచి, రంగును అందిస్తాయి. వంట రుచిని రెట్టింపు చేస్తాయి. అలాగే ఆరోగ్యానికి కూడా చాలా రకాలుగా మేలు చేస్తాయి. మసాలాలను వాడటం సరిగ్గా తెలుసుకున్న వారు ఇంట్లోనే రెస్టారెంట్ లాంటి రుచికరమైన వంటను తయారు చేయగలరు. మీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉందని అనిపించుకోగలుగుతారు. ఇలా మీకు కూడా అనిపించుకోవాలి అనుకుంటే ఈ ఆల్ ఇన్ వన్ మసాలా రెసిపీ మీ కోసమే.

ఈ సీక్రెట్ మసాలాను వంటల్లో వేయడం ప్రారంభించారంటే మీ వంట రుచి చూసిన వారంతా మీరు బెస్ట్ షెఫ్ అంటారు. పప్పు నుంచి పలావ్ వరకూ, టిఫిన్ల నుంచి కూరల వరకూ అన్నింటిలో దీన్ని వేసుకోవచ్చు. నమ్మకం లేదా? ఒకసారి ట్రై చేసి చూడండి. ఆ సీక్రెట్ మసాలా రెసిపీ ఏంటో చూసేద్దాం రండి..

ఆల్ ఇన్ వన్ సీక్రెట్ మసాలా తయారీకి కావలసినవి

  • రెండు ఎండు మిర్చి,
  • 3 ఉల్లిపాయలు,
  • వెల్లుల్లి (25-30 రెబ్బలు),
  • అల్లం ముక్క (6 నుంచి 7 అంగుళాలు),
  • పచ్చిమిర్చి (3-4),
  • మెంతులు (రెండు చెంచాలు),
  • జీలకర్ర (1 చెంచా),
  • ఎండు మిర్చి (7-8), రెండు నుంచి మూడు దాల్చిన చెక్కలు,
  • పచ్చి ఏలకులు (3-4),
  • ఒక పెద్ద ఏలకులు,
  • నల్ల మిరియాలు (రెండు చెంచాలు),
  • దాల్చిన చెక్క (ఒక ముక్క),
  • ఒక చెంచా లవంగాలు,
  • అర చెంచా మెంతులు,
  • ఒక అనాస పువ్ఫు,
  • షాజీరా (ఒక చెంచా),
  • కసూరి మేతి (మూడు చెంచాలు),
  • పసుపు (అర చెంచా),
  • ఉప్పు (1 చెంచా),
  • నల్ల ఉప్పు (అర చెంచా),
  • ఇంగువ (1 చెంచా),
  • సిట్రిక్ ఆసిడ్ లేదా నిమ్మకాయ పువ్వు (3 గ్రాములు),
  • జాజికాయ (చిన్న ముక్క),
  • కాన్ ఫ్లోర్ (ఒక చెంచా),
  • పుదీనా పొడి (ఒక చెంచా)

ఆల్ ఇన్ వన్ మసాలా తయారీ విధానం..

  1. ఈ మసాలా తయారు చేయడం కోసం ముందుగా ఎండు మిర్చి, ఉల్లిపాయలు, అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి.
  2. ఇప్పుడు గాలి, ఎండ తగిలే చోట ఒక కాటన్ దుప్పటి పరిచి దాని ఆరబెట్టండి. రెండు, మూడు రోజుల పాటు ఎండిన తర్వాత వీటిలోని తేమ అంతా పోతుంది. ఏ మాత్రం తేమ మిగిలి ఉన్న మసాలా త్వరగా పాడవుతుందని గుర్తుంచుకోండి. ఇవన్నీ ఆరిన తర్వాత పక్కకు పెట్టుకోండి.
  3. తర్వాత ఒక పాన్ తీసుకుని దానిలో మెంతులు, జీలకర్ర, ఎండు మిర్చి (పూర్తిగా), దాల్చిన చెక్క, పచ్చి ఏలకులు, నల్ల మిరియాలు, జాజికాయ, లవంగాలు, షాజీరా, మెంతులు, అనాసపువ్వు వంటి మసాలాలను అన్నింటినీ చిన్న మంట మీద వేయించుకుని పక్కకు పెట్టుకోండి. స్టవ ఆఫ్ చేసిన తర్వాత దీంట్లో కసూరీ మేతి వేయండి.
  4. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో ముందుగా ఎండ బెట్టుకున్న పదార్థాలు, తర్వాత వేయించి పక్కకు పెట్టుకున్న మసాలాలు అన్నింటినీ దాంట్లో వేసి మిక్సీ పట్టండి.
  5. ఇవన్నీ బాగా కలసిపోయి మెత్తటి పేస్టులా తయరైన తర్వాత దీంట్లో పసుపు, ఉప్పు, ఇంగువ పొడి, పుదీనా పొడి కూడా వేసి బాగా కలపండి.
  6. ఇలా మిక్సీ పట్టిన పొడిలో ఏమైనా తేమ కనిపిస్తే దాన్ని పొగొట్టేందుకు మీరు దీంట్లో కార్న్ ఫ్లోర్ కూడా కలపవచ్చు.
  7. అన్నింటినీ కలిపి మరోసారి మిక్సీ పట్టారంటే ఆల్-ఇన్-వన్ మసాలా రెడీ అయినట్టే.
  8. దీన్ని గాలి చొరబడని డబ్బాలో వేసి నిల్వ చేశారంటే నెలల తరబడి ఉపయోగించుకోవచ్చు.
  9. దీన్ని మీరు ఏ కూరలో అయినా వేసుకోవచ్చు. కూర వండటం పూర్తయ్యే ముందు ఉప్పు, కారం, మసాలా వేసే సమయంలో దీన్ని వేశారంటే మీ వంట రుచిలో రెట్టింపు అవుతుంది. తిన్నవారంతా సీక్రెట్ ఏంటని అడుగుతారు. ట్రై చేసి చూడండి.

Ramya Sri Marka

eMail
రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.

సంబంధిత కథనం