Success: ఈ సంస్కృత శ్లోకాలు మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తాయి, మీలో నిరాశ నిండినప్పుడు వీటిని చదువుకోండి
Success: ప్రతి ఒక్కరూ జీవితంలో విజయం సాధించాలని కోరుకుంటారు. మిమ్మల్ని విజయం వైపు ప్రేరేపించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. మీలో నిరాశ నిండినప్పుడు సంస్కృత శ్లోకాలు సహాయపడతాయి. ఆ శ్లోకాలను ఇక్కడ ఇచ్చాము.
ప్రతి ఒక్కరూ జీవితంలో విజయం సాధించాలని కోరుకుంటారు. ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి సాధించాలని, విజయ శిఖరాన్ని చేరుకోవాలని, డబ్బు సంపాదించాలని కోరుకుంటారు. విజయం సాధించాలంటే మంచి ఆరోగ్యంతో ప్రశాంతమైన జీవితం అవసరం. శరీరం, మనస్సు ఆరోగ్యంగా ఉన్నప్పుడు సాధనకు మార్గం కూడా సులభం అవుతుంది. యోగా, ధ్యానం మనసు ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. హిందూ గ్రంధాల ప్రకారం మనిషి తన లక్ష్యాన్ని సాధించడానికి, విజయాన్ని సాధించడానికి కొన్ని ప్రేరణ మార్గాలు ఉన్నాయి. విజయాన్ని సాధించే ప్రేరేపించే సంస్కృత శ్లోకాల పఠనం మీ శరీరంలో, మనసులో నైతిక బలాన్ని నింపుతుంది.

ఈ సంస్కృత శ్లోకాలు ఎంతో అర్థవంతమైనవి. జీవితంలో విజయం సాధించడానికి, అనుకున్న లక్ష్యాలను సాధించడానికి మిమ్మల్ని ప్రేరేపించే శ్లోకాలు ఉన్నాయి. అలాంటి స్ఫూర్తిదాయక సంస్కృత శ్లోకాలు మీకోసం.
- వివేకాఖ్యాతిరవిప్లవ హనోపాయః ।
భావము: సత్యానికి, అవాస్తవానికి మధ్య భేదాన్ని అర్థం చేసుకోవాలి. జీవితంలో ఈ రెండు ఎంతో ముఖ్యపాత్ర పోషిస్తాయి.
2. సంధివిగ్రహయోస్తుల్యాయాం వృద్ధౌ సంధిముపేయాత్ ।
భావము: శాంతికి లేదా యుద్ధానికి సమాన ప్రయోజనం ఉంటే రాజు అనే వ్యక్తి శాంతిని మాత్రమే ఎంచుకోవాలి. అప్పుడే ప్రపంచం, మీరు ప్రశాంతంగా ఉంటుంది.
3. సర్వం పరవశం దుఃఖం సర్వమాత్మవశం సుఖం
ఏతద్ విద్యాత్ సమాసేన లక్షణం సుఖదుఃఖయోః.
భావము: ఇతరుల ఆధీనంలో ఉన్నవన్నీ బాధాకరమైనవే. స్వీయ నియంత్రణలో ఉన్నవన్నీ సంతోషాన్నే అందిస్తాయి. సుఖదుఃఖాల గురించి చెప్పే సంక్షిప్త నిర్వచనం ఇది. ఏదైనా మీ ఆధీనంలోనే ఉండాలని చెప్పడమే ఈ శ్లోకం అర్థం. మీ అలవాట్లు, పద్ధతులు, మనసు మీ ఆధీనంలోనే ఉంటే విజయం సులువవుతుంది
4. అప్రప్యామ్ నామా నేహస్తి ధీరాస్య వ్యావసాయినాహ్ ।
భావము: కష్టపడి, ధైర్యంగా పనిచేసేవాడు సాధించలేనిది ఏదీ లేదు. అంటే ప్రతి ఒక్కరూ జీవితంలో విజయం సాధించేందుక కష్టపడి పనిచేయాలి. రిస్క్ చేసేందుకు సిద్ధంగా ఉండాలి.
5. సింహావత్సర్వవేగనే పాతత్యార్తే కిలార్తినాహ్ ।
భావము: పనిని పూర్తి చేయాలనుకునేవాడు సింహంలాంటి వేగంతో పనిచేస్తాడు. నత్తనడకన పనులు చేస్తే ఎలాంటి ఫలితం ఉండదు. కాబట్టి మెరుపు వేగంతో పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలి.
6. అనారంభస్తు కార్యాణాం ప్రథమం బుద్ధిలక్షణమ్ ।
ఆరబ్ధస్యంతగమనం ద్వితీయం బుద్ధిలక్షణమ్ ।
భావము: పనిని ప్రారంభించకడమనేది తెలివితేటలకు మొదటి సంకేతం. ఒకసారి మొదలు పెట్టాక పూర్తిచేయడం జ్ఞానానికి రెండవ లక్షణం. ఏదైనా పనిని ప్రారంభిస్తేనే విజయం సాధించగలరు. కానీ కొంతమందా ఆ పనిని ప్రారంభించరు కూడా.
7. కల్పయతి యేన వృత్తిం యేన చ లోకే ప్రశస్యతే సద్భిః.
స గుణస్తేన చ గుణినా రక్షణః సంవర్ధనీయశ్చ॥
అర్థం: మీ నైపుణ్యాలు మీ జీవనోపాధిని నిలబెట్టేవిధంగా ఉండాలి. అందరిచేత ప్రశంసలు పొందాలి. మీ స్వంత అభివృద్ధిని ప్రోత్సహించాలి.