మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. వారితో పోటీ పడుతున్నారు. కొన్నిసార్లు వారిపై విజయాలు కూడా సాధిస్తున్నారు. అయితే కొన్ని నమ్మకాలు, ఆచారాలు మాత్రం ఇంకా మహిళలను అనుమతించని ప్రదేశాలు కొన్ని ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆ ప్రదేశాలను గురించి తెలుసుకుందాం.
అమెరికాలోని మేరీల్యాండ్ లో బర్నింగ్ రీ క్లబ్ ఉంది. ఇది ఒక గోల్ఫ్ క్లబ్. ఇది కేవలం పురుషులకు మాత్రమే. మహిళలకు నో ఎంట్రీ. ఇక్కడ ప్రతి అమెరికా అధ్యక్షుడు, ప్రధాన న్యాయమూర్తికి సభ్యత్వం ఇస్తారు. అయితే ఇప్పటివరకు ఏ మహిళా కూడా ఈ క్లబ్ లోకి ప్రవేశించలేదు. పూర్తిగా ఇది పురుషాతిపత్య క్లబ్. దీని సంప్రదాయాలు కూడా పురుషులకు అనుకూలంగానే ఉంటాయి.
గ్రీస్‌లోని మౌంట్ అత్తోస్ అనే కొండ ప్రాంతం ఉంది. 1000 సంవత్సరాలుగా ఈ ప్రాంతానికి ఒక్క మహిళ కూడా వెళ్లలేదు. మహిళల ప్రవేశాన్ని నిషేధించిన ప్రదేశం ఇది. ఇక్కడ ఎన్నో ఆర్థోడాక్స్ చర్చిలు ఉంటాయి. అలాగే 100 మంది దాకా ఆర్థోడాక్స్ పురుషులు. 10 మంది నాన్ ఆర్థోడాక్స్ పురుషులు ఉంటారు. వాళ్లకి మాత్రమే ఇందులోకి ప్రవేశం ఉంటుంది. ఇది ఒక పురాతన సాంప్రదాయం ప్రకారం నడిచే చర్చలు. ఆథోస్ పర్వతం పైకి మహిళల ప్రవేశం పూర్తిగా నిషిద్ధం.
కేరళలోని ప్రసిద్ధ శబరిమల ఆలయం గురించి అందరికీ తెలిసిందే. 50 ఏళ్లు దాటిన మహిళలు, పదేళ్ల లోపు ఆడపిల్లలు మాత్రం ఇందులోకి ప్రవేశించవచ్చు. పది నుంచి 50 ఏళ్ల లోపు మహిళలు ఈ గుడిలోకి ప్రవేశించరాదు. ఈ ఆలయం బ్రహ్మచారి అయిన అయ్యప్ప స్వామికి చెందినది. అందుకే ఇక్కడికి రుతుక్రమం అయ్యే మహిళలు అడుగుపెట్టేందుకు వీలు లేదు.
జపాన్లోనే ఒకినోషిమా అనే దీవి ఉంది. ఈ దీవిలో కూడా మహిళల ప్రవేశం పూర్తిగా నిషిద్ధం. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదల్లో దీన్ని ఒకటిగా గుర్తించారు. షింటో సంప్రదాయాల ప్రకారం మహిళలకు ప్రవేశం ఉండదని చెబుతారు. షింటో సంప్రదాయం బౌద్ధమతం, కన్య్వూయనిజం, చైనీస్ వంటివన్నీ కలిపిన మిశ్రమం. ఈ సాంప్రదాయాన్ని ఇక్కడ ప్రజలు కచ్చితంగా పాటిస్తారు. ఆ దీవిలోకి ఒక్క మహిళను కూడా అనుమతి ఇవ్వరు.
సంబంధిత కథనం