Optical Illusion: ఈ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రంలో Mల మధ్య ఒక N దాక్కుని ఉంది, అదెక్కడుందో పది సెకన్లలో కనిపెట్టండి
Optical Illusion: మీ కళ్ళు చాలా పదునుగా ఉండి, మీ మెదడు చురుగ్గా పనిచేస్తే ఇలాంటి ఆప్టికల్ ఇల్యూషన్లను వెంటనే పరిష్కరించగలరు. ఇక్కడ ఇచ్చిన చిత్రంలో N ఎక్కడ ఉందో పదిసెకన్లలో కనిపెట్టండి.
బ్రెయిన్ టీజర్లు మన మెదడుకే కాదు మన కళ్ళకు కూడా సవాలు విసురుతాయి. ఇలాంటి చిత్రాలు మన కళ్లు, మెదడు ఎలా పనిచేస్తున్నాయో తెలుసుకునేందుకు ఉపయోగపడతాయి. ఇక్కడ మేము ఒక ఆసక్తికరమైన ఆప్టికల్ ఇల్యూషన్ ఇచ్చాము. దీన్ని మీరు కేవలం పదిసెకన్లలో చేధిస్తే మీ కంటిచూపు అద్భుతంగా పనిచేస్తోందని ఒప్పుకోవాల్సిందే. అలాగే మీ మెదడు కూడా చురుగ్గా ఉందని అర్థం చేసుకోవాల్సిందే. ఇక ఇక్కడిచ్చిన ఆప్టికల్ ఇల్యూషన్ గురించి చదవండి.

ఇక్కడ ఇచ్చిన ఆప్టికల్ ఇల్యూషన్లో ఆంగ్ల అక్షరం M ప్రతిచోటా ఉంది. ఎన్నో Mల మధ్య ఒకేఒక్క N ఇరుక్కుని ఉంది. అన్ని Mల మధ్య Nను కనిపెట్టడమే కాస్త కష్టమే. అయినా ప్రయత్నిస్తే అసాధ్యమేమీ కాదు. అయితే మీరు ఒక్కో వరుసను పట్టి పట్టి చూసి జవాబు కనిపెట్టేద్దామనుకుంటున్నారా. అలా చేస్తే మీ గొప్పతనం ఏముంది? కేవలం పది సెకన్ల సమయంలోనే మీరు జవాబును కనిపెట్టాలి.
ఆప్టికల్ ఇల్యూషన్ జవాబు
ఆప్టికల్ ఇల్యూషన్ ను పది సెకన్లలో సాధించిన వారికి కంగ్రాట్స్. ఇక జవాబు విషయానికొస్తే అయిదో నిలువ వరుసలో ఉంది. జాగ్రత్తగా చూస్తే దీన్ని మీరు కనిపెట్టేస్తారు. ఇలాంటి ఆప్టికల్ ఇల్యూషన్లు ఏకాగ్రతను పెంచుతాయి. కేవలం తెలివైనవారు మాత్రమే వీటిని సాధించగలరు. ఆప్టికల్ ఇల్యూషన్లు లాంటివే బ్రెయిన్ టీజర్లు కూడా. వీటిని సాధించినా కూడా మానసికంగా మెదడు చురుగ్గా మారుతుంది.
ఆప్టికల్ ఇల్యూషన్లు అప్పుడప్పుడు ప్రాక్టీసు చేయడం వల్ల మీ మెదడు, కళ్లు రెండూ ఆరోగ్యంగా చురుగ్గా మారుతాయి. మీకు ఏకాగ్రతను పెంచుకోవాలనుకుంటే ఇలా ఆప్టికల్ ఇల్యూషన్లను పరిష్కరిస్తూ ఉండాలి.
ఆప్టికల్ ఇల్యూషన్లను చేధించే క్రమంలో కళ్లు, మెదడు కలిసి పనిచేయడం అధికమవుతుంది. కళ్లు తాము చూసిన సమాచారాన్ని మెదడుకు చేరవేస్తుంది. మెదడు ఆ సమాచారాన్ని సెకన్లలో విశదీకరించడం మొదలవుతుంది. మెదడు ఎంత చక్కగా పనిచేస్తే మీరు అంత త్వరగా జవాబును కనిపెట్టగలరు. కాబట్టి ఆప్టికల్ ఇల్యూషన్లు మీ మెదడు పనితీరును కూడా చెప్పేస్తాయి.
ఇప్పుడు ఎంతో మంది చిత్రకారులు ఆప్టికల్ ఇల్యూషన్లను గీస్తున్నారు. వాటిని ఇంటర్నెట్లో పెట్టి డబ్బులు సంపాదిస్తున్నారు. మీకు ఇవి నచ్చితే ఇన్ స్ట్రాగామ్ పేజీలను ఫాలో అవ్వడం ద్వారా వాటిని మీరు ప్రతిరోజూ సాధించవచ్చు. ఎన్నో ఇన్ స్టా పేజీలు ఆప్టికల్ ఇల్యషన్లను ప్రత్యేకంగా అందిస్తున్నాయి. వీటి పుట్టుక గురించి మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ప్రస్తుతానికి ఇప్పటివరకు ఉన్న ఆధారాల ప్రకారం ఇవి గ్రీసుదేశంలో పుట్టాయని చెప్పుకుంటారు.