Alia Bhatt Disorder: అలియా భట్‌కు ఉన్న వ్యాధి ఇదే, అందుకే ఆమె పెళ్లి మేకప్ కోసం ఎక్కువ గంటలు కూర్చోలేకపోయింది
Alia Bhatt Disorder: అలియా భట్ తనకున్న డిజార్డర్ గురించి బయటపెట్టింది. ఎన్నాళ్ల నుంచో అటెన్షన్ డెఫిసిట్ డిజార్డర్ (ఏడీడీ) ఉందని, అందుకే పెళ్లి రోజున మేకప్ వేసుకునేందుకు రెండు గంటల పాటు కూర్చోలేక పోయానని చెప్పుకొచ్చింది.
అలియా భట్ తనకున్న వ్యాధి గురించి ఒక ఇంటర్య్వూలో బయట పెట్టింది. ఆమె ఎక్కువగా మేకప్ వేసుకోకుండానే కనిపిస్తుంది. సినిమాల్లో కూడా మేకప్ వేసుకునేందుకు ఇష్టపడదు. అంతేకాదు తన పెళ్లిలో కూడా తయారయ్యేందుకు రెండు గంటల సమయం పట్టిందని, ఆ సమయంలో తాను సరిగా ఉండలేకపోయానని చెప్పుకొచ్చింది అలియా భట్. దీనికి కారణం తనకున్న అటెన్షన్ డెఫిసిట్ డిజార్డర్ కారణమని చెప్పింది. మేకప్ కుర్చీలో తాను ఎక్కువ సేపు కూర్చోలేనని ఆమె అల్యూర్ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించింది. .
తన పెళ్లి రోజున మేకప్ ఆర్టిస్ట్ పునీత్ మేకప్ చేయడానికి రెండు గంటల సమయం ఇవ్వాలని కోరాడని అలియా భట్ తెలిపింది. అయితే తనకు ఏడీడీ (అటెన్షన్ డెఫిసిట్ డిజార్డర్) ఉన్నందున ఆ అభ్యర్థనను తిరస్కరించినట్టు చెప్పింది. ఈ డిజార్డర్ వల్ల తాను ఎక్కువ సమయం ఒకచోటే కూర్చోలేనని చెప్పుకొచ్చింది.
ఫోటోషూట్లు, సినిమాల సమయంలో అలియా తక్కువగా మేకప్ వేసుకునేందుకు ఇష్టపడుతున్నట్టు చెప్పింది. సినిమాలు, ఫోటో షూట్ల సమయంలో తక్కువ మేకప్ వేయమని మేకప్ ఆర్టిస్టులకు తాను ముందే చెప్పేస్తానని తెలిపింది. కేవలం అరగంటలోనే తన మేకప్ పూర్తయ్యేలా చూసుకుంటానని చెప్పింది.
అటెన్షన్ డెఫిసిట్ డిజార్డర్ అంటే ఏమిటి?
అటెన్షన్ డెఫిసిట్ డిజార్డర్ (ఎడిడి) అనేది ఒక రకమైన హైపరాక్టివ్ డిజార్డర్. ఈ వ్యాధి బారిన పడిన వారు ఎక్కువ కాలం ఒకే పనిలో ఉండలేరు. ఒకే అంశంలో దృష్టి పెట్టడంలో ఇబ్బంది ఉంటుంది. అందుకే వారు ఒకేచోట ఎక్కువ సేపు కూర్చోలేరు. దీనికి పెద్దగా చికిత్స ఉండదు. ఈ డిజార్డర్ ఉన్న వారు ఒకే పనిలో ఏకాగ్రత పెట్టలేరు. ఒకే పనిని ఎక్కువసేపు చేయలేరు. ఒత్తిడికి లోనవుతారు, చిరాకు పడుతుంటారు.
ఈ ఇంటర్వ్యూలో ఆలియా కూడా అందానికి తన నిర్వచనం ఏమిటో చెప్పుకొచ్చింది. "అందం అంటే నిజంగా మిమ్మల్ని మీరు ఎలా ఉన్నారో అలా స్వీకరించడం. అందం చూసేవారి కళ్లలోనే ఉంటుంది’ అని చెప్పుకొచ్చింది అలియా భట్.