మృణాల్ ఠాకూర్ అందానికి ఎంతో మంది ఫిదా అయిపోయారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె తన బ్యూటీ సీక్రెట్స్ పంచుకున్నారు. ఖరీదైన ఉత్పత్తులు వాడాల్సిన అవసరం లేకుండా ఇంట్లో ఉన్న పదార్థాలతోనే అందాన్ని కాపాడుకోవచ్చని ఆమె చెప్పారు. తన జుట్టును, చర్మాన్ని ఎలా మెరిపించుకుంటారో కూడా వివరించింది.
మీరు మీ జుట్టు మందంగా మరియు బలంగా ఉండాలనుకుంటే, మీ ముఖంపై మెరుపును చూడాలనుకుంటే మృణాల్ ఇక్కడ చెప్పిన బ్యూటీ టిప్స్ ను ఫాలో అవ్వండి. వీటికి పెద్దగా ఖర్చు కాదు కాబట్టి ప్రతి ఒక్కరూ ఫాలో అయిపోవచ్చు.
బాదం నూనె మార్కెట్లో దొరుకుతుంది. దీనిలో విటమిన్ ఇ, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉంటాయి. జుట్టు, చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ బాదం నూనెను వాడాలి. దీని వల్ల చర్మంలో హైడ్రేషన్ మెయింటైన్ అవుతుంది. బాదం నూనెలో కనిపించే లినోలెయిక్ ఆమ్లం చర్మ అవరోధాన్ని పెంచుతుంది. చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. బాదం నూనెను జుట్టుకు అప్లై చేస్తే అందులో బయోటిన్ ఉంటుంది. దీని వల్ల జుట్టు బలపడుతుంది. ఇది జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.
బాదం నూనె వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. దీన్ని ప్రతిరోజూ ఉపయోగించవచ్చు. జుట్టుకు బాదం నూనెను ఉపయోగించడానికి కలబంద జెల్ తో దాన్ని మిక్స్ చేయండి. ఇప్పుడు ఈ క్రీమీ పేస్ట్ ను జుట్టు మూలాలకు అప్లై చేసి అరగంట పాటు వదిలేయాలి. తర్వాత షాంపూ చేయాలి. ఈ హెయిర్ మాస్క్ ను వారానికి రెండు మూడు సార్లు అప్లై చేయాలి. దీని వల్ల జుట్టు పట్టు కుచ్చుల్లా మెరుస్తూ కనిపిస్తాయి. ఈ హెయిర్ మాస్క్ వేసుకున్నాక తేడాను మీరే గమనిస్తారు.
జుట్టు పెరుగుదలకు బాదం నూనె ఎంతో మంచిది కాబట్టి వారానికి రెండు మూ సార్లు వాడండి. జుట్టు చివర్లు చిట్లిపోవడం వంటి సమస్యలు దీని వల్ల కలగవు. దెబ్బతిన్న జుట్టును నయం చేసే గుణం కూడా బాదం నూనెకు ఉంది.
బాదం నూనెను ముఖానికి కూడా అప్లై చేయవచ్చు. దీని వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ముఖాన్ని కడిగిన తర్వాత, కొన్ని చుక్కల బాదం నూనెను ముఖానికి అప్లై చేయాలి. రోజూ ఇలా బాదం నూనె ముఖానికి మర్ధనా చేసుకుని రాత్రి పడుకోవడం వల్ల చర్మం మెరిసిపోతుంది. మృణాల్ ప్రతిరోజూ రాత్రి ఇదే పని చేస్తుంది. అందుకే ఆమె ముఖం ఎంతో అందంగా కనిపిస్తుంది.
పెదవులకు ప్రతిరోజూ రాత్రి బాదం నూనె రాసుకుని నిద్రపోతే ఎలాంటి సమస్యలు రావు. పెదవులు తేమవంతంగా మారుతాయి. కంటి కింద అప్లై చేస్తే నల్లటి వలయాల సమస్య కూడా తగ్గుతుంది.
(గమనిక: ఈ సమాచారం పూర్తిగా నమ్మకాలు, గ్రంథాలు, వివిధ మాధ్యమాలపై ఆధారపడి ఉంటుంది. సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా సమాచారాన్ని ఆమోదించే ముందు నిపుణులను సంప్రదించండి.)
సంబంధిత కథనం
టాపిక్