సునీత విలియమ్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో తొమ్మిది నెలలు జీవించింది. ఆమె మరొక వ్యోమగామి బుచ్ విల్మోర్ తో కలిసి ఈరోజు భూమికి తిరిగి రాబోతోంది. ఆమె రాక కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. భూమ్మీదకు వచ్చాక వారి జీవితం సాధారణంగా ఉండదు.
వారం రోజులపాటు అంతరిక్ష కేంద్రంలో ఉండేందుకు వెళ్లిన సునీత విలియమ్స్ అనుకోని పరిణామాల వల్ల తొమ్మిది నెలల పాటు ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు ఆమె తిరిగి భూమి మీదకు చేరుకుంటుంది. అంతరిక్షంలో ఎక్కువ సమయం గడపడం వల్ల భూమి మీదకు చేరుకున్నాక ఆమెకు కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.
అంతరిక్ష కేంద్రంలో కొన్ని నెలల పాటు నివసించడం వల్ల మానవ శరీరం, మనసుపై తీవ్ర ప్రభావాలు పడతాయి. ఎముక సాంద్రత, కండర ద్రవ్యరాశి, దృష్టి , మానసిక ఆరోగ్యం పై కూడా ప్రభావం తప్పదు. మీరు భూమి మీదకు చేరుకున్న తర్వాత వారిపై ఎలాంటి దీర్ఘకాలిక ప్రభావాలు ఉంటాయో వైద్యులు అధ్యయనం చేసే అవకాశం ఉంటుంది.
సునీత విలియమ్స్ భూమ్మీదకి చేరుకున్నాక వారు కోల్పోయిన ఎముక సాంద్రతను తిరిగి పొందడానికి నెలల తరబడి వారికి శిక్షణ అవసరం పడుతుంది. అంతరిక్షంలో గుండె గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా రక్తాన్ని పంపు చేస్తుంది. కాబట్టి అది తక్కువగా పనిచేస్తుంది. రక్త పంపిణీ కూడా మారిపోతుంది. దీనివల్ల ముఖం ఉబ్బిపోయినట్టు అవుతుంది. తలలో ద్రవాలు పెరిగిపోతాయి. వ్యోమగాములకు నిత్యం జలుబు చేస్తున్నట్టు అనిపిస్తుంది. రక్త ప్రసరణలో రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని కూడా పెంచేస్తాయి. కాబట్టి సునీత విలియన్స్ భూమి మీదకు వచ్చాక గుండె పనితీరును ప్రత్యేకంగా పర్యవేక్షించాల్సిన అవసరం ఉంటుంది.
సునీత విలియమ్స్ తలలో ద్రవం పేరుకుపోవడం వల్ల దృష్టి సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. అలాగే వారి కంటిలోని ఐబాల్ ఆకారం కూడా మారుతుంది. వారి దృష్టి అస్పష్టంగా మారిపోతుంది. కాబట్టి సునీత విలియమ్స్ ఇకపై కళ్లద్దాలు ధరించాల్సిన అవసరం రావచ్చు.
అంతరిక్ష కేంద్రంలో జీరో గ్రావిటీ దగ్గర సునీత విలియమ్స్ జీవించారు. కాబట్టి వారి చర్మం మృదువుగా, సున్నితంగా మారిపోతుంది. అంతరిక్ష కేంద్రంలో చర్మం నుండి దుస్తులు దూరంగా తేలుతూ ఉన్నట్టు ఉంటాయి. కానీ భూమ్మీదకి వచ్చాక వారు బట్టలు వారి చర్మానికి అతుక్కుని ఉండాలి. ఇది వారు భరించలేక పోతారు. చర్మంపై దుస్తులు అలెర్జీని కూడా కలిగించవచ్చు.
భూమి మీదకు చేరుకున్న తర్వాత సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ రోజువారీ జీవితంలో సెట్ అవ్వడానికి చాలా సమయం పడుతుంది. వీరు ప్రతిరోజు వాకింగ్ వంటివి శిక్షణ తీసుకోవాలి. భూమి గురుత్వాకర్షణ శక్తికి అనుగుణంగా వారు అన్ని పనులు చేయాల్సి వస్తుంది. దీనికి వారికి శారీరక, మానసిక మద్దతు ఎంతో అవసరం.
సునీత విలియమ్స్ వయసు ఇప్పుడు 59 ఏళ్లు. సునీత తండ్రి భారతీయ మూలాలు కలిగి ఉన్న వ్యక్తి. ఆమె తండ్రి దీపక్ పాండ్య గుజరాత్ కి చెందిన వ్యక్తి. ఉద్యోగరీతా ఆయన అమెరికాలో సెటిల్ అయ్యారు. సునీత అమెరికాలోనే ఒహాయోలో జన్మించింది. అందుకే ఆమె పూర్తి అమెరికన్. ఆమె భర్త మైఖెల్ విలియమ్స్ ను వివాహం చేసుకున్నారు. వీరికి పిల్లలు లేరు. ఆమె భారతదేశం నుంచి ఒక పాపని దత్తత తీసుకోవాలని కోరుకునేవారు. కానీ ఇప్పటివరకు అది జరగలేదు.
సంబంధిత కథనం