Eternal Beauty | నిత్యయవ్వనంగా కనిపించాలంటే.. ఈ చిట్కాలు ఫాలో అయిపోండి..-these natural tips are very useful to get eternal beauty ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  These Natural Tips Are Very Useful To Get Eternal Beauty

Eternal Beauty | నిత్యయవ్వనంగా కనిపించాలంటే.. ఈ చిట్కాలు ఫాలో అయిపోండి..

HT Telugu Desk HT Telugu
May 24, 2022 10:17 AM IST

వయసు మీద పడుతున్న కొద్ది చర్మం వాడిపోతూ ఉంటుంది. కొందరు మాత్రం ఎంత వయసు వచ్చినా.. చిన్నవారిలాగానే కనిపిస్తారు. వారిలో ముఖ్యంగా సెలబ్రెటీలు. వారికంటే బ్యూటీ ట్రీట్​మెంట్స్, బ్యూటీ ఉత్పత్తులు వాడుతారు అనుకుంటారు. కానీ కొన్ని చిట్కాలు పాటిస్తే.. మీరు కూడా నిత్య యవ్వనంగా ఉండొచ్చు.

నిత్యయవ్వనంగా ఉండాలంటే..
నిత్యయవ్వనంగా ఉండాలంటే..

Eternal Beauty | సెలబ్రిటీలు తమ లుక్​ చెక్కుచెదరకుండా.. నిత్యయవ్వనంగా ఉండేలా తమ చర్మాన్ని కాపాడుకుంటారు. ఖరీదైన బ్యూటీ ట్రీట్‌మెంట్స్​ వల్లే వారు వయసైనా అందంగా కనిపిస్తున్నారని అనుకుంటే పొరపాటే. వాస్తవానికి చర్మం మీద వృద్ధాప్య ఛాయలు రాకుండా కాపాడుకోవడం అంత కష్టమేమి కాదు. కేవలం కొన్ని చిట్కాలను అనుసరిస్తే చాలు.. మీరు కూడా వృద్ధాప్య ఛాయలు కనిపించకుండా చర్మాన్ని కాపాడుకోవచ్చు. కానీ వీటిని ప్రతిరోజూ తప్పక పాటించాలి. అప్పుడే దీర్ఘకాలిక ప్రయోజనాలు పొందగలరు.

తగినంత నీరు

ప్రతిరోజూ తగినంత నీరు తాగండి. కచ్చితంగా మీరు రోజుకు ఎంత నీరు తీసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకోవడానికి మీ వైద్యుడిని సంప్రదించండి.

తగినంత నిద్ర

అన్నింటికన్నా.. ముందు చెప్పుకోవాల్సింది ఇదే. తగినంత నిద్ర మనిషికి చాలా అవసరం. రాత్రులు కనీసం 8 గంటలు నిద్రపోవాలి. పాడైపోయిన కణాలు నిద్రలో బాగుపడతాయి. కనుక ఇది చాలా అవసరం

సన్‌స్క్రీన్

ఎండ ఉన్నప్పుడే కాదు.. మేఘావృతమైన రోజు కూడా సన్​స్క్రీన్ వాడాలి. పగటిపూట మీరు 5 నిముషాలు బయటకు వెళ్లినా.. తప్పకుండా సన్‌స్క్రీన్‌ని ఉపయోగించండి. సూర్యుని అతినీలలోహిత కిరణాలు చర్మానికి ఊహించలేని హానిని కలిగిస్తాయి. కాబట్టి దీనిని వాడటం అత్యంత అవసరం.

సమతుల్య ఆహారం

భోజనం మానేయకండి. అలాగే అదనపు నూనె, మసాలా ఆహారాలు తీసుకోవద్దు. సమతుల్య ఆహారాన్ని తీసుకోండి. సరైన మొత్తంలో ప్రోటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్లు, కొవ్వు సమతుల్యతను కలిగి ఉండాలి. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఎక్కువ తీసుకోండి.

రెగ్యులర్ వ్యాయామం

వ్యాయామం మన కండరాలను బలపరుస్తుంది. దీంతో చర్మం బిగుతుగా మారుతుంది. అందంగా కూడా కనిపిస్తుంది. అంతేకాదు రక్తప్రసరణ కూడా సాఫీగా జరుగుతుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేసే వ్యక్తులు యవ్వనంగా కనిపిస్తారు.

ప్రశాంతంగా ఉండండి

ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎన్ని ఇబ్బందులు ఉన్నా.. ఎంత ఒత్తిడి ఉన్నా.. మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి ప్రయత్నించండి. ఆ సమయంలో నవ్వుతూ, తమాషా చేస్తూ కాలాన్ని గడపండి.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్