Chanakya Niti Telugu : జీవితంలో ఈ విషయాలు ముందుగానే నిర్ణయమవుతాయి.. ఏం చేసినా మార్చలేరు-these things decided before birth according to chanakya niti ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Chanakya Niti Telugu : జీవితంలో ఈ విషయాలు ముందుగానే నిర్ణయమవుతాయి.. ఏం చేసినా మార్చలేరు

Chanakya Niti Telugu : జీవితంలో ఈ విషయాలు ముందుగానే నిర్ణయమవుతాయి.. ఏం చేసినా మార్చలేరు

Anand Sai HT Telugu
Apr 15, 2024 08:00 AM IST

Chanakya Niti In Telugu : జీవితంలో కొన్ని విషయాలు ముందుగానే నిర్ణయమవుతాయి. మనం చేసినా మార్చలేమని చాణక్య నీతి చెబుతుంది. ఆ విషయాల గురించి చూద్దాం..

చాణక్య నీతి
చాణక్య నీతి

చాణక్యుడు గొప్ప దౌత్యవేత్తగా చెబుతారు. చాణక్యుడు తన అనుభవాలన్నింటినీ చాణక్య నీతి రూపంలో చెప్పాడు. చాణక్య నీతి మానవ జీవితాన్ని ప్రభావితం చేసే అనేక ముఖ్యమైన విషయాలను చెబుతుంది. ఒక వ్యక్తి తన జీవితంలో ఎలా విజయం సాధించగలడో, సంతోషంగా జీవించగలడో చెబుతుంది.

yearly horoscope entry point

చాణక్యుడికి రాజకీయాల్లోనే కాకుండా వ్యూహం, యుద్ధం, ఆర్థికశాస్త్రం మొదలైన విషయాలలో కూడా అపారమైన జ్ఞానం ఉంది. చాణక్యుడి సూత్రాలు నేటి ఆధునిక కాలానికి సంబంధించినవి. దీనిని నేటికీ చాలా మంది అనుసరిస్తున్నారు. వాటిని అనుసరించి జీవితంలో విజయం సాధించినవారు చాలా మంది ఉన్నారు. ఇప్పటికీ చాణక్య నీతిని ఫాలో అయ్యేవారు ఉన్నారు.

చాణక్య నీతి యొక్క బోధనలను అనుసరించడం ద్వారా జీవితంలో అనేక సమస్యలను నివారించవచ్చు. సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు. చాలా సార్లు మనం కష్టపడి ప్రయత్నిస్తాం. కానీ కొన్నిసార్లు మనం ఆశించిన ఫలితాన్ని పొందలేం. మన అదృష్టం మన వైపు లేకపోవడమే ప్రధాన కారణం.

కొన్ని విషయాలు మన అదృష్టం వల్లనే జరుగుతాయి. చాణక్యుడు ప్రకారం కొన్ని విషయాలు పుట్టకముందే తల్లి కడుపులో నిర్ణయించబడతాయి. దీని ప్రకారం ఒక వ్యక్తి యొక్క విధి పుట్టుకకు ముందే ఉంటుంది. జీవితకాలంలో ఏమి, ఎంత పొందాలో ఇప్పటికే ఒక వ్యక్తి యొక్క విధిలో ఉంటుంది. చాణక్యుడు ప్రకారం ఒక వ్యక్తి పుట్టుకకు ముందు ఏమి నిర్ణయాలు జరుగుతాయో చూద్దాం..

చర్యలు ముందే రాసి ఉంటాయి

చాణక్యుడు ప్రకారం, ఒక వ్యక్తి చేసే ఏదైనా చర్య, దాని పర్యవసానాలు ముందుగా నిర్ణయించబడతాయి. అతని జీవితంలో ప్రతి చర్య ఇప్పటికే రాసి ఉంటుంది. కోరుకున్నప్పటికీ దానిని మార్చలేడు. చాణక్యుడు ప్రకారం ఒక వ్యక్తి చేసే ఏదైనా చర్య, దాని పర్యవసానాలు ముందుగానే నిర్ణయమవుతాయి. అతని జీవితంలో ప్రతి చర్య ఇప్పటికే రాసి ఉంటుంది. కోరుకున్నప్పటికీ దానిని మార్చలేడు.

సంపద నిర్ణయం అవుతుంది

మనిషి తన జీవితకాలంలో ఎంత సంపదను కలిగి ఉంటాడో కూడా ముందే నిర్ణయం జరుగుతుంది. ఎవరైనా ఎంత ప్రయత్నించినా, ఒక వ్యక్తి తన విధి ప్రకారం మాత్రమే పొందుతాడు. మీరు ఎంత కోరుకున్నా అంతకు మించి పొందలేరు. అందుకే సంపదన గురించి మీరు దిగులు పడాల్సిన అవసరం లేదు.

జ్ఞానం కూడా అంతే

ఒక వ్యక్తి జ్ఞానం కూడా వారి పుట్టుకకు ముందే నిర్ణయమవుతుంది. ఎంత డబ్బు ఖర్చు పెట్టినా జ్ఞానం రాదు. జ్ఞానం అనేది సంపదలాంటిది. ఇది కష్టపడితే వస్తుంది. అందుకే కచ్చితంగా ప్రతి ఒక్కరూ కష్టపడాలి. వ్యక్తి విధిలో రాసినంత మాత్రమే జ్ఞానాన్ని పొందగలమని చాణక్యుడు చెప్పాడు. ప్రతీ ఒక్కరూ జ్ఞానాన్ని సంపాదించేందుకు ముందుగు నడవాలి. కొందరు అవకాశం ఉన్న జ్ఞానాన్ని సంపాదించేందుకు ప్రయత్నం చేయరు.

మరణం డిసైడ్ అయి ఉంటుంది

మరణం ఎవరూ కాదనలేని వాస్తవం. మరణం అనేది మానవ జీవితంలో అత్యంత కష్టమైన వాస్తవం. ఇది ఆగిపోదు లేదా నివారించబడదు. వస్తే తప్పించుకునే ప్రసక్తే లేదు అంటాడు చాణక్యుడు. ఒకరి చావు పుట్టుకకు ముందే రాసి ఉంటుంది. అందుకే చావు గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ఎదుర్కోవాలి. చాణక్య నీతిలో చెప్పిన విషయాలు మనిషి జీవితంలో ముందే నిర్ణయం అయి ఉంటాయి.

Whats_app_banner