Motivational quotes: ఎవరిలోనైనా ఆత్మస్థైర్యాన్ని నింపి నిరాశను దూరం చేసే మోటివేషనల్ కోట్స్ ఇవి
Motivational quotes: జయ కిషోరి స్ఫూర్తిదాయకమైన మాటలు: జయ కిషోరి గారి స్ఫూర్తిదాయక ఆలోచనలు ప్రజలను సానుకూలంగా ఉండటానికి మరియు జీవితంలో ముందుకు సాగడానికి ప్రేరేపిస్తాయి. ఆయన అమూల్యమైన ఆలోచనలు తెలుసుకుందాం...
మోటివేషనల్ స్పీకర్ జయ కిషోరి యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది.ఆమె తన స్ఫూర్తిదాయక ఆలోచనలను ప్రజలతో పంచుకుంటూ ఉంటుంది. ఆమె ప్రసంగాలకు ఎంతో మంది స్పూర్తి పొందుతారు. సత్యం, మంచితనం, ధర్మం… వీటి మార్గాన్ని అనుసరించమని ఆమ ప్రజలను ప్రేరేపిస్తుంది. ఆమె ఉపన్యాసాలు, దేశ, విదేశాల్లో ఎన్నో ప్రశంసలు పొందాయి. భగవద్గీతలోని అంశాలతో పాటూ నిజజీవిత కథలను వినిపించి నిరాశలో ఉన్న వారికి ఆమె ముందుకు నడిపిస్తుంది. ఆమె తన ప్రసంగంలో మానవత్వ విలువలకు దిశానిర్దేశం చేస్తుంది. ఆమె స్ఫూర్తిదాయకమైన ప్రసంగాల్లోని కొన్ని కోట్స్ ను సేకరించి ఇక్కడ ఇచ్చాము. వీటిని చదివితే ఎవరికైనా జీవితంపై ఆశ పుడుతుంది. మళ్లీ చిగురించాలనే కోరిక కలుగుతుంది. ముఖ్యంగా డిప్రెషన్ తో బాధపడుతున్న వారికి ఇవి తిరిగి జీవాన్ని అందిస్తాయి. మీరు కూడా ఏదైనా బాధలో, నిరాశలో ఉంటే ఈ మోటివేషన్ కోట్స్ చదివేందుకు ప్రయత్నించండి. ఇవి మీకు కచ్చితంగా అద్భుతంగా పనిచేస్తాయి.
మోటివేషనల్ కోట్స్
- కాలం మంచిదైనా, చెడ్డదైనా అది మనకు ఏదో ఒకటి నేర్చే వెళుతుంది. మంచి నేర్చుకుంటే సంతోషం, అదే చెడు నేర్చుకుంటే అలాంటి దారిలో వెళ్లకూడదని చెబుతుంది.
2. ఒక వ్యక్తి మాటల్లో ఎంత నిజం ఉందో అతని చేసే పనులే తెలియజేస్తాయి. కాబట్టి వ్యక్తి మాటలను బట్టి కాదు, వారి పనుల బట్టి వారి గురించి అంచనా వేసి జాగ్రత్తగా ఉండాలి.
3. ఈ రోజుల్లో సంతోషంగా ఉన్నవారి సంఖ్య తక్కువైపోతోంది. దానికి కారణం అత్యాశ. అది వదిలేస్తే ఆనందం మన మనసుల్లోంచే పుడుతుంది.
4. మీరు కోరుకున్న జీవితాన్ని మీ పనులు, పద్దతుల ద్వారా మీరే సృష్టించుకోవాలి. మీరు కష్టపడకుండా సుఖమైన జీవితం కావాలని కోరకుంటే కుదరదు.
5. విజయం సాధించడం పెద్ద విషయం కాదు, కానీ విజయాన్ని కాపాడుకోవడం మాత్రం చాలా కష్టమైన పని.
6. తనను తాను పెద్దవాడిగా చెప్పుకోవడం వల్ల అతను పెద్దవాడు అయిపోడు. అతడు చేసిన పనులను ప్రపంచం గుర్తించి ప్రశంసించినప్పుడు వారి ఔన్నత్యం కనిపిస్తుంది.
7. ఎన్ని ప్రదేశాలు మారినా చెడు అలవాట్లను మార్చుకోకపోతే
అన్ని చోట్లా దుర్భర పరిస్థితులు నెలకొంటాయి. మీ జీవితం ఎలా ఉండాలన్నది మీ చేతుల్లోనే ఉంది.
8. మిమ్మల్ని చూసి భయపడితే కాదు, ఎవరైనా మిమ్మల్ని చూసి గౌరవిస్తే అది అసలైన గౌరవం.
9. మీరు జీవితాన్ని సంతోషంగా ఉంచాలనుకుంటే, మీ ఆలోచనలను ఎంచుకోవడం నేర్చుకోండి. అంటే మంచి ఆలోచనల వల్ల మంచి పేరు తెచ్చుకుంటారు, అదే చెడు చేతలు చేస్తే మిగిలేది చెడ్డ పేరే.
10. దేవునికి తల వంచి నమస్కరించండి, లోకానికి తలవంచవలసిన అవసరం లేదు.
11. విద్యను మాటల ద్వారా కాకుండా నడవడిక ద్వారా బోధిస్తే మరింత ప్రభావవంతంగా ఉంటుంది.
12. మాట్లాడటానికి సమయం పట్టదు, కానీ ఆ మాటలను నిలబెట్టుకోవడానికి జీవితం పడుతుంది.
13. హింసలో భాగం కావద్దు, ఆ హింసకే మీరు బలైపోతారు.