Rose Day Special: రోజ్ డే రోజున గులాబీలు ఇచ్చి ప్రపోజ్ చేద్దామనుకుంటున్నారా? గులాబీ రంగును బట్టి అర్థం మారుతుందట తెలుసా!-thinking of proposing with roses on rose day did you know that the meaning changes depending on the color of the rose ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Rose Day Special: రోజ్ డే రోజున గులాబీలు ఇచ్చి ప్రపోజ్ చేద్దామనుకుంటున్నారా? గులాబీ రంగును బట్టి అర్థం మారుతుందట తెలుసా!

Rose Day Special: రోజ్ డే రోజున గులాబీలు ఇచ్చి ప్రపోజ్ చేద్దామనుకుంటున్నారా? గులాబీ రంగును బట్టి అర్థం మారుతుందట తెలుసా!

Ramya Sri Marka HT Telugu
Published Feb 07, 2025 08:30 AM IST

Rose Day Special: వాలెంటైన్ వీక్ మొదలవుతోంది. ఈ ప్రేమ వారంలో మొదటి రోజైన రోజ్ డే రోజున ప్రేమికులు తమకు ఇష్టమైన వారికి గులాబీలు ఇచ్చి, ప్రపోజ్ చేస్తారు. అయితే గులాబీ రంగును బట్టి భావన మారుతుందట. కాబట్టి ఏ రంగు గులాబీ ఏ భావనను తెలియజేస్తుందో తెలుసుకుందాం. ఈ వార్త చదవండి.

గులాబీ రంగును బట్టి అర్థం మారుతుందట తెలుసా!
గులాబీ రంగును బట్టి అర్థం మారుతుందట తెలుసా! (shutterstock)

ప్రేమ అనే ప్రస్తావన వచ్చిన వెంటనే గుర్తొచ్చేది రోజ్ ఫ్లవర్ (గులాబీ పువ్వు). ప్రేమను వ్యక్తపరచడానికి ప్రతి ఒక్కరూ వాడేది గులాబీ పువ్వునే. కొన్ని సందర్భాల్లో మాటలు లేకున్నా గులాబీ పువ్వే మాట్లాడుతుంది. సినిమాల్లోనూ ఇలాంటి సీన్లు బోలెడు. ఒక గ్రీటింగ్ కార్డ్ దాంతో పాటు ఒక రెడ్ రోజ్ ఫ్లవర్. చాలా మందికి ఇవే తెలుసు కదా. నిజానికి ప్రేమ అంటే కేవలం ఎర్ర గులాబీ మాత్రమే కాదు. ప్రేమను వ్యక్తీకరించడానికి మరిన్ని రంగుల గులాబీలను వాడొచ్చు. ఒక్కో రంగు గులాబీకి ప్రత్యేకమైన అర్థముందట.

మరి, ఈ ఏడాది వాలెంటైన్స్ డే రోజున మీ ప్రేమను బయట పెట్టేద్దాం అనుకుంటున్నారా? రోజా పూలతో విష్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారా? అయితే వాలెంటైన్స్ వీక్‌లో వచ్చే మొదటి రోజెైన రోజ్ డే నాడు పువ్వులతో మీ ప్రేమను వ్యక్తరచండి. ప్రతి ఏడాది ఫిబ్రవరి 7వ తేదీన రోజ్ డేను సెలబ్రేట్ చేసుకుంటారు.ఈ రోజున మీలోని భావాలను స్పష్టంగా తెలియజేయడానికి, దానికి తగ్గట్టు రంగులో ఉన్న గులాబీని ఎంచుకోండి. వీటి ద్వారా మీ ఫీలింగ్‌ను మీ భాగస్వామికి లేదా కాబోయే భాగస్వామికి తెలియజేయండి.

ఏ రంగు గులాబీ ఏ ఫీలింగ్‌ను సూచిస్తుందంటే..

ఎరుపు గులాబీ

వాలెంటైన్ వీక్‌ మొత్తంలో అత్యధికంగా కొనుగోలు అయ్యే గులాబీలలో రెడ్ రోజ్ మొదటి స్థానంలో ఉంటుంది. దీనికి అంత క్రేజ్ మరి. దానికి తగ్గట్టే ఈ కలర్ రోజ్‌కు మీనింగ్ కూడా ఉంది. ఎరుపు గులాబీ ప్రేమ, రొమాన్స్‌ను సూచిస్తుంది. ప్రేమికులు లేదా జీవిత భాగస్వాములకు తమ మనస్సులోని ప్రేమను స్పష్టంగా వ్యక్తీకరించడానికి ఈ రంగు పూలను ఇస్తారు. ఇరువురు ప్రేమలో ఉన్నామనే ముందుగా ఏమైనా సంకేతాలు ఇచ్చుకున్నప్పుడు ఈ రంగు గులాబీని వాడి వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు తెలుపుకోవాలి.

పసుపు గులాబీ

ఎరుపు గులాబీ తర్వాత పసుపు గులాబీ గురించి మాట్లాడుకుంటే, ఇది స్నేహం, సంతోషాన్ని సూచిస్తుంది. మీకు చాలా ప్రత్యేకమైన స్నేహితుడికి మీ భావాలను తెలియజేయడానికి ఈ రంగు గులాబీని బహుకరించవచ్చు. ఇంకా మీకు ఆ వ్యక్తి విషయంలో ప్రేమ అనే స్పష్టమైన భావన రాకపోతే పసుపు గులాబీ ఇచ్చి మీ బంధం స్నేహం వరకూ వెళ్లిందని తెలియజేయవచ్చు.

తెల్ల గులాబీ

తెల్ల గులాబీ ప్రేమ ప్రారంభాన్ని సూచిస్తుంది. మీరు ఎవరినైనా ఇష్టపడుతున్నట్లయితే, వారికి మీలో ఫీలింగ్ తెలియజేయడానికి తెల్ల గులాబీని బహుకరించవచ్చు. అంతేకాకుండా, మీ ఇద్దరి మధ్య మనస్పర్దలు వంటివి వస్తే అవి పరిష్కరించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేయడానికి కూడా తెల్ల గులాబీని ఇవ్వవచ్చు.

పింక్ గులాబీ

పింక్ కలర్‌లో ఉండే గులాబీ ఇవ్వడం వల్ల అవతలి వ్యక్తిపై మీకున్న గౌరవం, కృతజ్ఞతను సూచిస్తుంది. ఈ రంగు గులాబీని మీ జీవిత భాగస్వామికే కాదు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు కూడా అందజేయవచ్చు. ఈ రంగు గులాబీని ఇవ్వడం అంటే మీరు వారిని మీ జీవితంలో కలిగి ఉండటంపై చాలా సంతోషంగా, కృతజ్ఞతగా భావిస్తూ ఉన్నారని అర్థం.

మరింకెందుకు ఆలస్యం, వాలెంటైన్స్ వీక్ లో మొదటి రోజైన రోజ్ డే రోజు మీ ఫీలింగ్‌కు కరెక్ట్‌గా సరిపడే రోజ్ ఎంచుకుని శుభాకాంక్షలు తెలియజేయండి.

Whats_app_banner

సంబంధిత కథనం