Weightloss: ఇంటి దగ్గరే 28 కిలోలు బరువు తగ్గిన మహిళ ఫాలో అయిన మెనూ ఇదే, ఇలా తింటే బరువు తగ్గడం సులువు
Weightloss: బరువు తగ్గడం అంత సులువైన పని కాదు. ఒక మహిళ ఇంటి దగ్గరే సులువుగా 28 కిలోల బరువు తగ్గింది. పోషకాహార నిపుణుడు, భోజనం మరియు వ్యాయామ చిట్కాలతో సహా బరువు తగ్గించే ఆహార ప్రణాళికను పంచుకున్నాడు. ప్రారంభ విందుల ప్రాముఖ్యతను ఆమె నొక్కి చెప్పారు.
బరువు పెరగడం ఇప్పుడు ప్రపంచానికే పెద్ద సమస్యగా మారిపోయింది. బరువు పెరగడం సులువుగదా మారి, బరువు తగ్గడం కష్టంగా మారింది. అందుకే ఇప్పుడు సోషల్ మీడియాలో బరువు తగ్గే చిట్కాలు బాగా వైరల్ అవుతున్నాయి. ఒక మహిళ తాను 28 కిలోలు ఎలా తగ్గిందో రీల్ చేసి పెట్టింది. ఆమె ఇన్ స్టాగ్రామ్ యూజర్ దీక్షా. ఆమె సర్టిఫైడ్ న్యూట్రిషనిస్టు కూడా. ఆమె ఎలాంటి డైట్ తీసుకోవడం ద్వారా బరువు తగ్గిందో వివరించింది. డైట్ ప్లాన్‌ను అనుసరించేటప్పుడు గుర్తుంచుకోవలసిన బరువు తగ్గడాన్ని ప్రభావితం చేసే ఇతర అంశాలను కూడా ఆమె ప్రస్తావించారు.

డైట్ ప్లాన్
ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ లో దీక్షా తాను అల్పాహారంలో, మధ్యాహ్న భోజనంలో, డిన్నర్లో ఏం తిన్నాదో వివరించింది. తన వెయిట్ లాస్ జర్నీలో 28 కిలోల బరువు ఎలా తగ్గిందో, ఏ డైట్ ఫాలో అయ్యిందో తెలిపింది.
- మార్నింగ్ డ్రింక్
ఆప్షన్ 1: కొత్తిమీర, సెలెరీ సీడ్, అల్లం వాటర్
ఆప్షన్ 2: జీరా వాటర్
దీక్ష ఉదయం పైన చెప్పిన రెండు పానీయాలలో ఒకటి తాగిన తర్వాత తన మెటబాలిజం స్టార్ట్ అవ్వడానికి వాకింగ్ కు వెళ్తుంది.
2. బ్రేక్ ఫాస్ట్
ఆప్షన్ 1: 2 గుడ్లు + 1 ప్యాకెట్ మష్రూమ్
ఆప్షన్ 2: కూరగాయలు, పుదీనా చట్నీతో పెసరపప్పు చిల్లా
పైన చెప్పిన రెండింట్లో ఏదో ఒకటి ఎంచుకుని వాటితో టేస్టీ బ్రేక్ ఫాస్ట్ వండుకుని దీక్షా చేసింది.
లంచ్
ఆప్షన్ 1: చికెన్, సలాడ్
ఆప్షన్ 2: కొమ్ము శెనగలు, సలాడ్
లంచ్ తర్వాత ఆమె వర్కవుట్ చేస్తుంది. ముఖ్యంగా పైలేట్స్ చేస్తుంది. స్ట్రెంత్ ట్రైనింగ్ కూడా తీసుకుంటుంది.
4. ఈవెనింగ్ స్నాక్స్
మీకు ఆకలిగా అనిపిస్తే గుప్పెడు కాల్చిన శనగలు లేదా 1 పండు + ఏవైనా 5 నట్స్
తినవచ్చు.
5. డిన్నర్
చికెన్ సూప్ తాగితే మంచి ఫలితాలు ఉంటాయి లేదా పాలకూర, తాళింపు వేసిన మొలకలు కూడా తినవచ్చు.
బరువు తగ్గడాన్ని ప్రభావితం చేసే అంశాలు
డైట్ ప్లాన్ ఒక్కటే కాదు కొన్ని అంశాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి.
వ్యాయామం
పోషకాహార నిపుణులు చెబుతున్న ప్రకారం, వారానికి 4-5 రోజులు ప్రతిరోజూ కనీసం 45 నిమిషాలు వ్యాయామం చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
వ్యాయామంతో పాటు, రోజంతా శరీరాన్ని కదిలించే పనులు చేయాలి. ఇది మీ నీట్ (నాన్-ఎక్సర్సైజ్ యాక్టివిటీ థర్మోజెనిసిస్) కు దోహదం చేస్తుంది. రోజుకు 10,000 అడుగులు నడవాలని దీక్ష సూచించారు.
నీరు
మీ పొట్ట ఆరోగ్యం చక్కగా ఉండాలంటే ప్రతిరోజూ 3 లీటర్ల వరకు నీరు త్రాగాలి. ఇది మీ జీవక్రియకు సహాయపడుతుంది. అప్పుడు బరువు తగ్గడం మరింత సులభతరంగా మారుతుంది.
నిద్ర, ఒత్తిడి
అధిక నిద్ర లేదా తక్కువ నిద్ర కూడా బరువు పెరగడానికి కారణం అవుతుంది. అలాగే ఒత్తిడి కూడా మీ బరువు తగ్గించే ప్రయానాన్ని కష్టంగా మార్చేస్తుంది. కాబట్టి తగినంత నిద్రపోవాలి. ఒత్తిడిని తగ్గించుకోవాలి.
రాత్రిపూట భోజనాన్ని ఏడు గంటలకే పూర్తి చేయాలి. దీని వల్ల శరీరంలో కొవ్వు చేరకుండా ఉంటుంది.
(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)
సంబంధిత కథనం
టాపిక్