Maintain good mood: మూడ్ బాగోలేదా మచ్చా.. ఈ టిప్స్ పాటించి చూడు
Maintain good mood: మూడ్ బాగోలేదన్న మాట తరచూ వింటాం. పార్ట్‌నర్, స్నేహితులు, కొలీగ్స్, కుటుంబ సభ్యుల నుంచి రోజుకోసారైనా ఇలా వింటాం. మానసిక స్థితి బాగోలేకపోతే అనేక విషయాలను ప్రభావితం చేస్తుంది. మూడ్ బాగుండాలంటే ఏం చేయాలో థెరపిస్ట్ సూచనలు ఇక్కడ చూడండి.
మన మానసిక ఆరోగ్యం చాలా విలువైనది. మనం ఉన్న మూడ్ (మానసిక స్థితి) మన చుట్టూ ఉన్న అనేక అంశాల వల్ల ప్రభావితమవుతుంది. అది మన ఉద్యోగం కావచ్చు, లేదా మన భాగస్వామి కావచ్చు. లేదా మన కుటుంబం కావొచ్చు, మన చుట్టూ ఉండే స్నేహితులు కావొచ్చు. మంచి మానసిక స్థితిని పొందడంలో లేదా జీవితంలో నిరంతరం మనల్ని సంతోషంగా ఉంచడంలో చాలా విషయాలు పనిచేస్తాయి. ఈ మానసిక స్థితి శారీరకంగానూ, మానసికంగానూ మనపై ప్రభావం చూపుతుంది. అందువల్ల మనం తీసుకున్న నిర్ణయాల వల్ల మన మానసిక స్థితి పాడవకుండా చూసుకోవడానికి కొన్ని అంశాల్లో ఎంపిక చాలా ముఖ్యం.
ట్రెండింగ్ వార్తలు
ఇదే అంశాలపై థెరపిస్ట్ నెడ్రా గ్లోవర్ తవాబ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు.‘మన మూడ్, వాతావరణం, శారీరక, మానసిక ఆరోగ్యం, జీవనశైలిని ప్రభావితం చేసే అంశాల్లో సెలెక్టివ్‌గా ఉండాలి. ఇందుకు సమయాన్ని వెచ్చించాలి. ఉద్దేశపూర్వకమైన సంబంధాలను సృష్టించాలి..’ అని చెబుతూ ఆరు అంశాల్లో మనం సెలక్టివ్‌గా ఉండాలని సూచించారు.
కంపెనీ: మన చుట్టూ ఉన్న వ్యక్తులే మన మానసిక స్థితిని ప్రతిబింబింపజేస్తారు. అందుకే మనం కంపెనీ ఎంచుకునేటప్పుడు జాగరూకతగా ఉండాలి. వారు పాజిటివ్ సమూహాలై, మన నమ్మే విలువలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలి.
సలహా: మనం తరచుగా సలహా కోసం ఇతరులను సంప్రదిస్తాం. జీవితంలో ఇతరుల అభిప్రాయాలు, దృక్కోణాలు అవసరం అవుతాయి. ముఖ్యంగా మనం స్వయంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితుల్లో లేనప్పుడు ఇలా చేస్తాం. అయితే మనం ఏ వ్యక్తిని సలహా కోరుతున్నామో అవగాహన ఉండాలి. తదనుగుణంగా నడుచుకోవాలి.
బహిర్గతం: మీ రహస్యాలను, మీ సవాళ్లను, మీ లక్ష్యాలను మిమ్మల్ని ప్రోత్సహించే వారి వద్ద, మీకు ప్రేరణ ఇచ్చే వారి వద్ద బహిర్గతం చేయండి. కానీ క్రెడిట్ తీసుకునే వాళ్ల దగ్గర కాదు.
భాగస్వామి: వివాహ భాగస్వామిగా లేదా రొమాంటిక్ పార్ట్‌నర్‌గా ఒక వ్యక్తిని కోరుకున్నప్పుడు ఎంపిక చాలా ముఖ్యం. మనం ఎలా ఉన్నామో అలా సమ్మతించే వారిని జాగరూకతతో ఎంచుకోవడం ముఖ్యం. జీవితాంతం సపోర్ట్ చేసే వారై ఉండాలి. మనం నమ్మే విలువలు, నైతికత సరిపోలాలి.
సమయం: ఒకరికి సమయం కేటాయించడం జాగరూకత చర్యల్లో ఒకటి. మనం దేనిపై టైమ్ వెచ్చిస్తున్నామో అవగాహన కలిగి ఉండాలి. మన సమయం వృథా కాకుండా, దుర్వినియోగం కాకుండా జాగ్రత్తపడాలి.
మాటలు: మనతో మనం మాట్లాడుకునే విధానం లేదా ఇతరులకు మన గురించి మనల్ని వివరించే విధానం చాలా ముఖ్యం. మన నిజాయతీ, దయను చూపుతాయి. అవే మనం ఇతరులకు చూపుతాం.