Cooking Mistakes: వంట చేసేటప్పుడు మీరు చేసే ఈ చిన్న చిన్న పొరపాట్లు రుచితో పాటు పోషకాలను కూడా నాశనం చేస్తాయి!-these small mistakes you make while cooking destroy both the taste and the nutrients of vegetables ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Cooking Mistakes: వంట చేసేటప్పుడు మీరు చేసే ఈ చిన్న చిన్న పొరపాట్లు రుచితో పాటు పోషకాలను కూడా నాశనం చేస్తాయి!

Cooking Mistakes: వంట చేసేటప్పుడు మీరు చేసే ఈ చిన్న చిన్న పొరపాట్లు రుచితో పాటు పోషకాలను కూడా నాశనం చేస్తాయి!

Ramya Sri Marka HT Telugu
Jan 06, 2025 12:30 PM IST

Cooking Mistakes: మన రోజూవారీ ఆహార పదార్థాలతో కూరగయాలు చాలా ముఖ్యమైనవి. వీటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే కూరగాయలను కత్తిరించేటప్పుడు, వంట చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే అవి రుచితో పాటు పోషకాలను కూడా కోల్పోతాయట. ఆ పొరపాట్లేంటో తెలుసుకుందాం.

వంట చేసేటప్పుడు మీరు చేసే ఈ చిన్న చిన్న పొరపాట్లు రుచితో పాటు పోషకాలను కూడా నాశనం చేస్తాయి!
వంట చేసేటప్పుడు మీరు చేసే ఈ చిన్న చిన్న పొరపాట్లు రుచితో పాటు పోషకాలను కూడా నాశనం చేస్తాయి! (Shutterstock)

కూరగాయలు మన ఆహారంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఉదయం బ్రేక్ ఫాస్ట్ అయినా, మధ్యాహ్న భోజనం అయినా, రాత్రి తినే డిన్నర్ అయినా కూరగాయలు లేనివి సంపూర్ణం కావు. దోస, రోటీ, రైస్‌ దేంట్లొకైనా కూర ఉండాల్సిందే. కూరగయాలు ఆహారం రుచిని పెంచడంతో పాటు పోషకాలు సమృద్ధిగా కలిగి ఉంటాయి. ఎన్నో లాభాలున్న కూరగయాలను వంటేటప్పుడు సరైన పద్ధతి, నియమాలను పాటించకపోతే ఇవి రుచితో పాటు పోషకాలను కూడా కోల్పోతాయాట.

yearly horoscope entry point

వంట చేయడంలో ప్రతి ఒక్కరికీ ఒక పద్ధతి ఉంటుంది. చాలా మంది కూరగాయలను కత్తిరించేటప్పుడు, వండేటప్పుడు తరచుగా చేసే కొన్ని పొరపాట్లు ఉన్నాయి. ఇవి కూరగాయల రుచితో పాడు చేయడంతో పాటు వాటిలోని పోషకాలను కూడా నాశనం చేస్తాయి. ఆ పొరపాట్లు ఏంటో, పరైన పద్ధతులు ఏంటో ఓ లుక్కేద్దాం పదండి.

కూరగాయలను కడిగి, కత్తిరించేటప్పుడు చేసే పొరపాట్లు:

1. చల్లని నీరు వాడటం:

కూరగాయలను చల్లని నీటిలో కడిగినప్పుడూ అన్ని రసాయన అవశేషాలు , మురికి పూర్తిగా పోవు. కనుక కూరగాయలను ఎప్పుడూ గోరువెచ్చటి నీటితో కడగడం మంచిది.

2. కట్ చేసిన తర్వాత కడగడం:

కూరగాయలను కట్ చేసిన తర్వాత వాటిని కడగడం పెద్ద పొరపాటు. కట్ చేసిన తర్వాత కూరగాయలు నీటిని పీల్చుకుని పోషకాలను కోల్పోవచ్చు. కూరగాయలను ముందుగా పూర్తిగా కడిగి, తరువాత కట్ చేయడం ఉత్తమం.

3. అతిగా నీటిలో ముంచడం:

కూరగాయలను చాలా సమయం నీటిలో ముంచితే వాటి నుండి జలానుపయోగ పోషకాలు పోతాయి, ముఖ్యంగా విటమిన్ C.కనుక నీటిలో వేసిన వెంటనే కత్తిరించండి.

4. సరిగ్గా కడగకపోవడం:

  • క్యారెట్లు, బంగాళాదుంపలు, బీట్‌రూట్ వంటి కూరగాయలు మట్టి పట్టుకుని ఉంటాయి. వాటిని చక్కగా రుద్ది కడగపోతే మట్టి అలాగే ఉంటుంది.

5. నీటితో మాత్రమే కడగడం:

కూరగాయలను కడిగేటప్పుడు కేవలం నీటిని మాత్రమే ఉపయోగించితే సరిపోదు.నీటిలో కాస్త ఉప్పు లేదా పసుపు వంటివి వేయడం వల్ల వాటిపై ఉండే రసాయనాలు, బ్యాక్టీరియా వంటివి పూర్తిగా తొలగిపోతాయి.

6. కడిగిన తర్వాత ఆరబెట్టకపోవడం:

కడిగిన తర్వాత కూరగాయలను కాసేపు ఆరబెట్టడం అవసరం.నీరు కూరగాయల మీద ఉండడం వల్ల అవి త్వరగా పాడైపోతాయి, పోషకాలను కోల్పోతాయి.

8. అన్నింటినీ కలిపి కడగడం:

పచ్చి ఆకు కూరగాయలు ఉదాహరణకు పాలకూర, పచ్చిమిర్చీ, కొత్తిమీర, ఉల్లిపాయలు అన్నింటినీ ఒకే దాంట్లో వేసి కడగటం మంచిది కాదు. ఇలా చేయడం వల్ల ఒకదాని మీది మురికి, బ్యాక్టీరియా మరొక దానిమీదకు చేరతాయి. వీటన్నింటినీ వేరు వేరుగా కడిగి కత్తిరించడం మంచిది.

ఈ పొరపాట్లను దృష్టిలో ఉంచుకుంటే, మీ కూరగాయలు రుచి , పోషక విలువను ఎక్కువగా కాపాడుకోవచ్చు!

కూరగాయాలను వండేటప్పుడు చేసే కొన్ని సాధారణ పొరపాట్లు:

1. ఎక్కువ సేపు ఉడికించడం:

కూరగాయలను ఎక్కువ సేపు ఉడికించడం వల్లవాటి లోపల ఉన్న పోషకాలు ఎక్కువగా పోతాయి. ఎక్కువ మంట మీద ఎక్కువ సేపు ఉడికించడం వల్ల రుచితో పాటు పోషకాలు కూడా తగ్గిపోతాయి.

2. అధిక ఉప్పు వాడటం:

కూరగాయలలో ఉన్న రుచి , పోషకాలను కాపాడుకోవడానికి చిన్న మొత్తంలో ఉప్పు వాడటం మంచిది. అధిక ఉప్పు వాడటం వల్ల వంట రుచి కుదుర్చుకోవడమే కాకుండా, ఆరోగ్యానికి హానికరమైనది.

3. ఎక్కువ నూనె వాడటం:

కూరగాయలను ఎక్కువ ఆయిల్‌తో వండడం వల్ల కేవలం కేలరీలు పెరిగిపోతాయి, పోషకాలు తగ్గిపోతాయి. తక్కువ నూనెతో తింటేనే ఆరోగ్యానికి మంచిది.

4. కూరగాయలను ఎక్కువగా మిక్స్ చేయడం:

చాలామంది చేసే పొరపాటు ఏంటంటే.. వంట చేసేటప్పుడు కూరని ఎక్కువ సార్లు కలుపుతూనే ఉంటారు. ఇలా చేయడం వల్ల కూరగాయలు విరిగిపోయి రుచిని కోల్పోవడంతో పాటు వాటిలోని పోషకాలన్నీ నాశనం అయిపోతాయి.

5. నీటిని అధికంగా వాడటం:

కూరగాయలను ఎక్కువ నీటిలో వండటం వల్ల వాటి పోషకాలు నీటిలో లవించిపోతాయి. తక్కువ నీటిలో వండటే రుచికీ పోషకాలకు మంచిది.

6. కట్ చేసినే వెంటనే వండకపోవడం:

కూరగాయలను కట్ చేసిన తర్వాత వాటిని వెంటనే వండకపోతే, వాటి పోషకాలు తగ్గిపోతాయి. కట్ చేసిన తర్వాత ఎక్కువ సమయం ఉంచకూడదు.

7. ఎక్కువ వేడి చేయడం:

కొన్ని రూట్ కూరగాయలను (ఉదా: ఆలుగడ్డ) ఎక్కువ వేడి చేసి వండడం వల్ల అవి నిగితి, కడుపుకు కష్టం కలిగించేలా మారవచ్చు.

8. మళ్లీ మళ్లీ వండటం:

కొన్నిసార్లు కూరగాయలను సగం వేడి చేసుకుని వదిలేసి తర్వాత మళ్లీ తిరిగి వడుతారు. ఇలా చేయడం వల్ల వాటి పోషకాలు తగ్గిపోతాయి. రుచి కోల్పోతుంది.

Whats_app_banner