Diabetes: రాత్రి మాత్రమే కనిపించే డయాబెటిస్ సంకేతాలు ఇవి, నిర్లక్ష్యం చేయకండి-these are the signs of diabetes that appear only in the morning and at night dont ignore them ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Diabetes: రాత్రి మాత్రమే కనిపించే డయాబెటిస్ సంకేతాలు ఇవి, నిర్లక్ష్యం చేయకండి

Diabetes: రాత్రి మాత్రమే కనిపించే డయాబెటిస్ సంకేతాలు ఇవి, నిర్లక్ష్యం చేయకండి

Haritha Chappa HT Telugu
Nov 14, 2024 04:30 PM IST

Diabetes: ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని నవంబర్ 14న నిర్వహించుకుంటారు. డయాబెటిస్ గురించి ప్రజలకు అవగాహన కల్పించడమే దీని ఉద్దేశం. శరీరంలో కనిపించే డయాబెటిస్ లక్షణాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.

రాత్రిపూట కనిపించే డయాబెటిస్ లక్షణాలు
రాత్రిపూట కనిపించే డయాబెటిస్ లక్షణాలు (pixabay)

డయాబెటిస్ సైలెంట్ కిల్లర్. శరీరంలో నిశ్శబ్ధంగా చేరి చెడు ప్రభావాన్ని చూపడం ప్రారంభిస్తుంది. ప్రతి అయిదు మందిలో ఒకరికి ప్రస్తుతం డయాబెటిస్ ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే ప్రతి సంవత్సరం నవంబర్ 14న ప్రపంచ మధుమేహ దినోత్సవం నిర్వహించుకుంటా. తద్వారా మధుమేహంపై ప్రజల్లో అవగాహన పెంచవచ్చు. శరీరంలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తే డయాబెటిస్ ఉన్నట్టో, ఏ సంకేతాలను నిర్లక్ష్యం చేయకూడదో తెలుసుకోండి.

మధుమేహంలో రెండు రకాలు ఉన్నాయి. ప్యాంక్రియాస్ లో ఇన్సులిన్ తగినంత మొత్తంలో ఉత్పత్తి కాకపోతే వచ్చే టైప్ 1 డయాబెటిస్. ఇది పిల్లల్లో కనిపిస్తుంది. ఇక శరీరంలో ఉత్పత్తి అయిన ఇన్సులిన్ ను వాడుకోలేక వచ్చే టైప్ 2 డయాబెటిస్. ఇది వయసు పెరిగాక వస్తుంది. ఈ రెండు రకాల డయాబెటిస్ వ్యాధుల్లోనూ రక్తంలో గ్లూకోజ్ పరిమాణం పెరుగుతుంది. దీనివల్ల శరీరంలో కొన్ని రకాల లక్షణాలు కనిపించడం ప్రారంభమవుతాయి.

రాత్రిపూట కనిపించే డయాబెటిస్ లక్షణాలు

చాలాసార్లు, 45-50 సంవత్సరాలకు చేరుకున్న మహిళలు, పురుషులు తరచుగా మూత్రవిసర్జనతో సమస్యలను ప్రారంభిస్తారు. ఇది వయస్సును బట్టి వారు సాధారణమైనదిగా భావిస్తారు. మహిళలైతూ మెనోపాజ్ లక్షణంగా భావిస్తారు. కానీ తరచుగా మూత్రవిసర్జన వెళ్లడం అందులోనూ ముఖ్యంగా రాత్రిపూట నాలుగైదు సార్లు మూత్ర విసర్జన చేయడం రక్తంలో గ్లూకోజ్ పరిమాణం పెరిగిందనడానికి సంకేతం. దీన్ని మీరు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకండి.

పొడి నోరు

వేసవిలో నోరు పొడిబారడం సహజమే కానీ చలికాలం, వానాకాలంలో కూడా నోరు పొడిగా అనిపిస్తుంది. పదేపదే దాహం వేస్తుంది. వ్యక్తులు దీన్ని పెద్దగా పట్టించుకోరు. కానీ వాతావరణం చల్లగా ఉన్నా కూడా నోరు పొడి బారడం, నీరు తాగినా దాహం తీరకపోవడం లక్షణాలు రాత్రి పూట ఎక్కువగా ఉంటే మీకు మధుమేహం ఉందేమో చెక్ చేసుకోవాలి. శరీరం తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి చేయకపోవడం లేదని దీనర్ధం. ఇన్సులిన్ తయారు కాకపోవడం టైప్ 1 డయాబెటిస్ కు సంకేతం.

పొడి చర్మం

రక్తంలో గ్లూకోజ్ పరిమాణం పెరిగినప్పుడు చర్మం చాలా పొడిగా మారుతుంది. ముఖ్యంగా పాదాల పగుళ్లు, పొడి చర్మం, నల్లని మచ్చలు వస్తాయి. ఇవన్నీ కూడా మధుమేహం లక్షణాలే. కానీ వీటిని వాతావరణం చల్లగా మారడం వల్ల కలిగాయని అనుకుంటారు. దీని వల్లే డయాబెటిస్ ముదిరిపోయాకే ఎక్కువమందిలో బయటపడుతుంది.

పురుషులు, మహిళల్లో డయాబెటిస్ లక్షణాలు దాదాపు సమానంగా ఉన్నప్పటికీ, మహిళలకు ఈస్ట్ ఇన్ఫెక్షన్లు, మూత్ర ఇన్ఫెక్షన్లు, అండాశయ ఇన్ఫెక్షన్లు పదేపదే రావడం ప్రారంభమవుతాయి.

చర్మం నలుపుదనం

ముఖం రంగు పేలవంగా మారడం, చంకలో నల్లని మచ్చలు ఏర్పడటం లేదా కాళ్లు, నడుము, మెడలో నలుపు కనిపించడం మధుమేహానికి సంకేతం. ఈ విషయాలు ఎంతో మందికి తెలియవు. చిన్న గాయం తగిలినా కూడా అది నయం కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఇలా మీకు జరిగితే నిర్లక్ష్యం చేయకుండా డయాబెటిస్ ఉందేమో తెలుసుకోండి.

మహిళల మాదిరిగానే, పురుషులలో డయాబెటిస్ లక్షణం కండరాల నష్టం. డయాబెటిస్ ఉన్న పురుషుల శరీరంలో వేగంగా కండరాల నష్టం ఉంటుంది. వారు త్వరగా సన్నబడతారు. కాబట్టి ఇంట్లోనే తగినంత నడక, వ్యాయామాలు చేయడమే కాకుండా బరువును అదుపులో ఉంచుకోవాలి.

Whats_app_banner