ఈ 5 హెయిర్ ఆయిల్స్ వేసవికి ఉత్తమమైనవి, మోకాళ్ల వరకు జుట్టును పెంచేస్తాయి-these 5 hair oils are best for summer will grow hair up to your knees ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  ఈ 5 హెయిర్ ఆయిల్స్ వేసవికి ఉత్తమమైనవి, మోకాళ్ల వరకు జుట్టును పెంచేస్తాయి

ఈ 5 హెయిర్ ఆయిల్స్ వేసవికి ఉత్తమమైనవి, మోకాళ్ల వరకు జుట్టును పెంచేస్తాయి

Haritha Chappa HT Telugu

పొడవాటి, ఒత్తయిన జుట్టు కావాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. జుట్టు పెరగాలంటే వేసవిలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక్కడ మేము 5 హెయిర్ ఆయిల్స్ గురించి వివరించారు. వీటిని వేసవిలో వాడడం వల్ల జుట్టు పొడవుగా పెరిగే అవకాశం ఉంది.

బెస్ట్ హెయిర్ ఆయిల్స్

పొడవాటి జుట్టు కావాలని ప్రతి మహిళ కోరుకుంటుంది. కానీ జుట్టు పెంచేందుకు ఏం చేయాలో, ఎలాంటి నూనెలు వాడాలో మాత్రం తెలియదు. మోకాళ్ల వరకు పొడవైన, మందపాటి, అందమైన జుట్టును కోరుకుంటే వీరు వాడాల్సిన నూనెలు కొన్ని ఉన్నాయి .

నూనెను జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టుకు పోషణ అందుతుంది. ఇది జుట్టును దృఢంగా, మెరిసేలా చేసి వెంట్రుకలు రాలిపోయే సమస్యను చాలా వరకు తగ్గిస్తుంది. ఆయిల్ అప్లై చేయడం వల్ల జుట్టు పొడిబారి నిర్జీవంగా కనిపించదు.

వారానికి రెండు మూడు రోజులు జుట్టుకు నూనె రాసుకుంటే చాలా ప్రయోజనం ఉంటుంది. మోకాళ్ల వరకు పొడవాటి, ఒత్తైన జుట్టు కావాలంటే సరైన నూనె ఎంపిక చేసుకోవాలి. వేసవిలో ఎలాంటి నూనెలు వాడాలో తెలుసుకోండి. ఈ అయిదు నూనెలు జుట్టుకు మేలు చేస్తాయి.

1. బాదం ఆయిల్

జుట్టు రాలే సమస్యతో బాధపడేవారికి బాదం ఆయిల్ పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది. దీన్ని ప్రతిరోజూ జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు పెరుగుదల బాగుంటుంది. ఇది జుట్టు వాల్యూమ్ పెంచడానికి సహాయపడుతుంది. ఈ నూనెలో ఉండే విటమిన్ ఇ ఆరోగ్యకరమైన జుట్టును పెంచుతుంది. కాబట్టి అప్పుడప్పుడు బాదం ఆయిల్ కూడా జుట్టుకు అప్లై చేయాల్సిన అవసరం ఉంది.

2. కొబ్బరి నూనె

కొబ్బరి నూనెను జుట్టు సమస్యలను నయం చేయడానికి ప్రతి ఒక్కరూ ఉపయోగించవచ్చు. దీన్ని అప్లై చేయడం వల్ల జుట్టు పెరుగుదల కూడా పెరుగుతుంది. ఇది చుండ్రు, నెత్తి పొడి బారడం నివారించడానికి, జుట్టుకు మెరుపును ఇవ్వడానికి, జుట్టు చివరలను కండిషనింగ్ చేయడానికి సహాయపడుతుంది. కాబట్టి కొబ్బరి నూనె వాడితే ఎంతో మేలు.

3. ఆలివ్ ఆయిల్

ఆలివ్ ఆయిల్ అప్లై చేయడం వల్ల ఎలాంటి అలర్జీ రియాక్షన్ ఉండదు. కాబట్టి దీన్ని ఎవరైనా వాడవచ్చు. ఈ నూనెను అప్లై చేయడం వల్ల నెత్తిమీద ఒత్తిడి పెరుగుతుంది. దీన్ని అప్లై చేయడం వల్ల జుట్టు జిడ్డుగా అనిపించకుండా మెరిసిపోతుంది. దీని ఖరీదు ఎక్కువే కాబట్టి అప్పుడప్పుడు ఆలివ్ ఆయిల్ వాడడం ఉత్తమం.

4. ఆర్గాన్ ఆయిల్

ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్ ఇ, మెగ్నీషియం, ప్రోటీన్లతో సమృద్ధిగా ఉన్న ఆర్గాన్ ఆయిల్ వాడడం ఎంతో మంచిది. ఇది తలపై సెబమ్ ఉత్పత్తిని నియంత్రిస్తుంది. ఈ నూనె నెత్తిమీద వేగంగా గ్రహించేందుకు తేలికగా ఉంటుంది. డల్ అండ్ కర్లీ హెయిర్ కు ఇది చాలా మంచిది. అంటే నిర్జీవంగా ఉండే ఉంగరాల జుట్టుకు ఇది మంచి ఎంపిక.

5. ఆముదం నూనె

ఎండాకాలంలో ఆముదం నూనె అప్లై చేయడం ఉత్తమం. జుట్టు రాలడాన్ని నివారించడానికి ఈ నూనెను అప్లై చేయండి. ఈ నూనె కొద్దిగా జిగటగా ఉంటుంది, కాబట్టి దీనిని మరొక నూనెతో కలపండి. ఇలా చేయడం వల్ల జుట్టుకు మేలు జరుగుతుంది.

హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి.