Avoid foods with Lemon: నిమ్మరసంతో కలిపి తినకూడని ఆహారాలు ఇవే, తింటే ఏం జరుగుతుందంటే…
Avoid foods with Lemon: కొన్ని ఆహారాలతో నిమ్మరసం మిక్స్ చేసి తినకూడదు. ఇది రుచినే కాదు, వారి ఆరోగ్యాన్ని కూడా పాడు చేస్తుంది. కాబట్టి నిమ్మరసంతో కలిపి తినకూడని ఆహారాలు ఇవిగో.

నిమ్మకాయ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇందులో విటమిన్ సి, ఖనిజాలతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. నిమ్మకాయను వాడడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఏ ఆహారంలోనైనా పులుపు కావాలనుకుంటే ముందుగా గుర్తుపెట్టుకోవాల్సింది నిమ్మరసం. ఇది రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి కూడా మంచిది. ఉదాహరణకు కాయధాన్యాలతో చేసిన ఆహారాన్ని తింటున్నప్పుడు నిమ్మరసం కలుపుకుని తినాలి. ఇలా తినడం వల్ల ఇవి ప్రోటీన్ ను బాగా గ్రహించి విటమిన్ సి ఇవ్వడానికి సహాయపడతాయి. కానీ కొన్ని ఆహారాలతో కలిపి నిమ్మరసం తింటే మాత్రం మంచిది కాదు. కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
ఆహారంలో నిమ్మరసం ఎందుకు చేర్చకూడదు?
కొన్ని ఆహార పదార్థాలకు నిమ్మరసం జోడించడం ఆరోగ్యానికి హానికరంగా మారుతుంది. వాస్తవానికి, నిమ్మకాయ ఒక ఆమ్ల ఆహారం. ఇది ఆమ్ల లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది అనేక రకాల ఆహార పదార్థాలతో ప్రతిస్పందిస్తుంది. ఫలితంగా పొట్లోట జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు వస్తాయి.
పాల ఉత్పత్తులు
నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది పాలతో లేదా కోవా, జున్ను, పెరుగు వంటి ఏదైనా పాల ఉత్పత్తితో కలిపినట్లయితే, పాల ఆకృతిని పాడు చేస్తుంది. అలాగే లాక్టిక్ యాసిడ్ కాంపోనెంట్స్ ఉండే పెరుగు. నిమ్మకాయను దానితో కలిపి తింటే ఎసిడిటీ, జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు వస్తాయి.
స్పైసీ ఫుడ్
బిర్యానీలు, పులావ్ లు వంటి స్పైసీ ఫుడ్‌లలో మసాలా అధికంగా ఉంటుంది. వాటిపై నిమ్మరసం చల్లుకుని తినేవారి సంఖ్య ఎక్కువ. నిజానికి అలా మసాలా నిండిన స్పైసీ ఆహారంలో నిమ్మరసం కలపకూడదు. చేప, మాంసం వండిన ఆహారంలో కూడా నిమ్మరసం కలపకూడదు. ఇది చేపల రుచిని పాడు చేస్తుంది.
తీపి పదార్థాలు
తీపి రుచిని కలిగి ఉండే పండ్లు అయినా అరటిపండు, మామిడి, ఆపిల్, పుచ్చకాయ, బాగా పండిన స్ట్రాబెర్రీలు, నిమ్మరసం వంటి వాటితో నిమ్మరసం కలపకూడదు. ఇది పొట్ట ఉబ్బరం, గుండెల్లో మంట వంటి సమస్యలను కలిగిస్తుంది.
మజ్జిగలో నిమ్మరసం కలపకూడదు. నిమ్మరసం పాలు, పెరుగులో ఎలా కలపకూడదో అదే విధంగా మజ్జిగలో నిమ్మరసం కలపకూడదు. ఇది జీర్ణక్రియకు మంచిది కాదు.
గుడ్లతో వండిన ఆహారాల్లో కూడా నిమ్మరసం కలపకూడదు. నిమ్మరసం గుడ్డులోని ప్రోటీన్ ను తొలగిస్తుంది. ఇది గుడ్డు ఆకృతిని పాడు చేస్తుంది. కాబట్టి చాలా గుడ్డు వంటకాల్లో నిమ్మరసం వాడకూడదు.