మామిడి పండ్ల సీజన్ ఇది. ఏప్రిల్, మే నెలల్లోనే మామిడి పండ్లు అధికంగా కాస్తాయి. మామిడి కాయలతో ఆవకాయలు, ఊరగాయలు వంటి నిల్వ పచ్చళ్లు ఈ కాలంలోనే చేసుకోవాలి. ఇక మామిడి పండ్లు టేస్టీ స్వీట్లు కూడా చేసుకోవచ్చు. మామిడి పండ్లతో చేసే ఈ స్వీటు ఎంతో రుచిగా ఉంటుంది. దీన్ని మ్యాంగో బర్ఫీ అంటారు. దీన్ని చేయడం చాలా సులువు. మ్యాంగో బర్ఫీని సులువుగా ఎలా చేయాలో ఇక్కడ ఇచ్చాము. ప్రయత్నించి చూడండి.
మామిడి పండ్లు - రెండు
పాలపొడి - ఒక కప్పు
పంచదార - ముప్పావు కప్పు
నెయ్యి - అర కప్పు
తురిమిన కొబ్బరి - అర కప్పు
కోవా - అరకప్పు
యాలకుల పొడి - అర స్పూను
6. ఈ మిశ్రమానికి మామిడి పేస్టును వేసి కలపాలి. ఇవన్నీ ఉడికిన తర్వాత పాలపొడి వేసి బాగా కలపాలి.
7. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. మిశ్రమం చిక్కబడిన తర్వాత నెయ్యి వేసి మళ్లీ కలపాలి.
8. మామిడి మిశ్రమం చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. పైన తురిమిన డ్రై ఫ్రూట్స్ చల్లుకోవాలి.
9. ఒక ప్లేటులో ఈ మామిడి మిశ్రమాన్ని వేసి పరచాలి. కొన్ని గంటల పాటు అలాగే ఉంచాలి.
10. మ్యాంగో బర్ఫీ సెట్ అయ్యాక కావాల్సిన ఆకారంలో కట్ చేసి వెంటనే సర్వ్ చేయాలి.
మామిడి పండ్లతో చేసే స్వీటు ఇది. నోట్లో పెట్టుకుంటేనే కరిగిపోయేలా ఉంటుంది. మేము ఇక్కడ చేసిన పద్ధతిలో స్వీట్ చేసి చూడండి. పిల్లలకు బాగా నచ్చుతుంది. దీన్ని చేయడం కూడా చాలా సులువు. ఇంట్లో వేడుకల సమయంలో ఈ స్వీటు అతిథులకు వడ్డిస్తే అదిరిపోతుంది.
సంబంధిత కథనం