Sleeping Foods : ఈ 9 రకాల ఆహారాలు తింటే నిద్ర బాగా పడుతుంది-these 9 foods to help sleep well you must eat ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Sleeping Foods : ఈ 9 రకాల ఆహారాలు తింటే నిద్ర బాగా పడుతుంది

Sleeping Foods : ఈ 9 రకాల ఆహారాలు తింటే నిద్ర బాగా పడుతుంది

Anand Sai HT Telugu

Sleeping Well Tips : మనిషి నిద్ర చాలా అవసరం. సరైన నిద్రపోయేందుకు సరైనా ఆహారం కూడా తీసుకోవాలి. కొన్ని రకాల ఆహారాలను నిద్రను ప్రోత్సహిస్తాయి. వాటి గురించి తెలుసుకోండి.

నిద్రపోయేందుకు ఉపయోగపడే ఆహారాలు (Unsplash)

నిద్రలేకుండా మనిషి బతకలేడు. సరైన నిద్ర లేకపోవటం, ఎక్కువ సేపు రాత్రుళ్లు మేల్కోవడం వలన ఆరోగ్యంలో రకరకాల తేడాలు వస్తాయి. అందుకే నిద్ర పట్టకపోవడంతో చాలా మంది నిద్రమాత్రలు తీసుకుంటారు. కానీ ఇది చాలా చెడ్డ పద్ధతి. మెుత్తం ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మానసికంగా స్ట్రాంగ్‌గా ఉండాలి. మానసిక ఒత్తిడితో బాధపడేవారికి నిద్రలేమి సహజం. కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా నిద్రను పొందవచ్చు. అవేంటో చూద్దాం..

పాలకూరలో లాక్టోస్ పుష్కలంగా ఉంటుంది. ఇది నిద్రకు సహాయపడేది అని చెప్పవచ్చు. ఇది సాధారణంగా వివిధ సలాడ్లు, ఆహార తయారీలలో ఉపయోగిస్తారు. దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడం ప్రారంభిస్తే నిద్ర సమస్య దూరమవుతుంది.

పిస్తా మెగ్నీషియం, ప్రొటీన్, విటమిన్ బి6 సమృద్ధిగా ఉండే అద్భుతమైన ఆహార పదార్థం. ఇది మంచి నిద్రను ప్రోత్సహిస్తుంది. ఈ పిస్తా గింజలను డెజర్ట్‌లను తయారు చేయడానికి, ఆకలి బాధలను త్వరగా అణచివేయడానికి చిరుతిండిగా ఉపయోగించవచ్చు.

కాలే కాల్షియం అద్భుతమైన మూలం. దీన్ని కొన్ని ఆహారాలకు చేర్చవచ్చు. కాల్షియం లోపిస్తే నిద్ర సమస్యలు వస్తాయని చెబుతున్నారు. నిద్రవేళలో దీన్ని వండుకుని తింటే నిద్రలేమి నయమవుతుంది. అందుకే ఈ ఆహారం తీసుకుంటే సమస్య పరిష్కారం అవుతుంది.

కివీ పండులో విటమిన్ సి, విటమిన్ ఇ, ఫోలేట్ మరియు సెరోటోనిన్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి మంచి నిద్ర పొందడానికి సహాయపడతాయి. కివీ పండు నిద్రలేమితో బాధపడేవారికి లేదా సుఖంగా నిద్రపోవాలనుకునే వారికి అద్భుతమైనది.

కొంతమందికి డార్క్ చాక్లెట్ అంటే చాలా ఇష్టం. మరికొందరు డిన్నర్ తర్వాత చాక్లెట్ తినడానికి ఇష్టపడతారు. ఈ అభిరుచి నిద్రను ప్రోత్సహిస్తుంది. డార్క్ చాక్లెట్లలో సెరోటోనిన్ ఉంటుంది. ఇది శరీరం విశ్రాంతి తీసుకోవడానికి, బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది.

వాల్‌నట్‌లో ట్రిప్టోఫాన్ ఉంటుంది. ఇది శరీరంలో సెరోటోనిన్, మెలటోనిన్ ఉత్పత్తి చేస్తుంది. మంచి రాత్రి నిద్రను ప్రోత్సహిస్తాయి. దీన్ని రెగ్యులర్‌గా తీసుకోవడం లేదా భోజనం సమయంలో మీ సలాడ్‌లలో చేర్చుకోవడం వల్ల మీరు బాగా నిద్రపోవచ్చు.

నిద్రను ప్రోత్సహించడానికి తృణధాన్యాలు అద్భుతమైనవి. పడుకునే ముందు వివిధ తృణధాన్యాల మిశ్రమాన్ని ఒక గిన్నెలో తీసుకోవడం వల్ల నిద్ర సమస్యలు తగ్గుతాయి. నిద్రను ప్రోత్సహించడానికి కార్బోహైడ్రేట్లు, కాల్షియం అధికంగా ఉంటాయి.

వోట్మీల్ ప్రసిద్ధ ఆహార పదార్థాలలో ఒకటి. దీన్ని అల్పాహారంగా లేదా రాత్రి భోజనంగా తీసుకోవచ్చు. ఇందులో మెలటోనిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది మెల్లగా నిద్రను ప్రేరేపిస్తుంది.

తృణధాన్యాలు ఉత్తమ నిద్రను ప్రోత్సహించే ఆహారాలు. ఇవి రక్తంలో గ్లూకోజ్ స్థాయిని పెంచుతాయి. మంచి నిద్రను కూడా ప్రోత్సహిస్తుంది. పడుకునే ముందు లేదా క్రమం తప్పకుండా తృణధాన్యాలు తీసుకోవడం వల్ల మంచి నిద్ర వస్తుంది.

అయితే ఏది తిన్నా నిద్రకు ముందుగా తినాలి. సరిగా మంచం మీదకు వెళ్లే సమయంలో తినకూడదు. నిద్రపోవాలనుకునే గంట ముందు ఆహారం తీసుకోవాలి. అప్పుడే జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. రాత్రిపూట ఆయిల్ ఫుడ్ అస్సలు తీసుకోకూడదు. జీర్ణం అవ్వదు.