ఎంత వద్దనుకున్నా ఒక వ్యక్తికి సంబంధించిన ఆలోచనలే వస్తున్నాాయా? ఎంత ప్రయత్నించినా ఏదో ఒక రకంగా వాళ్లే గుర్తొస్తున్నారా? అయితే దానికి కొన్ని కారణాలు ఉండి ఉంటాయి. అవేంటో తెల్సుకోండి. మీ ఊహలకు కారణం తెల్సిపోతుంది. మీ ఆలోచనమీద స్పష్టత వస్తుంది.
ఆ వ్యక్తితో మీకు తెలీకుండానే ప్రేమలో పడ్డారేమో. అందుకే వాళ్ల గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నారు. వాళ్లు మీ చుట్టూ లేకపోతే వాళ్లను బాగా మిస్ అవుతున్నారన్నమాట. వాళ్ల ఆలోచన రాగానే మీ కడుపులో ఏదో తెలియని ఆనందం వస్తుంది. గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఏ పని చేస్తున్నా ముఖం మీద ముసి ముసి నవ్వులుంటాయి. ఏం చూసినా వాళ్లతో జరిగిన సంఘటనలతో పోల్చేసకుంటారు. వాళ్ల ఆలోచన మీకు చాలా ఆనందాన్నిస్తుంది.
మీరు ఒకరి గురించి బాగా తలుచుకుంటే వాళ్లకు తెలుస్తుందట. వాళ్లు కూడా మీ గురించే ఆలోచిస్తారట. దీనికి ఎలాంటి నిరూపణలు లేకపోయినా.. మన మనసు చెప్పే మాటలివి. మీకెవరైనా తరచూ గుర్తొస్తుంటే వాళ్లు మీ గురించి ఆలోచిస్తున్నారేమో. అలా అనిపిస్తే ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. ఆలస్యం చేయకండి. అది మీ కొత్త బంధానికి దారేమో..
మీ జీవితం మొత్తం సమస్యలతో చుట్టుముట్టి ఉన్నప్పుడు వాటి నుంచి మీ దృష్టి మరల్చుకోడానికి మీరొక వ్యక్తి మీద దృష్టి పెట్టి ఆలోచించొచ్చు. వాళ్ల ఆలోచన రాగానే మీకు ఆనందంగా అనిపించొచ్చు. మీ కష్టాలు మర్చిపోయి కాసేపయినా ఆనందంగా ఉండటానికి కొన్ని సార్లు మనకిష్టమైన మనుషులను మనసు గుర్తు చేస్తుంటుంది.
అందరితోనూ ప్రేమలోనే పడాలని లేదు. కొందరిని చూడగానే ఆకర్షణ ఏర్పడుతుంది. వాళ్ల అందం వల్ల, మాటల వల్ల మీకు బాగా నచ్చేస్తారు. అమ్మాయిల్లో, అబ్బాయిల్లో ఎవరికైనా ఇలా జరగొచ్చు. ఇదేం చెడు లక్షణం అనుకోక్కర్లేదు. ఒకరి మనుసు స్పందించే తీరు అది. అందుకే ఆ వ్యక్తి గురించి ఆలోచించినప్పుడల్లా మీకు ఒకరకమైన తృప్తి దొరుకుతుంది.
ఎవరితోనూ రిలేషన్‌షిప్ లో లేరా? సింగిల్ గా చాలా కాలం నుంచి ఉంటున్నారా? అలాంటప్పుడు ఒక వ్యక్తిని చూసి మీరిష్టపడితే, ఆ వ్యక్తితో రిలేషన్‌షిప్ లో ఉండాలనే కోరిక మీ మనసులో పుడితే ఆ వ్యక్తి గురించి ఊరికే ఆలోచిస్తారు. ఒంటరి తనానికి స్వస్తి చెప్పి వాళ్లతో జీవితాన్ని ఊహించుకోవడం మొదలుపెడతారు. అందువల్ల పదే పదే ఆ వ్యక్తి గురించే రకరకాలుగా ఆలోచిస్తారు.
మీకొక వ్యక్తి వ్యక్తిత్వం చాలా కొత్తగా అనిపిస్తే, మునుపెన్నడూ అలాంటి వ్యక్తిని కలుసుకోకపోతే వాళ్ల ఆలోచనలు కాస్త ఎక్కువే రావచ్చు. మీకెన్నడూ ఎవ్వరూ ఇవ్వని సర్ప్రైస్‌లు ఇస్తే, మిమ్మల్ని వాళ్ల చాతుర్యంతో ఆశ్చర్చపరిస్తే, అందరిలో మిమ్మల్ని కాస్త ప్రత్యేకంగా చూసినట్లు అనిపిస్తే వాళ్లకు ఆకర్షితులవుతారు. వాళ్ల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు.
టాపిక్