మీలో ఇలాంటి ప్రవర్తన ఉంటే.. లేట్ చేయకుండా శృంగారం చేసేయండి!-these signs you need to have intercourse as soon as possible ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  మీలో ఇలాంటి ప్రవర్తన ఉంటే.. లేట్ చేయకుండా శృంగారం చేసేయండి!

మీలో ఇలాంటి ప్రవర్తన ఉంటే.. లేట్ చేయకుండా శృంగారం చేసేయండి!

HT Telugu Desk HT Telugu
Updated Oct 01, 2024 12:15 PM IST

శృంగారం అనేది మనిషి తప్పకుండా కావాల్సిన అవసరం. ఎన్నిసార్లు చేసినా కొత్తగా అనిపించేది శృంగారం. మళ్లీ మళ్లీ కొత్త పద్ధతుల్లో శృంగారాన్ని కోరుకుంటారు. అయితే కొన్నిసార్లు మీ ప్రవర్తన మీకు శృంగారం కావాలని చెబుతుంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ఒక వ్యక్తి శరీరానికి ఏదైనా అవసరం అయినప్పుడు దాని లక్షణాలు వ్యక్తమవుతాయి. ఉదాహరణకు శరీరంలో నీరు, శక్తి లేనప్పుడు ఆ లోపం దాహం, బలహీనత ద్వారా వ్యక్తమవుతుంది. ఇలా ప్రతీ విషయానికి సంబంధించిన విషయం మనలో మార్పులను చూపిస్తుంది. శృంగారం విషయంలోనూ ఇదే జరుగుతుంది. మన శరీరానికి శృంగారం కావాలనుకున్నప్పుడు పరిస్థితులు మారిపోతాయి.

ప్రతీ మానవ శరీరానికి శారీరక సంభోగం.. అదే లైంగికత చాలా ముఖ్యమైనది. ఇది లోపించినప్పుడు శరీరం దీనికి కూడా కొన్ని లక్షణాలను చూపుతుంది. ఆ లక్షణాలు ఏంటో తెలుసుకుందాం..

ఒక వ్యక్తి తన మాటలతో ఎక్కువగా చిరాకు పడినప్పుడు, ఎవరితోనైనా సరిగ్గా మాట్లాడకూడదనుకుంటే ఆ వ్యక్తి తన భాగస్వామితో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉండాలని కోరుకుంటున్నట్లు సూచిస్తుంది. ఈ సందర్భంలో ఈ సన్నిహిత సంబంధం మీ ఒంటరితనాన్ని తొలగిస్తుంది. మళ్లీ మంచి జీవితాన్ని గడపడానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది. ఈ సమయంలో శృంగారం చేస్తే మానసికంగా హాయిగా ఫీలవుతారు.

ఏదైనా ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడు శృంగారం బొమ్మల ఆలోచన మీ మదిలోకి వస్తే, మీరు శృంగారం జీవితంలోకి ప్రవేశించాలనుకుంటున్నారని అర్థం. ఆ సమయంలో మీ లైంగిక జీవితాన్ని శృంగారభరితంగా చేయాలనుకుంటారు. భాగస్వామికి కాల్ చేసి.. రొమాంటిక్‍గా మాట్లాడుతారు.

కొంతమందికి రోజురోజుకు లైంగిక కలల స్థాయి పెరుగుతుంది. పడుకున్నాక కొందరికి స్వప్న స్ఖలనం జరుగుతుంది. మీరు నిరంతరం శృంగారం గురించి ఆలోచిస్తే.. మీకు శృంగారం అవసరమని అర్థం. వాస్తవానికి కలలు మన మనస్సులోని దాగి ఉన్న కోరికలను వెల్లడిస్తాయి. ఆ అవసరం నెరవేరడం లేదని సూచిస్తాయి.

చాలా కాలం పాటు కొంతమంది గ్రూప్‍తో ఉన్నప్పుడు అందులో ఒకరితో సాన్నిహిత్యం పెరిగితే.. వారి మీద మీకు కోరికలు పెరుగుతాయి. బయటకు చెప్పరు. కానీ వారి చుట్టే తిరుగుతారు. ఆ వ్యక్తితో సమయం గడపడానికి సాకు కోసం వెతుకుతారు. అది సన్నిహిత సంబంధాన్ని సూచిస్తుంది. వారితో శృంగారం చేయాలనే కోరిక కూడా కలగొచ్చు.

Whats_app_banner