Summer Foods | వేసవిలో ఇవి తినండి.. చల్లగా ఉండండి..-these natural foods keep you feel fresh and hydrated in hot summer ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  These Natural Foods Keep You Feel Fresh And Hydrated In Hot Summer

Summer Foods | వేసవిలో ఇవి తినండి.. చల్లగా ఉండండి..

HT Telugu Desk HT Telugu
Apr 29, 2022 02:15 PM IST

పొరపాటున బయటకు వెళ్లిన అమ్మో ఏంటి ఎండ ఇంత ఉంది అనిపిస్తుంది. ఏదో పగబట్టినట్లే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఈ సమయంలో హైడ్రేటెడ్​గా రిఫ్రెష్​గా ఉండడం చాలా ముఖ్యం. అయితే సమ్మర్​ వేడిని తగ్గించుకునేందుకు కొన్ని పదార్థాలు తినాలంటున్నారు నిపుణులు. అవేంటి ఎందుకు వాటిని తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.

సమ్మర్ ఫుడ్స్
సమ్మర్ ఫుడ్స్

Best Food in Summer | వేసవి వేడిని తట్టుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. అయితే వేడిని తగ్గించుకోవడానికి ఇన్​ టేక్​ కూడా ముఖ్యమంటున్నారు డైటీషియన్స్. అందుకే మీ రెగ్యులర్ డైట్‌లో అధిక-నీటితో సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాలను చేర్చుకోవాలంటున్నారు. ఈ వేసవిలో హైడ్రేటెడ్, రిఫ్రెష్‌గా ఉండడానికి కొన్ని అద్భుతమైన మార్గాలను సూచిస్తున్నారు. అవేంటో మీరు చూసేయండి. తినేయండి.

1. పుచ్చకాయ

సీజనల్ పండ్లు మన శరీరానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పుచ్చకాయ. ఇది మిమ్మల్ని హైడ్రేటెడ్​గా, రిఫ్రెష్​గా ఉంచుతాయి. వేసవిలో లభించే దీనిలో విటమిన్ ఎ, సి, బి విటమిన్లు, అలాగే పొటాషియం, శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు లైకోపీన్, బీటా-కెరోటిన్ పుష్కలంగా కలిగి ఉంటుంది. యాంటీఆక్సిడెంట్లు కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి. క్యాన్సర్ నివారణలో కూడా ఇవి ముడిపడి ఉంటాయి. ఇవి మీ హృదయానికి కూడా చాలా మంచివి. ధమనుల రద్దీని నివారించడంలో ఇవి మీకు సహాయపడతాయి.

2. టొమాటో

టొమాటోలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరం నుంచి హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడంలో సహాయపడతాయి. టొమాటోలలో పొటాషియం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో రక్తపోటును నియంత్రించడంలో తోడ్పడుతుంది. టొమాటోలు విటమిన్ బి, విటమిన్ ఇ, హృదయాల సముచిత పనితీరుకు అవసరమైన ఇతర కీలకమైన పోషకాలను అందిస్తాయి.

3. పెరుగు

వేసవిలో మరో మంచి ఆహారం పెరుగు. ఇది తేలికైన, అత్యంత సమర్థవంతమైన ఇంధనం. ఇది మిమ్మల్ని హైడ్రేట్‌గా ఉంచే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అలాగే మీ స్టామినాను కూడా పెంచుతుంది. చిటికెడు ఉప్పు లేదా పంచదార కలిపి పెరుగు తీసుకుంటే.. మీ శరీరం మరింత సమతుల్యంగా, శక్తివంతంగా ఉంటుంది. ఇది ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది.

4. కీరదోస

కీరదోస 95% నీటితో తయారవుతాయి. కాబట్టి అవి మిమ్మల్ని చాలా హైడ్రేటింగ్‌గా ఉంచుతాయి. ఇది మీ శరీరం నుంచి విషపదార్థాలను తొలగిస్తాయి. లోపలి నుంచి ఆరోగ్యంగా ఉండటానికి సహాయం చేస్తుంది. కీరదోసకాయ వ్యర్థాలను తొలగించడంలో సహాయపడే శక్తివంతమైన సిస్టమ్ ప్యూరిఫైయర్. ఇవి అధిక ఫైబర్, తక్కువ కేలరీలు కలిగి ఉంటుంది. బరువు తగ్గాలనుకునే ప్రతి ఒక్కరికీ ఇది అద్భుతమైన ఆహారం. అధిక పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్ కంటెంట్ ఉన్న కారణంగా దోసకాయ రక్తపోటును అదుపులో ఉంచుతుంది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్