Online Lottery: మొదటి డిజిటల్ లాటరీ ప్రారంభించిన మేఘాలయ ప్రభుత్వం-meghalaya government has launched first digital lottery in our country ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Online Lottery: మొదటి డిజిటల్ లాటరీ ప్రారంభించిన మేఘాలయ ప్రభుత్వం

Online Lottery: మొదటి డిజిటల్ లాటరీ ప్రారంభించిన మేఘాలయ ప్రభుత్వం

Haritha Chappa HT Telugu
Sep 11, 2024 06:03 PM IST

Online Lottery: మేఘాలయ ప్రభుత్వం పూర్తి డిజిటల్ లాటరీ సిస్టంను ప్రారంభించింది. ఈ లాటరీని ఎవరైనా కొనవచ్చు. డిజిటల్ పద్ధతిలో కొనడమే కనుక దేశంలో ఏ మూల నుంచి అయినా ఈ లాటరీను కొనవచ్చు. లాటరీ తగిలిందంటే 50 కోట్ల రూపాయలు మీ సొంతమైపోతాయి.

యాభైకోట్ల రూపాయల లాటరీ
యాభైకోట్ల రూపాయల లాటరీ

మేఘాలయ ప్రభుత్వం పూర్తి డిజిటల్ లాటరీ సిస్టంను ప్రారంభించింది. ఈ లాటరీని ఎవరైనా కొనవచ్చు. డిజిటల్ పద్ధతిలో కొనడమే కనుక దేశంలో ఏ మూల నుంచి అయినా ఈ లాటరీను కొనవచ్చు. లాటరీ తగిలిందంటే 50 కోట్ల రూపాయలు మీ సొంతమైపోతాయి.

లాటరీ సిస్టమ్‌లో పారదర్శకత తీసుకురావడానికి ఇలా డిజిటల్ లాటరీ పద్ధతిని ప్రారంభించినట్టు మేఘాలయ ప్రభుత్వ ముఖ్య మంత్రి కాన్రాడ్ సంగ్మా చెప్పారు.

ఈ వెబ్‌సైట్లో

easylottery.in అనేది ప్రభుత్వ ఆమోదం పొందిన ఒక లాటరీ వెబ్ సైట్. ఇది భారతీయ ప్రజల కోసం సురక్షితంగా రూపొందించినది. పారదర్శకమైన పద్ధతిలో లాటరీని అనుమతిస్తుంది. ప్రస్తుతం భారతదేశంలో నివసిస్తున్న భారత పౌరులకు మాత్రమే ఇది అందుబాటులో ఉంది. ఇది మన భారతదేశంలోని అన్ని సంబంధిత చట్టాలు, పన్నుల వ్యవస్థకు లోబడే పనిచేస్తుంది.

టిక్కెట్ ఎలా కొనాలి?

ఇక్కడ టికెట్ కొనుగోలు కూడా కొత్త పద్ధతిలో రూపొందించారు. టికెట్ ఎంచుకోవడానికి మూడు రకాల పద్ధతులు ఉన్నాయి. అందులో ఒకటి యాదృచ్ఛిక ఎంపిక. అంటే ఇక్కడ సిస్టమ్ ఏదో ఒక నెంబర్‌ను మీకు ఎంపిక చేసి ఇస్తుంది. ఇక రెండో పద్దతిలో మీరు ఒకటి నుండి తొమ్మిది వరకు ఏదో ఒక అంకెని ఎంచుకోవాలి. ఉదాహరణకు మీ అదృష్ట సంఖ్య 5 అయితే దాన్ని ఎంచుకోవచ్చు. అప్పుడు మీకు వచ్చే టికెట్ నెంబర్లోని అంకెలన్నీ కలిపితే చివరకు ఐదు వచ్చేలా మీకు లాటరీ నెంబర్ వస్తుంది. ఇక మూడో పద్ధతిలో కొనుగోలుదారులు తమకు నచ్చిన టికెట్ నెంబర్‌ను ఎంచుకోవచ్చు.

టిక్కెట్ ఎంత?

ఒక్కో టికెట్ ధర 5000 రూపాయలుగా ఉంటుంది. 5000 రూపాయలు ఖర్చుపెట్టి 50 కోట్ల రూపాయల ప్రైజ్ మనీని అందుకునే అదృష్టవంతుడు ఎవరో కొన్ని నెలల్లో తేలిపోతుంది.

భారతదేశంలోని పౌరులందరూ ఈ టికెట్లను కొనవచ్చు. అయితే మీ రాష్ట్రంలో లాటరీ వ్యవస్థ చట్టబద్ధం చేసి ఉండాలి. మన దేశంలో లాటరీలను చట్టబద్ధం చేసిన 13 రాష్ట్రాలలో మేఘాలయ ఒకటి. ఇలా ప్రభుత్వం ప్రారంభించిన లాటరీ వెబ్ సైట్ కూడా మొదటిసారిగా మేఘాలయలోనే ప్రారంభమైంది. మీ రాష్ట్రాల్లో లాటరీ చట్టబద్ధమైనదైతే మీరు కూడా ఈజీలాటరీ.ఇన్ లో టిక్కెట్లను కొనవచ్చు. మీ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు.

మన ఇండియాలో ఫస్ట్ ఆన్ లైన్ లాటరీ వ్యవస్థ ఇదే. కాబట్టి తొలిసారి పెద్ద ప్రైజ్ మనీని ప్రకటించారు. 50 కోట్ల రూపాయలను విజేతకు అందజేస్తారు

టాపిక్