Parenting Tips: తల్లిదండ్రులు పిల్లలతో చెప్పకూడని అయిదు అబద్ధాలు ఇవే
Parenting Tips: చాలాసార్లు తల్లిదండ్రులు తమ పిల్లలను ఏమార్చడానికి అనేక అబద్ధాలు చెబుతారు. ఈ అబద్ధాలలో కొన్ని పిల్లల మానసిక ఆరోగ్యంపై కూడా చెడు ప్రభావాన్ని చూపుతాయి. కాబట్టి తల్లిదండ్రులు వారితో కొన్ని రకాల అబద్ధాలు చెప్పకూడదు.
పిల్లలను సక్రమంగా పెంచడం అంత సులువైన పని కాదు. ముఖ్యంగా పిల్లలు చిన్నవయసులో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. తల్లిదండ్రులు తరచుగా చిన్న పిల్లలకు అనేక రకాల అబద్ధాలు చెబుతారు. చాలాసార్లు అబద్ధం చెప్పడం ద్వారా వారికి ఆహారం తినిపించడం, నిద్రపుచ్చడం, స్కూలుకి పంపడం వంటివి చేస్తూ ఉంటారు. ఇందులో తప్పేమీ లేదు ఎందుకంటే పిల్లలను హ్యాండిల్ చేయడానికి కొన్ని విషయాలను దాచడం వంటివి అవసరం. అయినప్పటికీ, పిల్లలతో ఎల్లప్పుడూ అబద్ధం చెప్పడం వారి మానసిక ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. పిల్లలకు చెప్పకూడని విషయాలు కొన్ని ఉన్నాయి. వీటి గురించి ఎప్పుడూ అబద్దాల రూపంలో చెప్పకండి.
చాలాసార్లు తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇష్టమైన వస్తువులను తీసుకువస్తామని వాగ్దానం చేస్తారు. కాని దానిని నెరవేర్చరు. వారు సాధారణంగా ఎక్కడికైనా వెళ్ళవలసి వచ్చినప్పుడు లేదా పిల్లలను ఒప్పించవలసి వచ్చినప్పుడు ఇలా చేస్తారు. అలా చెప్పి పిల్లల నుంచి తాత్కాలికంగా తప్పించుకున్నట్టు మీకు అనిపించవచ్చు, కానీ మీ ఈ ప్రవర్తన పిల్లలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఇలా చేయడం వల్ల పిల్లవాడు తల్లిదండ్రులపై నమ్మకం కోల్పోవడం మొదలుపెడతాడు. జీవితంలో ఎవరినీ వారు నమ్మలేని స్థితికి కూడా రావచ్చు.
అతిగా చెప్పకండి
తలిదండ్రులు తమ గురించి పిల్లలకు అతిగా చెప్పుకుంటూ ఉంటారు. చిన్నప్పుడు తాము చాలా బాగా చదివామని, ధైర్యసాహసాలు కలవారమని చెబుతారు. ఎవరికీ భయపడేవాన్ని కాదని చెబుతూ ఉంటారు. ఈ విషయాల ద్వారా పిల్లలను ధైర్యవంతులను చేస్తున్నామని తల్లిదండ్రులు భావిస్తారు, కానీ తల్లిదండ్రుల ఈ విషయాలు పిల్లలపై వ్యతిరేక ప్రభావాన్ని చూపుతాయి. ఇలా చేయడం వల్ల చాలాసార్లు పిల్లలు ఆత్మవిశ్వాసం కోల్పోతారని నిపుణులు చెబుతున్నారు. వారికి ధైర్యంగా ఉండాలని చెప్పేందుకు ఇలాంటి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు.
పిల్లలు వారి తల్లిదండ్రులకు చాలా ప్రత్యేకం. అందులో తప్పేమీ లేదు. మీ పిల్లలను పోషించడానికి మీకు అన్ని హక్కులు ఉన్నాయి. అయితే, ఈ సమయంలో, చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను అతిగా ప్రేమించడం ప్రారంభిస్తారు. వారిని ఇతర పిల్లలతో పోల్చడం వంటివి చేస్తారు. ఇలా చేయడం వల్ల తమ పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని వారు భావిస్తున్నారు. ఇది పిల్లలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఇలా చేయడం ద్వారా, పిల్లలు తమను, ఇతర పిల్లలను తక్కువగా అంచనా వేయడం ప్రారంభిస్తారు.
తప్పుడు హామీలు
ఇప్పుడే వచ్చేస్తా అంటూ పిల్లలకు చెప్పి ఆఫీసులకు వెళ్లతారు కొంతమంది తల్లిదండ్రులు. కానీ సాయంత్రం దాకా వారు రారు. ఐదు నిమిషాల్లో వస్తానని చెప్పి వెళుతూ ఉంటారు. ఈ అలవాటు ఇతరులకు సాధారణం కావచ్చు, కానీ మీరు మీ పిల్లలతో అదే విధంగా మాట్లాడితే, వెంటనే మీ అలవాటును మార్చుకోండి. వాస్తవానికి, ఎల్లప్పుడూ పిల్లలకు ఇలాంటి తప్పుడు హామీలు ఇవ్వడం వారి విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. తల్లిదండ్రుల మాటలు నమ్మలేక ఇబ్బంది పడుతున్నారు. పిల్లల్లో విసుగు కూడా పెరిగిపోతుంది.
కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలను అదుపులో ఉంచుకోవడానికి తప్పుడు ఫాంటసీలతో భయపెడతారు. కొన్నిసార్లు పొడవాటి దంతాలు ఉన్న మంత్రగత్తె, కొన్నిసార్లు దానిని సంచిలో మోసుకెళ్లే బూచి వస్తాడని చెబుతూ ఉంటారు. తల్లిదండ్రుల ఈ అలవాటు పిల్లల మానసిక ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. నిజానికి ఇలా చేయడం వల్ల పిల్లల మదిలో ఎక్కడో ఒక మూల భయం ఉండిపోతుంది. అది వారితో ఎక్కువ కాలం ఉంటుంది.
(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)
టాపిక్