Top Of The Fridge: ఫ్రిజ్ మీద వస్తువులను పెట్టడం కరక్టెనా? పొరపాటున కూడా పెట్టకూడని వస్తువులేంటో తెలుసా?
Top Of The Fridge: ఫ్రిజ్ లోపల ఏమి పెట్టాలో, ఏం పెట్టకూడదో మీకు చాలా మంది చెప్పి ఉంటారు. కానీ ఫ్రిజ్ పైన ఏమి పెట్టాలి, ఏం పెట్టద్దూ అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? తెలుసుకున్నారా? ఇప్పుడే తెలుసుకోండి లేదంటే మీరు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
ఒకప్పుడు ఫ్రిజ్‌ను లగ్జరీ వస్తువుగా చూసేవారు, కానీ నేడు ఇది దాదాపు ప్రతి ఇంట్లోనూ ఉండే సాధారణ వంటగది వస్తువు. శీతాకాలం నుంచీ వేసవికాలం వరకూ, ప్రతి సీజన్‌లోనూ దీని ఉపయోగిసతున్నారు. ఆహారాన్ని ఎక్కువ కాలం తాజాగా ఉంచడం లేదా నిల్వ చేయడం వంటి పనులను ఫ్రిజ్ చాలా పనులను సులభతరం చేస్తుంది.

మరో విషయం ఏంటంటే.. ఈ మధ్య ఫ్రిజ్ ఇంటి అలంకరణలో కూడా ముఖ్యమైన భాగం అయిపోయింది. దీని కారణంగా, చాలా మంది ఫ్రిజ్ పైన చాలా వస్తువులను పెట్టి అలంకరించుకుంటారు. ఇంకొందరు అవసరమైన కొన్ని వస్తువులను దాని మీద పెడుతున్నారు. ఇది చూడటానికి, వాడటానికి బాగానే అనిపించవచ్చు, కానీ ఇలా చేయడం చాలా హానికరమని మీకు తెలుసా? అవును, మీరు ఫ్రిజ్ లోపల కొన్ని వస్తువులను పెట్టడం ఎలాగైతే ఆరోగ్యానికి హాని చేస్తుందో అలాగే ఫ్రిజ్ పైన కూడా కొన్ని రకాల వస్తువులను ఉంచకూడదు. అలాంటి కొన్ని వస్తువుల గురించి తెలుసుకుందాం.
మొక్కలతో అలంకరించడం:
ఇంటి అలంకరణలో మొక్కలు చాలా ముఖ్యమైనవి. ఇవి ఇంటికి సహజమైన, అందమైన రూపాన్ని ఇస్తాయి. కొన్ని రకాల మొక్కలు ఇంట్లోకి సానుకూల శక్తినీ, అదృష్టాన్ని ఆకర్షిస్తాయని కూడా చెబుతున్నారు. అయితే ఈ మధ్యకాలంలో ఫ్రిజ్ ఖాళీగా కనిపించకుండా ఉండటానికి, ప్రజలు దానిపైన మొక్కలను పెంచుతున్నారు. అయితే, బాంబూ ప్లాంట్ వంటికొన్ని మొక్కలు ఫ్రిజ్ పైన అలంకరించకూడదు. ఫ్రిజ్‌కు ఉండే విద్యుదయస్కాంత క్షేత్రం ఈ మొక్కల నుంచి విడుదలయ్యే సానుకూల శక్తులను నాశనం చేస్తుంది.
మందులు, సిరప్‌లను ఉంచడం
సమయానికి మందులు వేసుకోవాలని గుర్తుండేందుకు చాలా మంది ప్రజలు మందుల బాటిళ్లు, ట్యాబ్లెట్లను ఫ్రిజ్ పైన ఉంచుతున్నారు. ఇలా చేయడం మీ మందులపై ప్రభావం చూపుతుంది. ఫ్రిజ్ లోపల చల్లగా ఉన్నప్పటికీ బయట చాలా వేడిగా ఉంటుంది. ఇది మీ మందుల ప్రభావాన్ని తగ్గిస్తుంది.
ఫిష్ అక్వేరియం:
ఇంటిని అలంకరించడానికి అక్వేరియం కూడా చాలా బాగా సహాయపడుతుంది. అయితే దీన్ని కొన్నిసార్లు ఫ్రిజ్ పైన అలంకరిస్తారు. ఇలా చేయడం చేపల ఆరోగ్యానికి హాని జరుగుతుంది. ఫ్రిజ్ నుంచి వచ్చే వేడి, విద్యుదయస్కాంత క్షేత్రం చేపల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. సాధారణంగా, ఫ్రిజ్ పైన ఉంచిన అక్వేరియంలోని చేపలు త్వరగా చనిపోతాయని తేలింది. అందువల్ల ఫిష్ అక్వేరియంను ఫ్రిజ్ పైన ఉంచడం మానుకోవాలి.
ట్రోఫీలు, అవార్డులు:
ఫ్రిజ్ పైన మీ ట్రోఫీలు, అవార్డులను అలంకరించి ఉంటే, వెంటనే వాటిని అక్కడ నుండి తీసివేసి వేరే చోటకి మార్చండి. వాస్తు శాస్త్రం ప్రకారం, ఇది మీకు చాలా అశుభం. అలా చేయడం వల్ల విజయం మీకు దూరమవుతుందని చెబుతారు. వాస్తుతో పాటు, ఫ్రిజ్ పైన లోహంతో తయారు చేయబడిన భారీ వస్తువులను ఉంచడం వల్ల అంతర్గత నష్టం జరిగే అవకాశాలు కూడా పెరుగుతాయి, కాబట్టి అలాంటి వస్తువులను ఫ్రిజ్ నుండి దూరంగా ఉంచండి.
ఎలక్ట్రానిక్ వస్తువులు:
సాధారణంగా, ప్రజలు స్థలాన్ని ఆదా చేయడానికి ఫ్రిజ్ పైన టోస్టర్, మైక్రోవేవ్, రేడియో వంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాలను ఉంచుతారు. కానీ ఈ చిన్న తప్పు కారణంగా మీ ఖరీదైన ఎలక్ట్రానిక్ ఉపకరణాలు త్వరగా పాడవుతాయి. ఫ్రిజ్ కంప్రెసర్ నుండి వెలువడే కంపనాలు ఈ ఉపకరణాల అంతర్గత భాగాలను దెబ్బతీస్తాయి. అందువల్ల, మీకు తెలియకుండానే మీ టోస్టర్, మైక్రోవేవ్, రేడియో త్వరగా పాడవుతాయి.