Healthy Eating | మీ కిచెన్ నుంచి ఇవి తీసేయండి.. ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు-these food items remove from your kitchen for health sake ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  These Food Items Remove From Your Kitchen For Health Sake

Healthy Eating | మీ కిచెన్ నుంచి ఇవి తీసేయండి.. ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు

Geddam Vijaya Madhuri HT Telugu
Mar 24, 2022 09:24 AM IST

ఏది పడితే అది నమ్మి కొన్ని ఆహార పదార్థాలను మీ వంటగదిలో చేర్చవద్దు అంటున్నారు నిపుణులు. ఎందుకంటే అవి మీకు తెలియకుండానే మీ ఆరోగ్యానికి హాని చేస్తాయని హెచ్చరిస్తున్నారు. మనం ఆరోగ్యానికి మంచిది అని నమ్మే కొన్ని పదార్థాలు ఎందుకు వాడకూడదో.. అసలు ఏ పదార్థాలు వాడకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

హెల్తీ ఫుడ్
హెల్తీ ఫుడ్

మీ కిచెన్ షెల్ఫ్‌లు, ఫ్రిజ్ తప్పనిసరిగా మీరు ఇష్టపడే వస్తువులతోనే నిండి ఉంటాయి. వీటిలో కొన్ని మీ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.. మరికొన్ని మంచి కంటే ఎక్కువ హాని చేస్తాయి. మీరు తక్కువ కేలరీల ఆహారాలు, డైట్ సోడాలు, బ్రౌన్ బ్రెడ్, కూరగాయలు, పండ్లు వంటివాటిని ఎక్కువగా వాడొచ్చు. కానీ ఆరోగ్యకరమైన జీవితాన్ని కోసం మీ వంటగది నుంచి ఆరోగ్యానికి హాని చేసే కొన్ని పదార్థాలను తొలగించడం చాలా ముఖ్యమని డైటీషియన్ విధి చావ్లా తెలిపారు. అవి ఏంటంటే...

1. బ్రౌన్ బ్రెడ్

మైదాలోని హానికరమైన ప్రభావాల గురించి ఈ మధ్యకాలంలో ప్రజలలో మరింత అవగాహన పెరిగింది. దీనికి ప్రత్యామ్నాయంగా 'బ్రౌన్ బ్రెడ్' ఎంచుకుంటున్నారు. పైగా బ్రౌన్ బ్రెడ్ ఆరోగ్యానికి మంచిదని భావిస్తున్నారు. కానీ మార్కెట్లో దొరిక్ బ్రౌన్ బ్రెడ్ ఆరోగ్యానికి మంచిది కాదు అంటున్నారు నిపుణులు. “బ్రౌన్ బ్రెడ్ గోధుమతో తయారు చేస్తారు. కానీ మనం బయట కొనే ప్యాకెట్లలోని బ్రెడ్ కేవలం బ్రౌన్ సింథటిక్ కలరింగ్‌తో మాత్రమే వస్తుంది'' అని చావ్లా స్పష్టం చేశారు. 

2. క్యాన్డ్ ఫుడ్ ఐటమ్స్

క్యాన్లో ఉంచిన మాంసం లేదా చేపలు లేదా కూరగాయాలు మీ శరీరానికి అస్సలు మంచిది కాదు. స్టోర్ చేసుకోవచ్చు కాబట్టి ఇది మనకు మంచిగా అనిపిస్తుంది కానీ.. ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదంటున్నారు చావ్లా. వీటని నిల్వచేయడానికి ఉపయోగించే రసాయనాలు శరీరానికి హానికరమని వెల్లడించారు. ఇవి అత్యంత విషపూరితమైనవిగా మారే అవకాశం ఉంది. కాబట్టి కొంత సమయం కేటాయించి తాజా పండ్లు, కూరగాయలు, మాంసాన్ని మాత్రమే ఎంచుకోవాలని సూచిస్తున్నారు.

3. యోగర్ట్ (పెరుగు)

పెరుగు సాధారణంగా బరువు తగ్గడానికి ఉపయోగిస్తారు. దీనిని ఇంట్లో తయారు చేస్తారు. కానీ "యోగర్ట్ ప్రాసెస్ చేసేసమయంలో కృత్రిమ రుచులు జోడిస్తారు. రుచి, చూసేందుకు ఆకర్షించడానికి దీనిలో రసాయనాలు, స్వీటెనర్లు కలుపుతారు" అని చావ్లా వెల్లడించారు.

4. ప్రాసెస్ చేయబడిన స్ప్రెడ్‌లు

మీ చాక్లెట్ స్ప్రెడ్‌లు కావచ్చు లేదా సాల్టీ శాండ్‌విచ్ స్ప్రెడ్‌లు కావచ్చు ఇవి మీకు అందుబాటులో ఉంచుకోవద్దని సూచించారు. కొనుగోలు చేసిన రెండు రోజుల్లోనే వాటిని మనం సగం ఖాళీ చేసేస్తాం. దీనిలో ఉండే తీపి పదార్థాలు ఆరోగ్యానికి ఆరోగ్యకరమైనవి కావు.

5. న్యూట్రిషన్ బార్లు

గ్రానోలా బార్‌లు, న్యూట్రిషన్ బార్‌లు ఆరోగ్యానికి మంచివని భావించి.. వాటిని ఎక్కువ మంది కొనుగోలు చేస్తారు. కానీ "అవి చక్కెరలు, కృత్రిమ స్వీటెనర్లతో తయారు చేస్తారని" అని చావ్లా వెల్లడించారు. ఒకవేళ పోషకాల బార్‌లను భర్తీ చేసే చాక్లెట్‌లు, క్యాండీల కోసం కూడా మీరు వెతికే అవకాశం ఉంది. కానీ సొంతంగా ఇంట్లో తయారు చేసుకునే చాక్లెట్స్, బార్‌లు ఉత్తమమంటున్నారు చావ్లా.

WhatsApp channel