Brain Problems : మనం రోజూ చేసే ఈ పనులతో మెదడుపై తీవ్ర ప్రభావం
Brain Damage : మనం రోజు పాటించే అలవాట్లు మన మెదడు మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి. వివిధ రకాల సమస్యలు వస్తాయి. అవేంటో తెలుసుకోండి.
మెదడు అనేది మన జ్ఞాపకాలను, భావాలను, ఆలోచనలను నియంత్రించే ఒక అద్భుత అవయవం. ఇది మానవ శరీరంలో అత్యంత ముఖ్యమైనది. మన దైనందిన జీవితాన్ని గడిపేటప్పుడు తెలియకుండానే ఈ విలువైన అవయవాన్ని ప్రమాదంలో పడేస్తున్నాం. మెదడుకు అనుకోకుండా హాని కలిగించే, దానిని రక్షించడానికి మార్గాలను అందించే సాధారణ విషయాలను తెలుసుకుందాం..
సాంకేతికత కారణంగా మన జీవనశైలి మారిపోయింది. దీంతో అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. చాలా మంది కంప్యూటర్ల ముందు గంటలు గంటలు కూర్చొంటున్నారు. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల మెదడుకు రక్త ప్రసరణ తగ్గుతుందని ఒక అధ్యయనం సూచిస్తుంది.
జ్ఞాపకశక్తి ఉండేందుకు వ్యాయామం కూడా ముఖ్యమైన విషయమే. వ్యాయామం శరీరానికి, అభిజ్ఞా ఆరోగ్యానికి కూడా ముఖ్యమైనది. మీరు కనీసం 150 నిమిషాల శారీరక శ్రమతో కూడిన వారపు షెడ్యూల్‌ను ఫాలో అవ్వాలి.
మన బిజీ లైఫ్‌లో నిద్ర విలువను మనం తరచుగా మరిచిపోతున్నాం. నిద్ర లేకపోవడం అభిజ్ఞా సామర్థ్యాలను ప్రభావితం చేస్తుంది. దీంతో జ్ఞాపకశక్తి, తార్కికం, సమస్య పరిష్కార నైపుణ్యాలు ప్రభావితమవుతాయని పరిశోధనలు చెబుతున్నాయి. పడుకునే గంట ముందు ఆల్కహాల్ తీసుకోవద్దు. కెఫిన్‌ను నివారించడం, బ్లూ లైట్ తగ్గించడం మెదడను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇవన్నీ రాత్రిపూట మెదడు పునరుద్ధరణ, మరమ్మత్తుకు హామీ ఇవ్వడానికి రక్షణ అడ్డంకులుగా పనిచేస్తాయి.
మనం జీవించే విధానాన్ని ప్రభావితం చేసే డిజిటల్ స్క్రీన్‌లు మన చుట్టూ ఉన్నాయి. ఎక్కువ స్క్రీన్ సమయం మన సిర్కాడియన్ రిథమ్‌ల సమతుల్యతను కోల్పోతుంది. ఇది మానసిక కల్లోలం, అలసట, నిద్రలేమికి కారణమవుతుంది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ పిల్లలలో స్క్రీన్ టైమ్‌ని పొడిగించడం వల్ల ఆలోచన, భాషా పరీక్ష ఫలితాలు సరిగా ఉండవు అని హెచ్చరించింది. మీ రోజువారీ స్క్రీన్ సమయాన్ని తగ్గించుకోండి. నిద్రించడానికి ఒక గంట ముందు స్క్రీన్ రహిత జోన్ క్రియేట్ చేసుకోవాలి.
నీరు మెదడులో ముఖ్యమైన భాగం. కానీ మన దైనందిన కార్యక్రమాలలో ఇది తరచుగా మరిచిపోతాం. డీహైడ్రేషన్ కూడా మెదడను ప్రభావితం చేస్తుంది. తల తిరుగుతుంది. ముఖ్యంగా శారీరక శ్రమకు ముందు, తర్వాత మీ మెదడు కోసం సరిగా నీటిని తాగాలి.
అల్పాహారం మెదడుకు రోజుకు అవసరమైన ముఖ్యమైన శక్తిని ఇస్తుంది. అల్పాహారం దాటవేయడం ఆరోగ్యం మీద ప్రభావితం పడుతుంది. ఇది మానసిక ఆరోగ్యంతో ముడిపడి ఉంటుంది. ఫైబర్, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులతో కూడిన సమతుల్య అల్పాహారాన్ని ఎంచుకోవడం ద్వారా మీ మెదడును ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
సంగీతం మనకు సంతోషాన్ని కలిగించినప్పటికీ.. దీని ద్వారా కూడా మెదడు మీద ప్రభావం పడుతుంది. ఎక్కువ శబ్ధంతో సంగీతం వినకూడదు. ఇది మెదడు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. మెదడు నిర్మాణం, పనితీరుపై ప్రభావం చూపుతుంది. శబ్దంతో వినికిడి శక్తి కూడా పోతుంది. సంగీతాన్ని ఎక్కువ శబ్ధంతో వినడం, హెడ్‌ఫోన్‌లు ధరించడం తగ్గించుకోవాలి.
చక్కెర, ఉప్పు, కొవ్వు, ప్రాసెస్ చేసిన ఆహారాలు ఎక్కువగా తినడం వల్ల అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ఆరోగ్యకరమైన మెదడుకు మద్దతు ఇవ్వడానికి రెడ్ మీట్, డైరీ, ఆల్కహాల్ తక్కువగా ఉండేలా డైట్ మెయింటెన్ చేయాలి. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, గింజలు, చేపలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని ఎంచుకోండి.
టాపిక్