Heart Health: మీరు ఎక్కువగా తినే ఈ రెండు ఆహారాలు గుండెజబ్బులను పెంచుతాయి, అవి మీ మెనూలోంచి తీసేయాల్సిందే-these two foods that you eat too much of increase the risk of heart disease and should be removed from your menu ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Heart Health: మీరు ఎక్కువగా తినే ఈ రెండు ఆహారాలు గుండెజబ్బులను పెంచుతాయి, అవి మీ మెనూలోంచి తీసేయాల్సిందే

Heart Health: మీరు ఎక్కువగా తినే ఈ రెండు ఆహారాలు గుండెజబ్బులను పెంచుతాయి, అవి మీ మెనూలోంచి తీసేయాల్సిందే

Haritha Chappa HT Telugu

Heart Health: ఒక కొత్త హార్వర్డ్ అధ్యయనం చెబుతున్న ప్రకారం రెండు రకాల ఆహార పదార్థాలు తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం పెరిగిపోతుంది. ఆ రెండు ఆహారాలను మీరు తరచుగా తినేవే. కాబట్టి జాగ్రత్తగా ఉండడం చాలా ముఖ్యం.

గుండె అనారోగ్యాన్ని పెంచే ఆహారాలు (Pixabay)

గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన రోజులు ఇవి. ఎంతో మంది యువత హఠాత్తుగా గుండెపోటు బారిన పడి మరణిస్తున్నారు. అందుకే ప్రతి ఒక్కరూ గుండె విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. హార్వర్డ్ అధ్యయనం చెబుతున్న ప్రకారం రెండు రకాల ఆహారాలను తినే వారికి గుండె పోటు వంటి సమస్యలు అధికంగా వస్తున్నట్టు తెలుస్తోంది.

ఈ రెండూ ప్రమాదం

చక్కెర నిండిన సోడాలు, కూల్ డ్రింకులు, ప్రాసెస్ చేసిన మాంసాలు తినడం వల్ల గుండె జబ్బుల బారిన పడే అవకాశం పెరిగిపోతోంది. అధిక చక్కెర ఉండే ఆహారం తినడం వల్ల గుండె, రక్త నాళాలలో దీర్ఘకాలిక ఇన్ ఫ్లమ్మేషన్‌కు దారితీస్తుంది. అలాగే ప్రాసెస్ చేసిన మాంసాహారం తరచూ తినడం వల్ల కూడా గుండె ఆరోగ్యం క్షీణిస్తుంది. ప్రాసెస్ చేసిన మాంసాహారంలో ఉప్పు అధికంగా ఉంటుంది. వీటితో పాటూ ధూమపానం చేయడం వల్ల కూడా అనేక సమస్యలు వస్తాయి.

హార్వర్డ్ టిహెచ్ చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిశోధకులు 200,000 మందికి పైగా వ్యక్తుల అల్ట్రా-ప్రాసెస్ చేసిన ఆహార పద్ధతులను ట్రాక్ చేశారు. వారికి గుండె జబ్బులు లేదా స్ట్రోక్ అభివృద్ధి చెందిందో లేదో తెలుసుకోవడానికి సుమారు మూడు దశాబ్దాల పాటు వారిని ట్రాక్ చేశారు. చక్కెర పానీయాలు, ప్రాసెస్ చేసిన మాంసాలు తినడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుందని కనుగొన్నారు.

అధ్యయనం నుండి వివరాలు

హార్వర్డ్ అధ్యయనం తాలూకు వివరాలు ది లాన్సెట్ జర్నల్‌లో ప్రచురించారు. అదనపు కేలరీలు, చక్కెర, సోడియం, అనారోగ్యకరమైన కొవ్వులను కలిగి ఉండే ఆహారాలు కొన్ని ఉన్నాయి. అవేమిటో తెలుసుకోండి.

  • శుద్ధి చేసిన పిండితో తయారుచేసిన బ్రెడ్‌లు.
  • సాస్‌లు, స్ప్రెడ్‌లు, మసాలా దినుసులు
  • ప్యాక్ చేసిన తీపి స్నాక్స్, డెజర్ట్‌లు
  • ప్యాక్ చేసిన స్నాక్స్
  • చక్కెర నిండిన తియ్యటి పానీయాలు
  • ప్రాసెస్ చేసిన ఎర్ర మాంసం, చికెన్, చేపలు
  • రెడీ టు ఈట్ పదార్థాలు
  • పెరుగు / పాల ఆధారిత డెజర్ట్‌లు
  • మద్యం
  • కూల్ డ్రింకులు

ఈ అధ్యయనంలో పాల్గొన్న వ్యక్తులు కొంతమంది అధికంగా బ్రెడ్, తీపి స్నాక్స్, డెజర్డులు, రెడీ-టు ఈట్ భోజనాలు అధికంగా తిన్నట్టు గుర్తించారు. ఇవన్నీ కూడా ప్రాసెస్ చేసిన ఆహారాల జాబితాలోకే వస్తాయి. వీటిని వల్లే గుండె జబ్బులు అధికంగా వస్తున్నాయి. తృణధాన్యాలతో చేసిన ఆహారాలు, పెరుగు / పాల ఆధారిత వంటకాలు తక్కువ గుండె జబ్బుల ప్రమాదంతో ముడిపడి ఉన్నట్టు తెలుస్తోంది.

వీటిని పూర్తిగా మానేయండి

శీతల పానీయాలు, ప్రాసెస్ చేసిన మాంసాలను పూర్తిగా మానేయాల్సిన అవసరం ఉంది. ఈ రెండే ప్రధానంగా యువత అధికంగా తింటోంది. ప్రతిరోజూ కూల్ డ్రింకులు తాగే వారు కూడా ఉన్నారు. ప్రాసెస్డ్ ఫుడ్ అంటే చీజ్, ప్యాక్ట్ ఫుడ్, క్యాన్డ్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, బేకరీ ఉత్పత్తులు, సోడా, స్పోర్ట్స్ డ్రింకులు, చిప్స్, కుకీలు, పిజా, బర్గర్, పాస్తా, ఐస్ క్రీములు, కేక్స్ వంటివి. అలాగే బయట దొరికే మాంసాహార వంటకాలను మానేయాలి.