Expectations in relationship: భాగస్వామి నుంచి ఇవి ఆశిస్తే తప్పు కాదు..
Expectations in relationship: భాగస్వామి నుంచి సౌకర్యం కోరుకోవడం దగ్గర నుంచి ఆప్యాయతను ఆశించడం వరకు కొన్ని అంచనాలు మంచివే. అవేంటో తెలుసుకోండి.
ఒక బంధం నిలబడాలంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అవతలి వ్యక్తి అవసరాల్ని, కోరికల్ని, అంచనాలని కూడా అర్థం చేసుకోవాలి. అయితేనే బంధం బలపడుతుంది. నిజాయతీ, నమ్మకం ఒక బలమైన బంధానికి పునాదులు. ఒక్కోసారి మన భాగస్వామి నుంచి ఎక్కువగా ఆశిస్తున్నామా, ఎక్కువగా కోరికలు పెంచుకుంటున్నామా అనే సందేహం కలుగుతుంటుంది. అనవసరమైన అంచనాలుంటే తప్పే కానీ, కొన్ని కోరికలు, అంచనాలు వాళ్ల మీద ఉంటేనే మంచిది.
అయితే ఆ కోరికలు సమంజసమా కాదా అనే ఆలోచన ఉండాలి. మీ పెళ్లి రోజున మీకు వజ్రాలు కొనివ్వాలని కోరిక ఉంటే అది మంచి ఆలోచన కాకపోవచ్చు. మీరు బాధలో ఉన్నప్పుడు మీ దగ్గరుండి, మిమ్మల్ని ఓదార్చాలనే కోరిక మంచిది. ఇలా ఏది ఆశిస్తే మంచిదో అనే ఆలోచన ఉంటే చాలు.
మన భాగస్వామి నుంచి ఏం ఆశిస్తే తప్పులేదో తెలుసుకోండి:
ఆప్యాయత:
ప్రేమ, ఆప్యాయత బంధంలో ముఖ్యమైనవి. ఇవి కోరుకోవడం తప్పు కాదు. భాగస్వామి మీద ప్రేమను మాటల్లో, చేతల్లో తెలియజేయాలి.
సమయం గడపడం:
ఇద్దరూ కలిసి సమయం గడపాలి. మీ ఇతర పనులకు, అవసరాలకు సమయం ఇస్తూనే మీ భాగస్వామితో కూడా వీలైనంత ఎక్కువ సమయం గడిపేలా కేటాయించుకోవాలి. ఇది బంధాన్ని బలపరుస్తుంది.
ప్రవర్తన:
భాగస్వామి ప్రవర్తన వల్ల మన మీద పడే ప్రభావం గురించి వాళ్లు తెలుసుకోవాలని, అర్థం చేసుకోవాలని ఆశించడం తప్పుకాదు.
ఆసక్తి:
మన కలలు, విలువలు, నిజాయతీ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉండాలి. మీ మీద కాస్త శ్రద్ధ చూపాలని కోరుకోవడం తప్పేం కాదు.
భరోసా:
కష్ట సమయంలో వాళ్ల నుంచి భరోసా, కాస్త ఓదార్పు ఆశించడం తప్పుకాదు.
విశ్వాసం:
ఒక సంబంధం ప్రత్యేకమైనది అయినప్పుడు, అవతలి వ్యక్తి మనకు నమ్మకంగా ఉండాలని మనం ఆశించాలి.
విభేదించడాన్ని అంగీకరించడం:
విభిన్న ఆలోచనలు, అభిప్రాయాలు కలిగిన ఇద్దరు వ్యక్తులు ఎల్లప్పుడూ విభేదించుకోవచ్చు. అలాని విడిపోవాల్సిన అవసరం లేదు. వాళ్ల విభేదాలను కూడా స్వీకరించాలి.
టాపిక్