ఈ 5 పదార్థాలలో ఉప్పు కలిపి తింటే అవి ఆరోగ్యాన్ని చెడగొడతాయి, జాగ్రత్త-these 5 foods if eaten with salt act like poison on your health ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  ఈ 5 పదార్థాలలో ఉప్పు కలిపి తింటే అవి ఆరోగ్యాన్ని చెడగొడతాయి, జాగ్రత్త

ఈ 5 పదార్థాలలో ఉప్పు కలిపి తింటే అవి ఆరోగ్యాన్ని చెడగొడతాయి, జాగ్రత్త

Haritha Chappa HT Telugu

ఉప్పు లేకుండా ఆహారం రుచి అంతగా బాగోదు. అయితే కొన్ని ఆహారాల్లో ఉప్పు కలుపుకుని తినడం ఆరోగ్యానికి చాలా హానికరం. అది విషంతో సమానం. ఎలాంటి ఆహారాల్లో ఉప్పు వేసుకుని తినకూడదో తెలుసుకోండి.

ఉప్పు వేయకూడని ఆహారాలు (Shutterstock)

కూరల్లో ఉప్పు పడితేనే దాని రుచి తెలుస్తుంది. ఉప్పు లేని ఆహారం తినడం చాలా కష్టం. ఆహారంలో ఉప్పు అతి ముఖ్యమైన భాగం. కానీ అవసరానికి మించి ఉప్పును తింటే మాత్రం ఆరోగ్యానికి విషంలా పనిచేస్తుందని అంటారు. దేనిమీదైనా ఉప్పు చల్లితే దాని రుచి పెరిగినా అది ఆరోగ్యానికి ఎంతమాత్రం మంచిది కాదు. రోజుకి పరిమిత మొత్తంలో ఉప్పు తినాలి. కానీ అయిదు రకాల ఆహారాల్లో ఉప్పును వేసుకుని తినడం చాలా డేంజర్. ఆ అయిదు ఆహారాల జాబితా ఇక్కడ ఇచ్చాము.

1.పెరుగు

సాదా పెరుగును నేరుగానే తినాలి. అందులో ఉప్పు కలిపి తినడం మంచిది కాదు. ఉప్పు కలిపిన పెరుగు తినకపోవడమే ఉత్తమం. నిజానికి పెరుగులో ఉప్పు సహజంగా ఉంటుంది. కాబట్టి పెరుగులో ఉప్పును జోడించి తినడం వల్ల అందులో ఉన్న మంచి బ్యాక్టీరియాను తొలగిస్తుంది. ఆయుర్వేదం ప్రకారం పాలు, పాల ఉత్పత్తుల్లో ఉప్పును జోడించడం నిషిద్ధంగా భావిస్తారు. ఉప్పు కలిపిన పెరుగు తినడం వల్ల స్కిన్, హెయిర్ ప్రాబ్లమ్స్ తో పాటు హైబీపీ సమస్యలు కూడా వస్తాయి.

2. సలాడ్

సలాడ్ లో ఉప్పు కలిపి తినే వాళ్లు ఎంతో మంది. సలాడ్ పై పచ్చి ఉప్పును పైన చల్లుతారు. అలా చేయడం వల్ల సలాడ్ అనారోగ్యకరంగా మారిపోతుంది. నిజానికి పచ్చి సలాడ్ పై ఉప్పు చల్లి తినడం వల్ల శరీరంలో సోడియం లెవల్స్ పెరుగుతాయి. అంతే కాదు, ఇది శరీరంలో నీరు నిలిచిపోయేలా చేస్తుంది. మూత్రపిండాల సమస్యకు కారణం అవుతుంది. సలాడ్ మన శరీరానికి సరైన హైడ్రేషన్ అందిస్తుంది. పుష్కలంగా ఫైబర్ ను ఇస్తుంది. కాబట్టి ఆరోగ్యకరమైన సలాడ్ లో ఉప్పు కలపకుండా ఆరోగ్యంగానే ఉంచడం మంచిది.

3. జ్యూస్

కొంతమంది ఫ్రూట్ జ్యూస్ అయినా, కూరగాయల జ్యూస్ అయినా చిటికెడు ఉప్పు వేస్తూ ఉంటారు. ఇలాంటి జ్యూస్ తాగడం వల్ల అనారోగ్యమే. జ్యూస్ లో ఉప్పు కలుపుకుని తాగడం వల్ల పోషకాలు తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీనివల్ల రోజులో మీరు తీసుకునే సోడియం స్థాయిలు కూడా పెరుగుతాయి. ఉప్పు కలిపిన జ్యూస్ తాగడం వల్ల డీహైడ్రేషన్ సమస్యలు కూడా వస్తాయి. అందువల్ల, ఎల్లప్పుడూ సహజమైన పద్ధతిలో జ్యూస్ తాగండి. అందుకే జ్యూస్ లో ఎటువంటి చక్కెర లేదా ఉప్పు కలపకూడదు.

4. పండ్లు

ఇంట్లో ఫ్రూట్ చాట్ చేసేటప్పుడు లేదా ఏదైనా పండు తినేటప్పుడు, దానిపై చిటికెడు ఉప్పు చల్లుతారు. ఆరోగ్య పరంగా ఈ అలవాటు ఎంతమాత్రం సరికాదు. కానీ ఇలా చేయడం వల్ల పండ్లలో ఉండే విటమిన్ సి వంటి అనేక పోషకాల పరిమాణం తగ్గుతుంది. అంతేకాకుండా శరీరంలో సోడియం లెవల్స్ పెరిగి నీరు నిల్వ ఉండటం, హైబీపీ, గుండె సంబంధిత వ్యాధులు, కిడ్నీ సమస్యలు తలెత్తుతాయి.

5. రైతా లేదా మజ్జిగ

వేసవిలో రైతా, మజ్జిగ లేదా లస్సీ వంటి పదార్థాలు ఎక్కువగా తాగుతారు. వాటిలో ఉప్పు కలపడం మంచిది కాదు. ఆయుర్వేదంలో ఈ రెండింటి కాంబినేషన్ చెడుగా చెబుతారు. పాల ఉత్పత్తుల్లో ఉప్పు కలుపుకుని తినడం వల్ల అపానవాయువు, కడుపులో బరువు, గ్యాస్, నొప్పి, చర్మ సమస్యలు వస్తాయి. రైతాకు ఉప్పు వేయాల్సి వస్తే చిటికెడు ఉప్పు మాత్రమే వేయాలి.

ఇక్కడ చెప్పిన 5 రకాల ఆహారాల్లో ఉప్పును అధికంగా వేసుకుని తింటే అది మీ శరీరంపై పాయిజన్ లా పనిచేస్తుందని గుర్తు పెట్టుకోండి. కాబట్టి అతి తక్కువగా ఉప్పును తినడం మంచిది.

(గమనిక: ఈ సమాచారం పూర్తిగా నమ్మకాలు, గ్రంథాలు, వివిధ మాధ్యమాలపై ఆధారపడి ఉంటుంది. సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా సమాచారాన్ని ఆమోదించే ముందు నిపుణులను సంప్రదించండి.)

Haritha Chappa

TwittereMail
హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి https://www.linkedin.com/in/haritha-ch-288a581a8/

సంబంధిత కథనం