Optical illusion: ఈ ఆప్టికల్ ఇల్యూషన్ లో ఒకచోట టూత్ బ్రష్ ఉంది, అదెక్కడుందో 10 సెకన్లలో చెప్పేయండి-theres a toothbrush somewhere in this optical illusion tell me where it is in 10 seconds ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Optical Illusion: ఈ ఆప్టికల్ ఇల్యూషన్ లో ఒకచోట టూత్ బ్రష్ ఉంది, అదెక్కడుందో 10 సెకన్లలో చెప్పేయండి

Optical illusion: ఈ ఆప్టికల్ ఇల్యూషన్ లో ఒకచోట టూత్ బ్రష్ ఉంది, అదెక్కడుందో 10 సెకన్లలో చెప్పేయండి

Haritha Chappa HT Telugu

Optical illusion: ఆప్టికల్ ఇల్యూషన్లు ఆసక్తికరంగా ఉంటాయి. ఇక్కడ మేము ఒక ఆప్టికల్ భ్రమలు కలిగించే చిత్రంతో వచ్చాము. దీనిలో టూత్ బ్రష్ ఇరుక్కుని ఉంది. అది ఎక్కడుంతో పది సెకన్లలో కనిపెట్టేయాలి.

ఈ చిత్రంలో టూత్ బ్రష్ ఎక్కడుందో చెప్పండి (X/@piedpiperlko)

ఆప్టికల్ ఇల్యూషన్లు సాధించేందుకు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. కళ్లను, మెదడును మోసగించే ఈ ఆప్టికల్ ఇల్యూషన్లను సాధించేవారి సంఖ్య కూడా ఎక్కువే. ఇవి బ్రెయిన్ బ్లాక్స్ గమనించే సామర్థ్యాన్ని మాత్రమే కాకుండా, ఆహ్లాదకరమైన మానసిక శిక్షణను కూడా అందిస్తాయి. దృశ్య భ్రమలను పరిష్కరించడంలో మీకు ఆసక్తి ఉంటే, మీ దృష్టి చురుకుదనాన్ని పరీక్షించే మరొక ఆప్టికల్ ఇల్యూషన్ ఇక్కడ ఉంది.

టూత్ బ్రష్ ఎక్కడ?

ఆప్టికల్ ఇల్యూషన్ ను పీయూష్ తివారీ అనే వ్యక్తి ఎక్స్ (మాజీ ట్విట్టర్)లో షేర్ చేశారు. రాత్రిపూట సౌకర్యవంతమైన పిల్లల పడకగది ఇందులో ఉంది. నీలిరంగు బెడ్ షీట్ పై బంగారు ఫ్రేమ్ ఉన్న మంచంపై కర్లీ ఎరుపు జుట్టు ఉన్న ఒక పాప ప్రశాంతంగా నిద్రపోతోంది. కిటికీ గుండా, చంద్రుడు, మెరిసే నక్షత్రాలు కనిపిస్తున్నాయి. కిటికీ రెండు వైపులా నారింజ రంగు కర్టెన్లు కట్టారు. ఈ గదిలోనే ఒక టూత్ బ్రష్ కూడా ఉంది. అదెక్కడుందో కనిపెట్టడమే మీ పని.

ఆ గదిలో గులాబి రంగు గోడలు, ఎరుపు-ఊదా రంగు ఫ్లోరింగ్ ఉంటుంది. ఇది వెచ్చని వాతావరణాన్ని సృష్టిస్తోంది. వివిధ వస్తువులతో నిండిన ఒక బుక్ షెల్ఫ్ కూడా ఉంది. అందులో పుస్తకాలు, బాస్కెట్ బాల్, నీలి కుందేలు బొమ్మ, కోడి బొమ్మ ఉన్నాయి. ఇంతగా అక్కడ ఉన్న వస్తువులను ఎందుకు వివరిస్తున్నామంటే మీరు నిశితంగా ప్రతి వస్తువును, ప్రదేశాన్ని పరిశీలిస్తే టూత్ బ్రష్ దొరికే ఛాన్స్ ఉంటుంది.

పడకగదిలో దాగి ఉన్న టూత్ బ్రష్ ను 10 సెకన్లలో కనుగొనడం ద్వారా మీ కళ్ళ పదునును పరీక్షించుకోండి. మీరు కనిపెడితే మీ చూపు, మెదడు అద్భుతమని మెచ్చుకోవాల్సిందే.

ఆ పోస్ట్ ఇక్కడ చూడండి

ఆప్టికల్ ఇల్యూషన్ జవాబు

ఇప్పటికే జవాబు కనిపెట్టిన వారికి కంగ్రాట్స్. కొంచెం నిశితంగా పరిశీలిస్తే ఎవరైనా టూత్ బ్రష్ కనిపెట్టయగలరు. మీ చూపును సవాలు చేస్తే ఈ ఆప్టికల్ ఇల్యూషన్ లో టూత్ బ్రష్ బుక్ షెల్ఫ్ లోనే ఉంది. బుక్ షెల్ఫ్ కింద అలమరలో ఒక బాక్సుపైన టూత్ బ్రష్ పెట్టి ఉంది. అదే జవాబు.

వీక్షకులను నిమగ్నం చేసే, వారికి సవాలు విసిరే సామర్థ్యం వల్ల ఆప్టికల్ ఇల్యూషన్లు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. వాటిని నెటిజన్లు కాసేపు ఆగి చూసి వాటిని సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి పజిల్స్ ఆసక్తికరంగా ఉంటాయి.

ఇలాంటి ఆప్టికల్ ఇల్యూషన్లు చేధించడం వల్ల అభిజ్ఞా ప్రయోజనాలు ఎన్నో దక్కుతాయి. ఏకాగ్రతను మెరుగుపరుస్తాయి. మెదడుకు శిక్షణను ఇస్తాయి. ఇలా ఆప్టికల్ ఇల్యూషన్లు ఎక్కడ కనిపించినా సాధించేందుకు ప్రయత్నించండి. ఇవి మానసికంగా ఎంతో మేలు చేస్తాయి.

Haritha Chappa

TwittereMail
హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి https://www.linkedin.com/in/haritha-ch-288a581a8/

సంబంధిత కథనం