Chanakya Niti Telugu : పెళ్లి చేసుకునేముందు పురుషులు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు-things men must know before getting married according to chanakya niti ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Chanakya Niti Telugu : పెళ్లి చేసుకునేముందు పురుషులు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు

Chanakya Niti Telugu : పెళ్లి చేసుకునేముందు పురుషులు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు

Anand Sai HT Telugu

Chanakya Niti On Marriage : ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో పెళ్లికి సంబంధించిన ఎన్నో విషయాలను చెప్పాడు. ఎలాంటి వారిని పెళ్లి చేసుకోవాలో పురుషులకు వివరించాడు.

పెళ్లికి ముందు పురుషులు తెలుసుకోవాల్సిన విషయాలు (unsplash)

జీవితంలో విజయం సాధించిన ప్రతి ఒక్కరి వెనుక ఎప్పుడూ ఒక మహిళ ఉంటుందని చెబుతారు. అయితే స్త్రీ తలచుకుంటే ఏ పురుషుడినైనా పతనం చేయగలదనేది కూడా నిజం. గొప్ప దౌత్యవేత్త, తత్వవేత్త ఆచార్య చాణక్యుడి మాటలు కూడా అదే. ఎంతో మంది చాణక్య నీతిని పాటిస్తారు. ఆయన జీవితానికి సంబంధించిన అనేక విషయాలను చెప్పాడు. అందులో పెళ్లి గురించి అనేక విషయాలు తెలిపాడు.

ఒక వ్యక్తి తన జీవితంలో ఎత్తులను అధిగమిస్తే అతని భార్య అతని వెనుక ఉంటుందని చాణక్యనీతిలో చెప్పబడింది. మరోవైపు భార్యలో కొన్ని చెడు లక్షణాలు ఉంటే ఆ ఇల్లు నరకంగా మారడానికి ఎంతో కాలం పట్టదని చాణక్యుడు చెబుతున్నాడు. చాణక్యనీతి ప్రకారం చెడ్డ భార్యను ఎలా గుర్తించాలో చూద్దాం.

భౌతిక ఆనందం

తన భౌతిక ఆనందానికి ప్రాధాన్యత ఇచ్చే స్త్రీ తన భర్తకు లేదా కుటుంబానికి ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వదని చాణక్యుడు చెప్పాడు. అలాంటి స్త్రీలను వివాహం చేసుకోవడం మంచిది కాదు. ఎందుకంటే వారు ఊహ ప్రపంచంలో జీవిస్తారు. అలాంటి స్త్రీలు ఇతరులతో సంబంధాన్ని కూడా పెట్టుకోగలరు.

కఠిన ప్రవర్తన

చాణక్యుడు ప్రకారం, ఒక స్త్రీ కఠినంగా ప్రవర్తిస్తే, ఇతరులను అవమానించడానికి ప్రయత్నిస్తే అలాంటి స్త్రీ ఎప్పుడూ కుటుంబాన్ని చక్కగా నడిపించదు. అలాంటి మహిళలు తమ భర్తలను, కుటుంబ సభ్యులను ఎన్నటికీ గౌరవించరని చాణక్యుడు చెప్పాడు. అతిథులను స్వాగతించని, పెద్దలను గౌరవించని స్త్రీతో సహవాసం మిమ్మల్ని కుటుంబం, బంధువుల నుండి దూరం చేస్తుంది. అలాంటి స్త్రీ కుటుంబానికి అవమానం, ప్రమాదం తెస్తుంది.

అబద్ధాలు చెప్పడం

ఎప్పుడూ అబద్ధాలు చెప్పే స్త్రీలు తమ భర్తలకు కష్టాలు తెచ్చిపెడతారు. తన భర్తను ఎప్పుడూ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుందని, కుటుంబంలో సమస్యలకు కారణమవుతుందని చాణక్యుడు చెప్పాడు. లేనిపోని అబద్ధాలు చెప్పి ఇంట్లో సమస్యలను సృష్టిస్తారు. దీంతో ఇంట్లో ఒకరికొకరు దూరం అవుతారు.

స్వంత లాభం

చాణక్య నీతి ప్రకారం మోసం చేసే లేదా స్వంత లాభం కోసం ఎవరినైనా ఉపయోగించుకునే స్త్రీలు కుటుంబంలో సామరస్యాన్ని సృష్టించలేరు. వారు కుటుంబంలో సమస్యలను కలిగిస్తూనే ఉంటారని చాణక్యుడు చెప్పాడు. అలాంటి మహిళలకు దూరంగా ఉండటం మంచిది.

దురాశతో ఉండే స్త్రీ

దుష్ట, దురాశతో కూడిన స్త్రీ నీడకు కూడా దూరంగా ఉండటమే మంచిదని చాణక్యనీతి చెబుతోంది. అటువంటి మహిళ మిమ్మల్ని ఎప్పుడైనా పెద్ద ఇబ్బందుల్లోకి నెట్టవచ్చు. వారి కుటుంబానికి కూడా ప్రమాదం. అలాగే మహిళలు తమ కుటుంబ వ్యవహారాలను బయటి వ్యక్తులతో పంచుకోవడం మొదలుపెడితే మీ కుటుంబం పతనావస్థలో ఉందని అర్థం చేసుకోండి.

కుటుంబాన్ని పట్టించుకోకపోవడం

చదువుకోని స్త్రీ అనవసరంగా డబ్బు ఖర్చుపెట్టి తన పిల్లలకు మంచి విలువలు చెప్పకుండా కుటుంబానికి మంచిది కాదు. వారు ఇంటిని ఆర్థికంగా అస్థిరపరుస్తారు. పైగా అలాంటి ఆడవాళ్ళు కొత్త తరానికి పెద్ద పీట వేయక పోవడం వల్ల చాలా నష్టపోతారు. కుటుంబ స్థితిగతులతో సంబంధం లేకుండా, మహిళలు అనవసరంగా డబ్బు ఖర్చు చేయడం, పిల్లలను పట్టించుకోకపోవడం వల్ల కుటుంబం విచ్ఛిన్నం అవుతుంది.