శ్రీమద్భగవద్గీత హిందువుల పవిత్ర గ్రంధాల్లో ఒకటి. ఈ గ్రంధాన్ని దైవ సమానంగా చూసుకుంటారు. శతాబ్దాలుగా శ్రీమద్భగవద్గీత ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందిస్తూ మనస్సులోని ఆందోళనలను తొలగించడం ద్వారా లక్ష్యాన్ని సాధించే ఆత్మవిశ్వాసాన్ని ప్రజలకు ఇస్తోంది. మహాభారత యుద్ధం ప్రారంభానికి ముందు శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇచ్చిన ఉపన్యాసమే శ్రీమద్భగవద్గీతగా మారి ప్రసిద్ధి చెందింది. భగవద్గీతలో 18 అధ్యాయాలు, 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిని చదవడం ద్వారా వ్యక్తిలో ఆత్మవిశ్వాసం పెరిగి, ఆ వ్యక్తి ధైర్యంగా, నిర్భయంగా తన కర్తవ్యాలను నిర్వర్తిస్తాడు. తన లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నం చేయడం ప్రారంభిస్తాడు. మీరు కూడా జీవితంలో ఏదైనా ఆందోళనలతో కలత చెంది, మీ లక్ష్యానికి దూరమవుతున్నట్లు భావిస్తే, గీతలోని ఈ అయిదు బోధనలు చదవండి. కోల్పోయిన మీ ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందండి. తద్వారా విజయం సాధించే మార్గాన్ని తెలుసుకోండి.
భగవద్గీత చెబుతున్న ప్రకారం వ్యక్తి జయాపజయాలు అధికంగా అతని మనస్సుపై ఆధారపడి ఉంటాయి. మనసును జయించిన వ్యక్తి విజయాన్ని సాధించడం సులువు అవుతుంది. కాబట్టి మీ మనసును నియంత్రణలో ఉంచుకోండి. కచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తారు.
శ్రీమద్భగవద్గీత ప్రకారం, ఒక వ్యక్తి విజయాన్ని సాధించడానికి ఫలితాన్ని ఆశించకుండా కేవలం తన పనిపై మాత్రమే దృష్టి పెట్టాలి. నిరంతరం సాధన చేసే వ్యక్తి ఆత్మవిశ్వాసం సమయంతో పాతూ పెరుగుతుంది, ఇది విజయానికి చేరువ చేస్తుంది. ఫలితాల గురించి ఆందోళన చెందకుండా పనిచేయడం వ్యక్తికి చాలా ముఖ్యం. ఇది వారి మనస్సును కూడా ఇబ్బంది పెట్టదు. ఆందోళనలకు గురిచేయదు. వ్యక్తి మనసు ఎల్లప్పుడూ పని పైనే కేంద్రీకృతమై ఉండాలి. ఇది అతని లక్ష్యంపై మరింత దృష్టి పెట్టడానికి సహాయపడుతుంది.
శ్రీమద్భగవద్గీత ప్రకారం, ఒక వ్యక్తి తన పనిని అంచనా వేస్తూ ఉండాలి. ఎందుకంటే ఒక వ్యక్తి ఇతరుల కన్నా తనను తానే బాగా అర్థం చేసుకోగలడు. ఎవరి లోటుపాట్లను గుర్తించి వాటిని మెరుగుపరుచుకోండి. ఇది విజయానికి మార్గాన్ని నిర్ణయించడంలో మీకు సహాయపడుతుంది.
కృష్ణుడు అర్జునుడికి యోధుడిగా తన కర్తవ్యంపై దృష్టి పెట్టమని గుర్తు చేశాడు. అదేవిధంగా, మన జీవితంలో సవాళ్లను ఎదుర్కొన్నప్పుడు కూడా మన లక్ష్యాలకు అంకితం కావాలి. ఏకాగ్రతతో ఉండటం ద్వారా అడ్డంకులను అధిగమించి విజయం సాధించవచ్చు.
మహాభారత యుద్ధంలో అర్జునుని మనసులో కర్తవ్యానికి, నైతికతకు మధ్య సంఘర్షణ జరిగింది. సాధారణ జీవితంలో కూడా, ఒక వ్యక్తి తరచుగా ఇలాంటి సందిగ్ధతలను ఎదుర్కోవలసి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో అర్జునుడిలా ఒక వ్యక్తి తన విలువలకు కట్టుబడి, సరైనది చేయడం ద్వారా నిజాయితీకి, ఆత్మగౌరవానికి పునాది వేయగలడు.
భగవద్గీతలో చెప్పే ప్రతిది సాధారణ మనుషుల జీవితానికి మేలు చేసేదే. కాబట్టి ఆ శ్లోకాలను అర్ధం చేసుకుని మసలు కోవడం చాలా అవసరం.
సంబంధిత కథనం