ఆల్కహాల్ తక్కువగా ఉండే పానీయాలు లేదా ఆల్కహాల్ పూర్తిగా లేని పానీయాలు ఆరోగ్యానికి ఎలాంటి హాని చేయవన్నది ఎంతోమంది అభిప్రాయం. కానీ అధ్యయనాలు మాత్రం ఆల్కహాలు లేని లేదా తక్కువ ఆల్కహాల్ పానీయాలు కూడా ఎన్నో రకాల ప్రమాదాలతో ముడిపడి ఉంటాయని చెబుతున్నాయి.
ఆల్కహాల్ తక్కువగా ఉన్న పానీయాలు తాగడం వల్ల మద్యం తాగే అలవాటు పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే వాటిని తాగడం కూడా మంచిది కాదని వైద్యులు చెబుతూ ఉంటారు. గుండె ఆరోగ్యం, మధుమేహం వంటి సమస్యలు కూడా వీటితో ఆధారపడి ఉంటాయి. తక్కువ మొత్తంలో ఆల్కహాల్ ఉన్న పానీయాలు వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో కూడా తెలుసుకోండి.
ఆల్కహాల్ తాగడం వల్ల ఎన్ని రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయో ఆల్కహాల్ లేని పానీయాలు లేదా తక్కువ ఆల్కహాల్ ఉన్న పానీయాలు తాగడం వల్ల కూడా అంతే ప్రమాదం ఉంది.
ఎంత తక్కువ మోతాదులో ఆల్కహాల్ తీసుకుంటున్నప్పటికీ కూడా ఆల్కహాల్ యూజ్ డిసార్డర్ వంటివి వచ్చే అవకాశం ఉంది. తక్కువ స్థాయిలో ఆల్కహాల్ తీసుకోవడం వల్ల రొమ్ము క్యాన్సర్, కొలొరెక్టల్ క్యాన్సర్, కాలేయ క్యాన్సర్ తో సహా ఎన్నో రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
ఎంత మోతాదులో మీరు ఆల్కహాల్ తీసుకున్నా కూడా అది ఆరోగ్యానికి ప్రమాదకరంగానే ఉంటుంది. ముఖ్యంగా కాలేయంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న ప్రకారం మద్యం రోజుకు ఒక స్పూను తీసుకున్నా కూడా ప్రమాదకరమే. కాబట్టి ఆల్కహాల్ పానీయాలను వదిలేయడమే అవసరం.
కొన్ని ఆల్కహాల్ లేని పానీయాలలో కూడా మన శరీరానికి హాని చేసే రసాయనాలు చాలా ఉంటాయి. తక్కువ ఆల్కహాల్ ఉన్న పానీయాలు తాగడం వల్ల శారీరక ప్రతిస్పందనలు అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఆల్కహాల్ తాగాలన్న కోరికలు కూడా విపరీతంగా పెరిగిపోతాయి.
ఆల్కహాల్ లేని డ్రింకుల్లో చక్కెర అధికంగా ఉంటుంది. అలాంటి పానీయాలు తాగడం వల్ల బరువు పెరిగే సమస్య అధికంగా ఉంటుంది. అలాగే ఆల్కహాల్ తక్కువగా ఉండే పానీయాలలో కూడా కాలేయంపై ఒత్తిడిని పెంచే పదార్థాలు అధికంగా ఉంటాయి. ఇలాంటివి కూడా కాలేయ వ్యాధులకు కారణం అవుతాయి. ఆల్కహాల్ లేని పానీయం కదా అని అధికంగా తీసుకుంటే సమస్యలు వస్తాయి. ఆల్కహాల్ లేని డ్రింకులైనా, ఆల్కహాల్ తక్కువగా ఉన్న పానీయాలైన మితంగా తీసుకోవడం ఉత్తమం. లేదా పూర్తిగా మానేయడమే మంచిది. వాటి వల్ల కూడా ఎన్నో రకాల వ్యాధులు వస్తూ ఉంటాయి.
మార్కెట్లో ఆల్కహాల్ లేని బీర్లు దొరుకుతున్నాయి. వాటిని తాగడం మంచిదని ఎంతో మంది భావిస్తూ ఉంటారు. నిజానికి అలాంటి బీర్లు తాగితే ఆల్కహాల్ యూజ్ డిజార్డర్ వస్తుంది. దీని బారిన పడితే జీవితాంతం ఇబ్బంది పడతారు. ఆల్కహాల్ తాగాలన్న కోరికను ఇవి పెంచేస్తాయి.
కొన్ని బీర్లపై ఆల్కహాల్ లేదు అనే లేబుల్ పెడతారు. కానీ ఎంతో కొంత ఆల్కహాల్ ఉండే అవకాశం ఉంటుంది. ఒక అధ్యయనంలో ఆల్కహాల్ లేని డ్రింకును పరీక్షించారు. అందులో 29 శాతం కంటే ఎక్కువ ఆల్కహాల్ స్థాయిలు ఉన్నట్టు తేలింది.
ఇలాంటి బీర్లను ఎట్టి పరిస్థితుల్లో తాగడం మంచిది కాదు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఆల్కహాల్ లేని పానీయాలను కూడా తాగకూడదు. అలా తాగితే గర్భస్థ శిశువుకు ప్రమాదం ఏర్పడుతుంది. ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి వీలైనంతవరకు ఆల్కహాల్ ఉన్నా, ఆల్కహాల్ లేకపోయినా కూడా బీర్ వంటి పానీయాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
సంబంధిత కథనం