Chanakya Niti Telugu : ఇలాంటి వ్యక్తులు విషంలాగా మీ జీవితాన్ని కొద్దికొద్దిగా నాశనం చేస్తారు
Chanakya Niti On Children : ఆచార్య చాణక్యుడు గొప్ప గురువు. కుటుంబం గురించి చాలా విషయాలు చెప్పాడు. ఎలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలో చాణక్య నీతి వివరిస్తుంది.

చాణక్యుడు ప్రాచీన భారతదేశానికి చెందిన గొప్ప తత్వవేత్త, రాజనీతిజ్ఞుడు. కౌటిల్య అని కూడా పిలువబడే చాణక్యుడు మౌర్య చక్రవర్తి చంద్రగుప్తుని రాజకీయ వ్యూహకర్త, సలహాదారు. జీవితంలోని వివిధ కోణాల్లో చాణక్యుడికి ఉన్న అపారమైన జ్ఞానం అందరికీ తెలిసిందే. ఆయన మాటలు ఏ వయస్సు వారికైనా సంబంధించినవి. చాణక్య నీతి అనేది ఆయన జ్ఞానం, అనుభవాల సమాహారం.
చాణక్యుడి మాటలను అనుసరించిన వ్యక్తి జీవితంలోని అనేక సమస్యల నుండి బయటపడగలడని అంటారు. నేటి వేగవంతమైన, పోటీ ప్రపంచంలో మన దైనందిన జీవితంలో మనం సహవాసం చేసే వ్యక్తుల పట్ల మనమందరం జాగ్రత్తగా ఉండాలి. మీ జీవితంలో 5 రకాల వ్యక్తుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని చాణక్యుడు ప్రజలకు సలహా ఇస్తాడు. అలాంటి వారిని సకాలంలో గుర్తించకపోతే వారు మీ జీవితాన్ని నాశనం చేస్తారు. వారితో కలిసి జీవించడం మరణాన్ని ఆహ్వానించినట్లే అంటున్నారు చాణక్యుడు.
భర్తను మోసం చేసే భార్య
భర్తను మోసం చేసే భార్య లేదా ఇతర పురుషుల గురించి ఆలోచించే భార్యతో కాపురం చాలా ప్రమాదమని చాణక్యుడు చెప్పాడు. అలాంటి స్త్రీలు తమ భర్తలకు ద్రోహం చేసి తమ కుటుంబాలకు పరువు తీయడానికి కూడా వెనుకాడరు. నరకంలో ఉండి బాధపడటం కంటే అలాంటి భార్యను విడిచిపెట్టడమే మేలు అంటాడు చాణక్యుడు. అలాంటి మహిళలతో జీవితం మీకు నరకం కంటే దారుణంగా ఉంటుంది.
మాట ధిక్కరించడం
ఒక సేవకుడు తన యజమాని ఆజ్ఞను ధిక్కరిస్తే లేదా ఇంట్లో దొంగతనం చేయడం ప్రారంభించినట్లయితే అది పేలడానికి సిద్ధంగా ఉన్న బాంబు లాంటిది. అలాంటి సేవకుడు తన యజమానికి నమ్మక ద్రోహం చేస్తాడు. తమ స్వార్థం కోసం ప్రాణం తీయడానికి కూడా వెనుకాడరు. మీ ఉద్యోగుల విశ్వసనీయత, విధేయతను చెక్ చేసిన తర్వాత మాత్రమే వారిని నియమించుకోండి.
స్నేహితులతో
ప్రతి ఒక్కరి జీవితంలో స్నేహితులు ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. ఎందుకంటే మంచి స్నేహితులు ఉంటే జీవితంలో ఎలాంటి సమస్యనైనా అధిగమించవచ్చు. కష్ట సమయాల్లో మీకు అండగా నిలిచే వ్యక్తి నిజమైన స్నేహితుడు. నకిలీ స్నేహితుడు మిమ్మల్ని ఉపయోగించుకుంటాడు. మీ నమ్మకాన్ని మోసం చేస్తాడు. మిమ్మల్ని బాధపెట్టి, వెన్నుపోటు పొడిచేందుకు కుట్ర చేసే స్నేహితులకు దూరంగా ఉండమని చాణక్యుడు సలహా ఇస్తాడు.
పాములాంటి వ్యక్తి
పాము అనేది విషపూరితమైన, ప్రాణాంతకమైన జీవి. ఇది ఎప్పుడైనా కాటు వేస్తుంది. పాములు ఉన్న ప్రదేశంలో నివసించడం మరణాన్ని ఆహ్వానించినట్లే. పాముల విషయానికి వస్తే ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలని, అవి కనిపించే ప్రదేశాలకు దూరంగా ఉండాలని చాణక్యుడు హెచ్చరించాడు. పాములాంటి గుణం ఉన్నవారికి కూడా దూరంగా ఉండాలి.
నిజాయితిగే నటించేవారు
చాలా మంది తమ నిజ స్వరూపాన్ని ఇతరుల నుండి దాచుకునే సమాజంలో మనం జీవిస్తున్నారు. అలాంటి వ్యక్తులు ఇతరుల ముందు చాలా నిజాయితీగా వ్యవహరిస్తారు. కానీ అవకాశం దొరికినప్పుడు మీ గురించి చెడుగా మాట్లాడతారు. అలాంటి వారితో సన్నిహితంగా ఉండకూడదని చాణక్యుడు చెప్పాడు. రెండు భిన్నమైన వ్యక్తిత్వాలు ఉన్నవాళ్ళు చెత్తగా ఉంటారని చాణక్యుడు చెప్పాడు. అలాంటి వారు మీ ముందు తీయగా మాట్లాడతారు. మీ వెనుక మీ గురించి పుకార్లు వ్యాప్తి చేస్తారు. అలాంటి వారితో సహవాసం మానుకోండి అని చాణక్య నీతి చెబుతుంది.