Hair Growth Oil : జుట్టు పెరిగేందుకు ఈ నూనెను వాడితే ఉపయోగం-this is the best oil to hair growth naturally know home remedies for hairs ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Hair Growth Oil : జుట్టు పెరిగేందుకు ఈ నూనెను వాడితే ఉపయోగం

Hair Growth Oil : జుట్టు పెరిగేందుకు ఈ నూనెను వాడితే ఉపయోగం

Anand Sai HT Telugu

Hair Growth Oil In Telugu : జుట్టు పెరిగేందుకు ఏం వాడాలని చాలా మంది తల గొక్కుంటారు. ఆవాల నూనె వాడితే ఉత్తమ ఫలితం ఉంటుంది.

ఆవాల నూనె ప్రయోజనాలు (unspalsh)

జుట్టు రాలడం, జుట్టు తెల్లబడటం అనేది ఈ రోజుల్లో సాధారణం అయిపోయింది. వయసుతో సంబంధం లేకుండా జుట్టు సమస్యలు వస్తు్న్నాయి. కొందరేమో జుట్టు పెరుగుదల లేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇందులో ఇంట్లోనే పాటించే కొన్ని చిట్కాలు ఉన్నాయి. మీ జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. జుట్టు రాలకుండా సురక్షితంగా ఉంచడానికి ఆవాల నూనె ఎంతగానో ఉపయోగపడుతుంది.

నిజానికి జుట్టు పెరుగుదల అనేది ప్రకృతిలో ఒక అద్భుతమనే చెప్పాలి. మనిషి అందంగా కనిపించేందుకు జుట్టు కీలక పాత్ర పోషిస్తుంది. పురుషులు, మహిళలు జుట్టును చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటారు. కొందరు పెరుగుదల లేక ఇబ్బంది పడతారు. ఇది మీ రూపాన్ని ప్రభావితం చేసేంత వరకు మీకు పెద్దగా ఏం కాదు. ఒక్కసారి జుట్టు రాలడం, పెరగడం తగ్గితే మానసికంగా గందరగోళానికి లోనవుతారు. ఆత్మవిశ్వాసం ఉండాలంటే జుట్టు కూడా ముఖ్యమే.

జుట్టు ఆరోగ్యంలో జీన్స్ ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అంతేకాదు.. మీ ఆహారం, వాతావరణం, కాలుష్యం.. జుట్టు సంరక్షణలో కీలకం. కొందరు ముఖాన్ని జాగ్రత్తగా చూసుకుంటారని కానీ.. జుట్టను పెద్దగా పట్టించుకోరు. జుట్టు ఆరోగ్యం దెబ్బ తిన్న తర్వాత బాధపడుతూ ఉంటారు. మీ జుట్టు తేమగా, హైడ్రేట్‌గా ఉంటే మెరుస్తూ, మందంగా ఉంటుంది. ఆవాల నూనె ఇందుకు ఉపయోగపడుతుంది. దీనితో మీ జుట్టును ఆరోగ్యంగా, సురక్షితంగా ఉంచుకోండి.

ఆవనూనెలో జుట్టు పెరుగుదలకు అవసరమైన అన్ని పోషకాలు ఉంటాయి. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి జుట్టు పెరుగుదల, ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. ఆవాలలోని రిసినోలిక్ యాసిడ్ తలకు రక్తప్రసరణను పెంచి, వేగంగా జుట్టు పెరుగుదలకు దారితీస్తుంది. జుట్టు రాలడం, పొడి జుట్టు ఉన్నవారు, నెరిసిన జుట్టు ఉన్నవారు ఆవనూనెను ఉపయోగించడం వల్ల ప్రయోజనం పొందవచ్చు.

ఆవాలు జుట్టుకు మెరుపునిస్తుంది. హెయిర్ డై ఎక్కువగా వాడటం, జుట్టు మీద రకరకాల కెమికల్స్ వేయడం వల్ల జుట్టు మెరుపు మాయమవుతుంది. ఆవనూనెను క్రమం తప్పకుండా మసాజ్ చేయడం వల్ల మీ జుట్టు వేగంగా, బలంగా పెరుగుతుంది. జుట్టు పెరుగుదలకు కొబ్బరినూనె, ఆలివ్ నూనె, కొన్ని చుక్కల ఆవాల నునె మిక్స్ చేసి తలకు మసాజ్ చేయాలి.

ఆవాలు ఒక అద్భుతమైన కండీషనర్. అలోవెరా జెల్, నిమ్మకాయ, తేనె కలిపి జుట్టు మూలాలకు అప్లై చేసి గంటపాటు అలాగే ఉంచాలి. కొంత సమయం తర్వాత జుట్టు కడగాలి. తర్వాత ఆవనూనె రాసుకోండి. ఇది జుట్టును బలంగా, మృదువుగా చేస్తుంది.

ఆవాల నూనె జుట్టును బలపరుస్తుంది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్ లక్షణాలను కలిగి ఉంది. తద్వారా జుట్టు రాలే సమస్య తొలగిపోయి జుట్టు వేగంగా పెరుగుతుంది. కొబ్బరి నూనెతో కలిపి దీనిని ఉపయోగించవచ్చు. ఈ మిశ్రమ నూనెను మీ తలకు పట్టించి, మీ జుట్టుపై రెండు గంటల వరకు అలాగే ఉంచి ఆపై మీ జుట్టును కడగాలి.