Beauty tips: ముఖకాంతిని పెంచే ఆహారాలు ఇవిగో, ఈ 5 పదార్థాలు కొల్లాజెన్ స్థాయిలను పెంచుతాయి
చాలామంది ముఖ కాంతి కోల్పోతారు. దీనికి కారణం వారి ఆహారపు అలవాట్లు కావచ్చు. మీరు ఆహారంలో ఏమి తినాలి, ఏమి తినకూడదో తెలుసుకుంటే ముఖ కాంతిని పెంచుకోవచ్చు. ముఖ్యంగా కొన్ని రకాల ఆహారాలు తినడం వల్ల చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది.

ముఖ కాంతిని ప్రతి ఒక్కరూ కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని కారణాల వల్ల వయసు పెరగక ముందే చర్మం వాడిపోయినట్టు అయిపోతోంది. చర్మాన్ని కాపాడుకోవడానికి స్కిన్ కేర్ రొటీన్‌తో పాటు శరీరంలోని కొల్లాజెన్ స్థాయిలు కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. శరీరంలో కొల్లాజెన్ లోపం వల్ల చర్మం వదులుగా మారడం, ముడతలు పడటం, కీళ్ళ నొప్పులు, బలహీనమైన కండరాలు, ఎల్లప్పుడూ అలసటగా ఉండడం, చర్మం ఎరుపుగా మారడం వంటి సమస్యలు వస్తాయి. చాలామంది వయసు ముదరక ముందే సంబంధించిన ముఖ కాంతి కోల్పోవడాన్ని గురించి చెబుతుంటారు. దీనికి కారణం రోజువారీ ఆహారపు అలవాట్లు కావచ్చు. శరీరంలో కొల్లాజెన్ స్థాయిని మెరుగుపరచడానికి మీరు ఏమి తినాలో? ఏమి తినకూడదో తెలుసుకోండి.
కొల్లాజెన్ అంటే ఏమిటి?
కొల్లాజెన్ అనేది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే ముఖ్యమైన ప్రోటీన్. ఇది ఎముకలను బలంగా, చర్మాన్ని అందంగా, జుట్టును మెత్తగా, కండరాలను బలంగా చేస్తుంది. శరీరంలో దీని లోపం వల్ల ఎముకలు బలహీనపడి, చర్మం మందంగా మారుతుంది. చర్మం మీద ముడతలు, మొటిమల సమస్యలు పెరుగుతాయి.
కొల్లాజెన్ కోసం వీటిని తినకండి
తీపి పదార్థాలు
అధికంగా తీపి తినడం వల్ల కొల్లాజెన్‌కు హాని కలుగుతుంది. అధికంగా తీపి తినడం వల్ల చక్కెర అణువులు మన రక్త ప్రవాహంలో కొల్లాజెన్ ఫైబర్లతో కలిసిపోతాయి. ఈ ప్రక్రియను గ్లైకేషన్ అంటారు. దీని వల్ల చర్మంలో కొల్లాజెన్ నెమ్మదిగా తగ్గుతుంది. దీనివల్ల చర్మం వదులుగా మారి, వృద్ధాప్య లక్షణాలు త్వరగా కనిపిస్తాయి. కాబట్టి తీపి పదార్థాలు ఎంత తగ్గిస్తే అంత మంచిది.
అధిక మసాలాలు
ఆహారంలో అధికంగా మసాలాలు వాడటం కూడా శరీరంలో కొల్లాజెన్ లోపం పెరిగిపోతుంది. ఇది ముఖం మీద ముడతలకు దారితీస్తుంది. దీని నుండి తప్పించుకోవడానికి ఆహారంలో మసాలాలను పరిమితంగా వాడండి.
విటమిన్ సి లోపం
ఆహారంలో విటమిన్ సి లోపం కూడా కొల్లాజెన్ లోపానికి కారణం కావచ్చు. అందుకే విటమిన్ సి, అమైనో ఆమ్లాలతో సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల శరీరంలో హైలూరోనిక్ ఆమ్లం, కొల్లాజెన్ స్థాయిలు పెరుగుతాయి.
కొల్లాజెన్ కోపం తినాల్సినవి
పుల్లని పండ్లు
విటమిన్ సి లోపం చర్మంలో కొల్లాజెన్‌ను తగ్గిస్తుంది. అందుకే మీ ఆహారంలో కొల్లాజెన్‌తో సమృద్ధిగా ఉండే పుల్లని పండ్లు, ఉదాహరణకు నిమ్మకాయ, నారింజ, ఆవకాయ, టమాటో, ద్రాక్షలను చేర్చండి. ఈ పండ్లు విటమిన్ సితో సమృద్ధిగా ఉండి, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
ప్రోటీన్ ఫుడ్
ప్రోటీన్‌తో కూడిన ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల కొల్లాజెన్ పెరుగుతుంది. ప్రోటీన్‌లో ఉండే అమైనో ఆమ్లాలు కొల్లాజెన్ ఉత్పత్తిలో సహాయపడతాయి.
ఆకుకూరలు
కాలే బ్రోకలీ, పాలకూర వంటి క్లోరోఫిల్‌తో సమృద్ధిగా ఉండే ఉంటాయి. అలాగే వాటిలో విటమిన్ సి, కెరోటినాయిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫోలేట్లు కూడా ఉంటాయి. ఇవి చర్మాన్ని హానికరమైన, కొల్లాజెన్‌ను నాశనం చేసే సూర్య కిరణాల నుండి రక్షించడంలో సహాయపడతాయి. ఈ ఆహారాలు చర్మం స్థితిస్థాపకతను పెంచి ముడతలను తగ్గించడంలో సహాయపడతాయి.
మష్రూమ్స్
మష్రూమ్స్ కాపర్‌తో సమృద్ధిగా ఉంటాయి, ఇవి కొల్లాజెన్‌ను పెంచడంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా ఇది చర్మం మీద ముడతలు, చిన్న గీతలను తగ్గించడంలో సహాయపడుతుంది.
అలోవేరా జెల్
రోజూ చర్మం మీద అలోవేరా జెల్ వేసుకోవడం వల్ల కూడా సహజంగా కొల్లాజెన్ పెంచడంలో సహాయపడుతుంది. శరీరంలో సహజంగా కొల్లాజెన్ పెంచడానికి మీ చర్మ సంరక్షణలో అలోవేరా జెల్‌ను చేర్చుకోవడంతో పాటు దానితో కూరగాయలు కూడా తయారు చేసుకోవచ్చు.
(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)
సంబంధిత కథనం