Foolish Behaviour: ఈ 5 లక్షణాలు మీలో ఉంటే వెంటనే వదిలేయండి. లేదంటే అంతా మిమ్మల్ని మూర్ఖుడు అనడం ఖాయం!
Foolish Behaviour: తనను తాను గొప్పగా అనుకుని మోసపోయే వ్యక్తి మూర్ఖుడు. కొన్ని ప్రత్యేకమైన అలవాట్లతో అతని వ్యక్తిత్వాన్ని దిగజార్చుకుంటూ ఉంటాడు. మీకు తెలిసిన వారెవరైనా ఈ లక్షణాలతో ఉన్నారేమో గమనించండి. ఒకవేళ మీలోనూ ఈ లక్షణాలు ఉంటే వాటిని వెంటనే వదిలేయండి.
ప్రతి వ్యక్తి తాను చేసిన పనులు లేదా అలవాట్ల కారణంగానే సమాజంలో చెడ్డ వ్యక్తిగా లేదా మూర్ఖపు వ్యక్తిగా ముద్ర వేసేస్తాయి. సమాజంలో మూర్ఖులుగా పరిగణించే అలాంటి వ్యక్తులను ఎవరితోనైనా కలిసిన వెంటనే, ప్రజలు వింతగా మొఖాలు పెట్టుకుని, వారి మాటలను కూడా పట్టించుకోరు. ఆసక్తికరమైన మరో విషయం ఏమిటంటే, వారు చాలా తెలివైనవారని, ప్రజలు వారిని చాలా ఇష్టపడతుంటారని వారిలో వారు భావించుకుని మోసపోతుంటారు. వీటితో పాటు మరికొన్ని అలవాట్లు వారినే కాకుండా చుట్టుపక్కల ఉన్నవారిని కూడా ప్రమాదాలకు గురి చేస్తాయి. ఇప్పుడు ఈ అలవాట్లు మీలో లేదా మీ చుట్టూ ఉన్నవారిలో ఉన్నాయా అని అనుమానపడుతున్నారా.. రండి చెక్ చేద్దాం.
సర్వజ్ఞానిగా భావించడం
మూర్ఖులకు ఉండే అతి పెద్ద గుర్తింపు ఏమిటంటే, తనను తాను అత్యంత తెలివైనవాడిగా భావిస్తాడు. పైగా వీరికి అన్ని విషయాల గురించి తెలుసని ఎల్లప్పుడూ అనిపిస్తుంది. తెలియనివాడు తన జ్ఞానం గురించి గొప్పగా చెప్పుకుంటాడు. అంతేకాకుండా, అలాంటి వ్యక్తులు అడగకుండానే సలహా ఇవ్వడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు, దీని కారణంగానే వారిని చాలా మంది గౌరవించరు కూడా.
ఆవేశపడటం
మూర్ఖులకు ఉండే మరొక గుర్తింపు ఏమిటంటే, వారికి సహనం చాలా తక్కువగా ఉంటుంది. తెలివైన వ్యక్తులు ఏ పరిస్థితిలోనైనా ప్రశాంతంగా ఎలా ఉండాలో తెలుసుకుంటారు. మూర్ఖుడు చిన్న చిన్న గందరగోళంలో కూడా తన నిగ్రహాన్ని కోల్పోతుంటాడు. మూర్ఖుడికి కోపం ఎక్కువగా వస్తుంది. చిన్న చిన్న విషయాలకు కోపం తెచ్చుకుని అసభ్య పదజాలం వాడటం తక్కువ తెలివితేటలు ఉన్నవారి అలవాటు.
ఎల్లప్పుడూ తన గురించి గొప్పగా చెప్పుకోవడం
మూర్ఖులు ఎల్లప్పుడూ తన గురించి గొప్పగా చెప్పుకుంటాడు. అలాంటి వ్యక్తులకు ఇతరులను ప్రశంసించడం నచ్చదు, పోనీ ఎవరైనా ప్రశింసించినా కూడా ఓర్చుకోలేరు. మూర్ఖులు ఎల్లప్పుడూ తమను తాము ప్రశంసించుకోవడం, ప్రశంసలు వినడానికే ఇష్టపడతారు. అలాంటి వ్యక్తులలో అహంభావం ఉంటుంది. ఈ రకమైన వ్యక్తులు ఇతరుల విజయాలను విస్మరించి, తమను తాము మాత్రమే ప్రశంసించుకుంటారు. దీని కారణంగా క్రమంగా సమాజంలో వారి గౌరవం తగ్గుతుంది.
ఆలోచించకుండా పని చేయడం
తక్కువ తెలివితేటలు ఉన్నవారు ఏ పనినీ బాగా ఆలోచించి చేయరు. దీని కారణంగా వారు తరచుగా నష్టాలు, ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. మూర్ఖుల గుర్తింపు ఏమిటంటే, వారు ఎల్లప్పుడూ తొందరపడి నిర్ణయాలు తీసుకుంటారు. దీని కారణంగా చాలా సార్లు వారు కూడా ఇబ్బందుల్లో పడతారు. వారి కుటుంబాలను కూడా ఇబ్బందులకు గురి చేస్తారు.
ఇతరులను అవమానించడం
తక్కువ తెలివితేటలు ఉన్నవారు తమను తాము గొప్పవారిగా భావిస్తారు. ఈ అవగాహన లోపం కారణంగా వారు తరచుగా ఇతరులను అవమానిస్తారు. అంతేకాకుండా, అలాంటి వ్యక్తులు ఎల్లప్పుడూ అభద్రతా భావాన్ని కలిగి ఉంటారు. ఈ అభద్రతా భావాన్ని దాచుకోవడానికి, వారు ఎల్లప్పుడూ ఇతరులను చులకనగా చూస్తారు. వారి ఈ ప్రవర్తన కారణంగా, చాలా సార్లు వారి సన్నిహిత సంబంధాలు కూడా వారి నుండి దూరమవుతాయి.
సంబంధిత కథనం