Chanakya Niti : ఈ ఐదు రకాల వ్యక్తులు ఎవరి బాధనూ అర్థం చేసుకోరు-these people never understand others emotions according to chanakya niti ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Chanakya Niti : ఈ ఐదు రకాల వ్యక్తులు ఎవరి బాధనూ అర్థం చేసుకోరు

Chanakya Niti : ఈ ఐదు రకాల వ్యక్తులు ఎవరి బాధనూ అర్థం చేసుకోరు

Anand Sai HT Telugu Published Mar 30, 2024 08:00 AM IST
Anand Sai HT Telugu
Published Mar 30, 2024 08:00 AM IST

Chanakya Niti In Telugu : కొంతమంది వ్యక్తులు ఇతరుల భావాలను అస్సలు అర్థం చేసుకోరని చాణక్య నీతి చెబుతుంది. ఎదుటివారికి ఏమైనా పట్టించుకోరు.

చాణక్య నీతి
చాణక్య నీతి

ఆచార్య చాణక్యుడు తన జీవితకాల జ్ఞానాన్ని, అనుభవాన్ని చాణక్య నీతి ద్వారా చెప్పాడు. చాణక్యుడి సూత్రాలు మానవ జీవితంలోని ప్రతి ముఖ్యమైన అంశానికి ఉపయోగపడతాయి. జీవితంలోని కొన్ని రంగాలలో ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అని సూచించాడు. మనం నిత్య జీవితంలో ఈ సూత్రాలను సక్రమంగా పాటిస్తే అనేక సమస్యలను దూరం చేసుకోవచ్చు. మిమ్మల్ని ఎవరూ మోసం చేయకుండా బతకవచ్చు.

చాణక్యుడి నియమాలను ఇప్పటికీ పాటించేవారు చాలా మంది ఉన్నారు. ఆయన చెప్పిన జీవిత సత్యాలతో ఎంతో ఉపయోగం ఉంది. వాటిని పాటిస్తే మీరు సమస్యల నుంచి బయటపడవచ్చు. చాణక్య నీతి శాస్త్రంలో కొంత మంది వ్యక్తులను ఎప్పుడూ దూరం ఉంచాలని ప్రస్తావిస్తుంది. ఎందుకంటే వారు ఎవరి బాధను అర్థం చేసుకోలేరు. ఎదుటివారు ఏమైనా పెద్దగా పట్టించుకోరు. వారి గురించి వారికి మాత్రమే ఉంటుంది.

చాణక్యుడు ప్రకారం, డ్రగ్స్ బానిసల నుండి ఎల్లప్పుడూ దూరంగా ఉండాలి. ఎందుకంటే అలాంటి వారు ఎప్పుడూ డబ్బు వసూలు చేయడంలో నిమగ్నమై ఉంటారు. డబ్బు కోసం దొంగతనాలు, దోపిడీలు, హత్యలు వంటి నేరాలకు వెనుకాడరు. మత్తు వారికి అత్యంత ప్రాధాన్యత. అలాంటి వారితో కలిస్తే మీరు వారిలా మారవచ్చు, లేదంటే వారి తప్పుకు మీరు మూల్యం చెల్లించుకోవాల్సి రావచ్చు. మీ జీవితంలోనూ వారు ఏదో ఒక సమస్యను తీసుకువచ్చే అవకాశం ఉంది.

స్వార్థపరుడు తన గురించి మాత్రమే ఆలోచిస్తాడు. అలాంటి వారికి ఇతరుల బాధలు ఎప్పుడూ అర్థం కావు. కాబట్టి అలాంటి వారికి ఎప్పుడూ దూరంగా ఉండటమే మంచిది. వారు తమ స్వార్థ పనులకోసం ఎదుటివారిని ఏమైనా చేయగలరు. ఇతరుల గురించి అస్సలు పట్టించుకోరు. వారు పైకి వెళ్లేందుకు మీ కాళ్లను పట్టుకుని కిందకు లాగేస్తారని చాణక్య నీతి చెబుతుంది.

దొంగతనం చేయాలనే ఉద్దేశ్యం ఉన్న వ్యక్తుల నుండి దూరంగా ఉండటానికి ప్రయత్నించాలి. ఒక దొంగ ఎవరి బాధను అర్థం చేసుకోడు. ఈ దొంగతనం తర్వాత ఎవరికి ఎంత నష్టం వాటిల్లుతుందో వారికి అర్థం కావడం లేదు. మీ ఇంట్లో ఏది తీసుకెళ్తాడో తెలియదు. అంతేకాదు.. ఏదో ఒక చిన్న దొంగతనం చేస్తేనే వారికి తృప్తి ఉంటుంది.

చాణక్య సూత్రాల ప్రకారం, రాజులు, అధికారులు సాధారణ ప్రజల బాధలను, భావాలను అర్థం చేసుకోరు. వారు ఎల్లప్పుడూ నియమాలు, సాక్ష్యాల ఆధారంగా ఏదైనా నిర్ణయం తీసుకుంటారు. అయితే కొన్నిసార్లు బాధితులకు న్యాయం దక్కకపోవచ్చు. ఇది చాలా చెడ్డ పని. అందుకే చాలా కఠినంగా ఉంటారు.

ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు లోకాన్ని విడిచి వెళ్ళాలి. ఇది ప్రపంచ నియమం. ఎవరైనా చనిపోయే సమయం వచ్చినప్పుడు, యమరాజు ఎవరినీ విడిచిపెట్టడు. అతనికి ఎవరి బాధలు, భావాలు అర్థం కాదు. ఆయన వచ్చిన పని చేసుకుని వెళ్లిపోతాడు. ఎవరి బాధతో ఆయనకు పని లేదు అని చాణక్య నీతి చెబుతుంది. చాణక్యుడు చెప్పిన సూత్రాలు జీవితానికి ఎంతో ఉపయోగపడతాయి. వాటిని పాటిస్తే జీవితంలో ముందుకు వెళ్లవచ్చు.

Whats_app_banner