Chanakya NIti On Destiny : ఈ విషయాలు ఎవరూ మార్చలేరు.. ఎప్పుడో నిర్ణయం అవుతాయి
Chanakya Niti In Telugu : జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలు ముందుగానే డిసైడ్ అయి ఉంటాయని చాణక్య నీతి చెబుతుంది. వాటిని ఎవరూ మార్చలేరు.
ఆచార్య చాణక్యుడు ప్రపంచంలోనే గొప్ప పండితుడు. మానవ జీవితానికి సంబంధించిన దాదాపు ప్రతి అంశం చాణక్యనీతి వివరిస్తుంది. తన జ్ఞానాన్ని, అనుభవాన్ని ఉపయోగించి చాణక్య నీతి చెప్పాడు. ఇందులో వర్తమానం, గతం, భవిష్యత్తు వరకు మూడు కాలాల గురించి కూడా మాట్లాడాడు. ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో మానవ జీవితాన్ని సంతోషపెట్టడానికి అనేక మార్గాలను పేర్కొన్నాడు.
చాణక్యుడు చెప్పిన ఐదు విషయాల గురించి మీరు తెలుసుకోవాలి. ఇవి ప్రతి వ్యక్తి విధిలో రాసి ఉంటాయి. ఈ 5 విషయాలు మీరు పుట్టకముందే మీ తల్లి కడుపులో నిర్ణయమవుతాయి. మీరు కోరుకున్నప్పటికీ మీరు ఈ విషయాలను మార్చలేరు.
వయసు నిర్ణయం అవుతుంది
చాణక్యుడు ప్రకారం, ఒక వ్యక్తి వయస్సు వారి తల్లి గర్భంలో నిర్ణయించబడుతుంది. ప్రతి వ్యక్తి భూమిపై ఎన్ని సంవత్సరాలు జీవించాలో అతని పూర్వ జన్మ కర్మ ద్వారా నిర్ణయం అవుతుంది. ఒక వ్యక్తి తన జీవితకాలంలో అతను కోరుకున్నప్పటికీ మార్చలేడు. ఏం చేసినా ఇది అస్సలు మారదు.
జ్ఞానం గురించి
ఆచార్య చాణక్యుడి ప్రకారం తన నీతి శాస్త్రంలో మానవ జీవితంలో బిడ్డ ఎంత జ్ఞానాన్ని పొందుతాడో తల్లి గర్భంలో నిర్ణయించబడుతుంది. అయితే దీనికోసం ప్రయత్నాలు చేయాలి. కేవలం కూర్చుని ఉంటే జ్ఞానం రాదు.
గత జన్మలో చేసిన పనులు
ఆచార్య చాణక్యుడు చెప్పేదేమిటంటే ఒక వ్యక్తి తన గత జన్మలో చెడు పనులు చేసినా, ఎవరికైనా హాని కలిగించినా, ఈ జన్మలో అతనికి కచ్చితంగా దాని ఫలితం చూస్తాడు. ఒక వ్యక్తి తన చెడు పనుల ఫలితాన్ని ఈ జన్మలో పొందుతాడు. మనిషి జీవితంలో ఎన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందో మాతృగర్భంలోనే నిర్ణయిస్తారని చాణక్యుడు చెప్పాడు.
డబ్బు సంపాదన
ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో ఒక వ్యక్తి తన జీవితంలో ఎంత డబ్బు సంపాదించాలో తల్లి గర్భంలో నిర్ణయించబడుతుంది. జీవితంలో ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని విధి రాసి ఉంటే కోరుకున్నా మార్చుకోలేం. ఏదో ఒకవిధంగా మీరు జీవితంలో ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు.
ఇలా చేయండి
జీవితంలో డబ్బును పొదుపు చేయాలని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. ధనం తెలివిగా ఖర్చు చేయాలి. డబ్బు బాగా ప్లాన్ చేసుకోవాలి. ఏమి, ఎప్పుడు, ఎంత డబ్బు ఖర్చు చేయాలో తెలుసుకోండి. ఇలా చేయడం వల్ల మనిషి ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు. ఎప్పటికీ డబ్బు సంబంధిత సమస్యలను ఎదుర్కోరు. అలాగే జీవితంలో ఇతరులకు అందించాలని ఆచార్య చాణక్యుడు చెప్పారు.
ఆచార్య చాణక్యుడు చాణక్య నీతిలో ఒక వ్యక్తి తన పనిని నిజాయితీగా చేయాలని చెప్పాడు. లక్ష్యం సరైన దిశలో ఉండాలి. తప్పుదారి పట్టకూడదు. ఒక వ్యక్తి తన బాధ్యతలను సకాలంలో నెరవేర్చాలి. ఇలా చేయడం వల్ల జీవితం ఆనందంగా ఉంటుంది. ఆచార్య చాణక్యుడు తన కర్తవ్యాన్ని నిర్వర్తించే వ్యక్తికి దేవుడు కూడా మద్దతునిస్తాడని చెప్పాడు.
ధర్మం కింద పనిచేసేవాడు సంతోషంగా ఉంటాడు. ప్రతికూల పరిస్థితుల్లోనూ పోరాడే సామర్థ్యాన్ని కూడా వారిలో పెంపొందిస్తుంది. ఆనందం, సమృద్ధి జీవితంలో నివసిస్తుంది. ప్రతి వ్యక్తి మోక్షాన్ని పొందాలని కోరుకుంటున్నాడని చాణక్య నీతిలో ఉంది. కానీ ప్రతి వ్యక్తి తన కర్మల ఆధారంగానే మోక్షాన్ని పొందుతాడు. మనిషి జీవితంలో ఎప్పుడూ మంచి పనులు చేయాలి.