Sugar Risk : ఈ లక్షణాలు కనిపిస్తే.. మీరు తీపి ఎక్కువ తింటున్నారని అర్థం-these symptoms are visible in the body that you are eating too much sugar ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  These Symptoms Are Visible In The Body That You Are Eating Too Much Sugar

Sugar Risk : ఈ లక్షణాలు కనిపిస్తే.. మీరు తీపి ఎక్కువ తింటున్నారని అర్థం

HT Telugu Desk HT Telugu
Mar 18, 2023 12:30 PM IST

Sugar Risk : తీపి పదార్థాలు ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి హానికరం. స్వీట్లు అంటే ఇష్టం ఉండేవారు.. కూడా ఎక్కువగా తినకూడదు.

తీపి
తీపి (unsplash)

కొంతమంది స్వీట్లు అధికంగా తింటారు. జామూన్, జిలేబీ, మైసూర్ పాక్, చాక్లెట్, పాయసం మొదలైన వాటిలో ఏదైనా ఒకటి ఇష్టంగా తినేస్తారు. అయితే.. ఈ తీపి(Sweet) పదార్థాలు తక్కువ పరిమాణంలో తీసుకుంటే శరీరంపై పెద్దగా ప్రభావం చూపదు. కానీ మీరు వాటిని ఇష్టం వచ్చినట్టుగా తీసుకుంటే అనేక వ్యాధులు(disease) మిమ్మల్ని పట్టుకుంటాయి. తీపి పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల మీ ఆరోగ్యంపై అనేక దుష్ప్రభావాలు ఏర్పడతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మీరు తీపి పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం ప్రారంభించినప్పుడు సమస్య తలెత్తుతుంది. మనం రోజుకు 30 గ్రాముల చక్కెర(Sugar) కంటే ఎక్కువ తినకూడదని బ్రిటన్ నేషనల్ హెల్త్ సర్వీస్ చెబుతోంది. కొన్ని లక్షణాలు కనిపిస్తే.. మీరు చాలా షుగర్ తింటున్నారని అర్థం

మీకు ఆకలి విపరీతంగా పెరిగితే, మీరు వెంటనే అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఇది చక్కెరను ఎక్కువగా తీసుకోవడం వల్ల కావచ్చు. మీరు స్వీట్లు ఎక్కువగా తింటే, శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే, మీరు వెంటనే తీపి ఆహారాలకు దూరంగా ఉండాలి. కొన్నిసార్లు మీరు చక్కెరను ఎక్కువగా తీసుకుంటే మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ సమస్య ఇతర కారణాల వల్ల కూడా కావచ్చు.

మూడ్ స్వింగ్స్(mood swings).. ఇది అధిక చక్కెర వినియోగానికి కూడా సంకేతం కావచ్చు. స్పష్టమైన కారణం లేకుండా మూడ్ స్వింగ్స్ సంభవిస్తే, వెంటనే చక్కెర తీసుకోవడం తగ్గించండి. ఎందుకంటే చక్కెర నిజానికి మన మూడ్‌లో మార్పులను కలిగిస్తుంది. చక్కెర మీ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచడానికి కారణమవుతుంది. అధిక చక్కెర తీసుకోవడం హార్మోన్ స్థాయిలను ప్రభావితం చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. ఇది మూడ్ స్వింగ్స్‌కు దారి తీస్తుంది.

శక్తి లేకపోవడం.. ఈ లక్షణం మీరు చక్కెరను ఎక్కువగా తీసుకుంటున్నారా లేదా అని చెప్పగలదని పోషకాహార నిపుణులు అంటున్నారు. మీరు ఎనర్జీ లెవల్స్‌(Energy Levels)లో తగ్గుదలని ఎదుర్కొంటుంటే, అది చాలా స్వీట్ ఐటమ్స్ తీసుకోవడం వల్ల కావచ్చు. నిజానికి, అధిక చక్కెర మన శక్తి స్థాయిలను ప్రభావితం చేస్తుంది.

దంత సమస్యలు.. ఎక్కువ చక్కెర తీసుకోవడం వల్ల దంత క్షయం, నోటి దుర్వాసన వస్తుంది. అంతే కాదు వాటి రంగు కూడా మారుతుంది. మీరు మీ దంతాలతో ఈ సమస్యలను ఎదుర్కొంటుంటే, వెంటనే చక్కెర తీసుకోవడం పరిమితం చేయండి. దంతాల ఎనామెల్ క్షీణించి, కావిటీలకు కారణమవుతుంది.

ఎక్కువ చక్కెర తినడం వల్ల మీ పేగు ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది. ఎందుకంటే చక్కెర తరచుగా ఉబ్బరం కలిగిస్తుంది. అంతేకాదు పొట్టలో ఉండే మంచి బ్యాక్టీరియాను కూడా నాశనం చేస్తుంది.

WhatsApp channel